Batman
-
అవతార్ 2ను వెనక్కి నెట్టి అగ్ర స్థానంలో ఆర్ఆర్ఆర్
జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకున్న ఈ సినిమా ఆస్కార్‌కు చేరువలో ఉంది. ఇందులోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్‌గా సాంగ్‌గా ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు మోత మోగిస్తున్న ఈ మూవీ తాజాగా మరో అంతర్జాతీయ స్థాయి అవార్డును సొంతం చేసుకుంది. రోటెన్ టొమాటోస్ వారి గోల్డెన్ టమోటో అవార్డును ఆర్ఆర్ఆర్ గెలుచుకుంది. చదవండి: తొలిసారిగా కూతురి ఫోటోలు రివీల్ చేసిన ప్రియాంక చోప్రా రోటెన్ టొమాటోస్ సంస్థ ఈ ఏడాది నిర్వహించిన ఫ్యాన్స్ ఫేవరేట్ 2022 చిత్రాల జాబితాలో ఆర్ఆర్ఆర్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాదికి గాను గోల్డెన్ టమోటో అవార్డుకు ‘అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్, టాప్ గన్, బ్యాట్‌మెన్’ వంటి పలు హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడిన ఆర్ఆర్ఆర్ మూవీ వాటిన్నింటిని వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలవడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకుని ఆర్ఆర్ఆర్ మూవీ ఫ్యాన్స్ ఫేవరేట్ మూవీ 2022గా నిలిచినట్లు తాజాగా రోటెన్ టొమాటోస్ సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది. దీంతో 2022 ఫ్యాన్స్ ఫేవరేట్ మూవీ గోల్డెన్ టమోటో అవార్డుకు ఆర్ఆర్ఆర్ ఎన్నికైనట్లు ఈ సందర్భంగా సదరు సంస్థ వెల్లడిచింది. కాగా హాలీవుడ్‌కు చెందిన ఈ రోటెన్ టొమాటోస్ వెబ్ సైట్ ప్రతి సినిమాకు ప్రేక్షకుల రేటింగ్ ఇస్తుంటుంది. అలాగే ప్రతి ఏటా మంచి సినిమాలకు గోల్డెన్ టొమాటో అవార్డులను ప్రకటిస్తుంది. అలాగే ఈ ఏడాది ఎంతో ఆదరణ పొందిన అవతార్: ద వే ఆఫ్ వాటర్, ది బ్యాట్‌మెన్, టాప్ గన్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ వంటి చిత్రాలతో పాటు ఆర్ఆర్ఆర్ మూవీకి జనవరి 12న ఓటింగ్ నిర్వహించింది. మొదటి వారం కాస్తా తక్కువ ఓట్లు తెచ్చుకున్న ఆర్ఆర్ఆర్ రెండో వారానికి అత్యధిక ఓట్లు అందుకుని అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాత స్థానాల్లో టాప్ గన్: మావేరిక్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆన్ ఎట్ వన్స్, ది బ్యాట్‌మెన్, అవతార్: ది వే ఆఫ్ వాటర్ చిత్రాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. చదవండి: అప్పుడే ఓటీటీలోకి ‘హంట్’..స్ట్రీమింగ్ ఎక్కడంటే..? Our fans voted #RRR as the #GoldenTomato Award winner for Fan Favorite Movie of 2022! https://t.co/gSJnmq1buz pic.twitter.com/tHtk5q4dn4 — Rotten Tomatoes (@RottenTomatoes) January 30, 2023 -
Batman: ఆ స్వరం మూగబోయింది
హాలీవుడ్ న్యూస్: డీసీ కామిక్స్‌లో బ్యాట్‌మన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ క్యారెక్టర్ని ఆడియొన్స్కి అంతలా కనెక్ట్ చేసిన వ్యక్తి మాత్రం కెవిన్ కాన్రాయ్. గంభీరమైన స్వరంతో ‘ఐ యామ్ వెన్జెన్స్.. ఐ యామ్ ది నైట్.. ఐ యామ్ బ్యాట్మన్’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్.. చరిత్రలో నిలిచిపోయింది. అయితే.. దురదృష్టవశాత్తూ ఆయన ఇక లేరు. బ్యాట్మన్ యానిమేటెడ్ సిరీస్‌లో బ్యాట్మన్ క్యారెక్టర్‌కు వాయిస్ ఓవర్ అందించిన కెవిన్ కాన్రాయ్ Kevin Conroy గురువారం కన్నుమూశారు. ప్రేగు క్యాన్సర్ బాధపడుతున్న ఆయన.. 66 ఏళ్ల వయసులో న్యూయార్క్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు శుక్రవారం వార్నర్ బ్రదర్స్ సంస్థ ప్రకటించింది. మరోవైపు ఆయనకు నివాళిగా సోషల్ మీడియాలో RIP Legend హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ నడుస్తోంది. Thank you. 🦇❤️ pic.twitter.com/hB4XUy8Gw1 — Batman (@Batman) November 11, 2022 కామిక్స్ పోర్షన్ తర్వాత.. 1992-96 మధ్య బ్యాట్మన్ యానిమేటెడ్ సిరీస్‌లు విపరీతంగా జనాదరణను సంపాదించుకున్నాయి. అందులో 15 చిత్రాలు, 400 టీవీ ఎపిసోడ్స్, 20కిపైగా వీడియోగేమ్స్, బ్యాట్మన్:ఆర్ఖామ్ అండ్ ఇన్జస్టిస్ ఫ్రాంచైజీలకు వాయిస్ ఓవర్ అందించారు కాన్రాయ్. తద్వారా బ్యాట్మన్ క్యారెక్టర్‌కు జనాల్లో విపరీతమైన ఆదరణ తీసుకొచ్చారాయన. RIP LEGEND @RealKevinConroy 🦇 Thank you for bringing Batman to life with your Iconic voice 🙏#KevinConroy #Batman pic.twitter.com/dMUgnBteqL — DC World Telugu (@DCWorldTelugu) November 11, 2022 న్యూయార్క్ వెస్ట్బ్యూరీలో జన్మించిన కెవిన్ కాన్రాయ్.. థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. 1980 నుంచి టీవీ యాడ్స్ ద్వారా నటనలోకి అడుగుపెట్టి.. చాలాకాలం బుల్లితెర ప్రజలను అలరించారు. ఆపై కొన్ని చిత్రాలు, టీవీ సిరీస్‌ల్లోనూ మెరిశారు. 1991లో క్యాస్టింగ్ డైరెక్టర్ ఆండ్రియా రొమానో ద్వారా బ్యాట్మన్ సిరీస్‌కు వాయిస్ ఓవర్ అందించడం ప్రారంభించారు. కామిక్స్‌పై ఏమాత్రం అవగాహన లేని కాన్రాయ్.. బ్రూస్ వేన్(బ్యాట్మన్) పాత్రకు తన గాత్రంతో జీవం పోశారు. హాలీవుడ్లో ‘గే’ సెలెబ్రిటీగా ఈయనకు పేరుంది. చివరిరోజుల్లో ఆయన వాన్ సి. విలియమ్స్ అనే వ్యక్తిని వివాహం చేసుకోవడం గమనార్హం. Kevin Conroy was an idol to me. I looked up to him growing up. I watched the animated series, watched the animated movies, shorts and played all the Arkham games. I'm glad I was even able to meet him this year. He was an awesome guy. RIP legend. You will be missed Batman 🦇❤ pic.twitter.com/noGLyWVLvn — Dan 🦇 (@Sandwich_Rock_) November 11, 2022 ఇదీ చదవండి: ఇది.. మనిషిని మొత్తం కరిగిపోయేలా చేసిన సినిమా! -
ది బ్యాట్ మ్యాన్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
హాలీవుడ్ హై ఓల్టేజ్ యాక్ష న్ థ్రిల్లర్ చిత్రం 'ది బ్యాట్‌మ్యాన్' తమిళం, తెలుగు, హిందీ, ఆంగ్లం భాషల్లో మార్చి 4న తెరపైకి రానుంది. ఈ చిత్రాన్ని మ్యాట్ రీవ్స్ దర్శకత్వంలో వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇది ఇంతకు ముందు వచ్చిన బ్యాట్‌మ్యాన్ చిత్రానికి సీక్వెల్. ఇందులో నటుడు రాబర్ట్ ప్యాటిన్సన్ కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా రెండు అసాధారణ పాత్రల్లో ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఇది భావోద్వేగాలతో కూడిన శక్తివంతమైన యాక్షన్‌తో కూడిన బ్రహ్మాండ దృశ్యకావ్యంగా ఉంటుందని చిత్ర నిర్వాహకులు పేర్కొన్నారు. చిత్రంలో ఇంతకుముందెప్పుడూ చూడ ని అబ్బురపరిచే పలు సన్నివేశాలు ఉంటాయన్నారు. ఆధునిక సాంకేతికతో దర్శకుడు మ్యాట్ రీవ్స్ అద్భుతంగా సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించిన చిత్రం ఇదని యూనిట్ వర్గాలు తెలిపారు. -
అత్యధిక నిడివి ఉన్న చిత్రం ఇదేనట !.. భారీగా అంచనాలు
Robert Pattinson Batman Movie Runs Nearly 3 Hours: ప్రపంచవ్యాప్తంగా బ్యాట్‌మ్యాన్ సినిమాలకు ఉన్న క్రేజ్ మాములుగా ఉండదు. ఈ సిరీస్‌లో వచ్చిన చిత్రాలు ఆడియెన్స్‌ను ఎంతగానో అలరించాయి. ఈ ఫ్రాంచైజీ నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తారు. హాలీవుడ్లో సూపర్ హీరోస్ మూవీస్ సహజమే. మిగతా సూపర్ హీరోస్‌కు పవర్స్ అనుకోకుండా జరిగే పలు సంఘటనల ద్వారా వస్తాయి. కానీ బ్యాట్ మ్యాన్ మాత్రం తనకు తాను సొంతగా సూపర్ హీరోల మారతాడు. అది ఎలానో 2005లో వచ్చిన 'బ్యాట్‌మ్యాన్: బిగిన్స్' చిత్రం చూస్తే తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల బ్యాట్‌మ్యాన్ సిరీస్ కొత్త చిత్రం 'ది బ్యాట్‌మ్యాన్: ది బ్యాట్ అండ్ ది క్యాట్' ట్రైలర్ విడుదలైంది. (చదవండి: 'స్క్విడ్ గేమ్' మళ్లీ రానుంది.. ఈసారి ఎలాంటి గేమ్ ?) విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ ట్రైలర్ వైరల్‌గా మారింది. ఇందులో సూపర్ హీరోగా 'ట్విలైట్' మూవీ ఫేమ్ రాబర్ట్ ప్యాటిన్సన్ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఒక కొత్త విషయం చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా నిడివి ఈ సిరీస్‌లోని మిగతా చిత్రాలకంటే ఎక్కువగా ఉండనుందట. ఈ సిరీస్‌లో వచ్చిన 'ది బ్యాట్‌మ్యాన్: బిగిన్స్' రన్‌టైం 2 గంటల 20 నిమిషాలు, 'ది డార్క్‌నైట్' నిడివి 2 గంటల 32 నిమిషాలు ఉంది. వీటి తర్వాత 2012లో వచ్చిన 'ది డార్క్‌నైట్ రైజెస్' మూవీ రన్‌టైం 2 గంటల 45 నిమిషాలు ఉంది. కాగా ప్రస్తుతం రానున్న 'ది బ్యాట్ అండ్ ది క్యాట్' చిత్ర నిడివి సుమారు 2 గంటల 55 నిమిషాలు ఉండనుందట. అంటే దాదాపు 3 గంటలు. (చదవండి: నా కొడుకు హృతిక్‌లా ఉండాలి.. కానీ: స్టార్ హీరోయిన్) హాలీవుడ్లో విడుదలైన సూపర్ హీరో చిత్రాలు 'జాక్ స్నైడర్ జస్టీస్ లీగ్' రన్‌టైం 4 గంటల 2 నిమిషాలు, 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' నిడివి 3 గంటల 1 నిమిషం తర్వాత అతి పెద్ద రన్‌టైం ఉన్న సినిమా ఇదేనని సమాచారం. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు విడుదలైన రెండు ట్రైలర్స్‌కు కూడా మంచి ఆదరణ లభించింది. -
‘జోకర్’ బీభత్సం: రైల్లో మంటలు.. 10 మందికి గాయాలు
టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలో ఆదివారం హాలోవీన్ కార్యక్రమం జరిగింది. చిత్ర విచిత్రమైన గెటప్పుల్లో వచ్చి జనాలను భయభ్రాంతులకు గురి చేయడమే దీని ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ప్రతి ఏటా అక్టోబర్ 31న హాలోవీన్ సంబరాలు నిర్వహిస్తాయి. ఈ క్రమంలో జపాన్‌లో హాలోవీన్ సందర్భంగా బ్యాట్‌మ్యాన్ సినిమాలో విలన్ ‘జోకర్’ వేషధారణలో వచ్చిన ఓ వ్యక్తి రైల్లో బీభత్సం సృష్టించాడు. ట్రైన్లో మంట పెట్టాడు.. కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. ఆ వివరాలు.. 29 ఏళ్ల యువకుడు ఒకరు హాలోవీన్ సందర్భంగా బ్యాట్‌మ్యాన్ సినిమాలో విలన్ ‘జోకర్’లా తయరయ్యాడు. అనంతరం రద్దీగా ఉండే షింజుకు రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. రైలు ఎక్కిన తర్వాత చేతిలో కత్తి, యాసిడ్ బాటిల్‌తో లోపల ఉన్న ప్రయాణికులను భయపెట్టాడు. అంతటితో ఆగక 60 ఏళ్ల వృద్ధుడిపై కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆ పెద్దాయన పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. అంతేకాక సదరు వ్యక్తి ట్రైన్ చుట్టూ ఒకలాంటి ద్రవం పోసి.. మంటపెట్టాడు. (చదవండి: కొత్త లుక్‌తో భయపెడుతున్న మెగాస్టార్.. షాక్‌లో అభిమానులు!) అతడి చర్యలకు కంపార్ట్మెంట్లో ఉన్న ప్రయాణికులు బిక్కచచ్చిపోయారు. కొందరు కిటికీలోంచి బయటకు దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ మార్గంలో ఓ ఎమర్జెన్సీ స్టాప్ ఉండటంతో రైలు అక్కడ ఆపి.. అందరూ బయటకు పరుగు తీశారు. సదురు జోకర్ వేషదారి చేసిన పనుల వల్ల సుమారు 10మంది గాయపడినట్లు సమాచారం. (చదవండి: ఈ ద్రాక్ష పండ్ల గుత్తి రూ.లక్షల్లో.. ఒక్క పండు రూ.33 వేలంట..) అప్పటికే విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఎమర్జెన్సీ స్టాప్ వద్దకు చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించడమే కాక ప్రయాణికులకు సాయం చేశారు. ప్రత్యక్ష సాక్షి ఒకరు మాట్లాడుతూ.. ‘‘జోకర్ గెటప్‌లో వచ్చిన సదరు వ్యక్తి హాలోవీన్ స్టంట్‌లో భాగంగా ఇలా చేసి ఉంటాడని భావిస్తున్నాం. ఎందుకంటే ట్రైన్ ఆగిన తర్వాత అతడు అక్కడ నుంచి నింపాదిగా నడుచుకుంటూ బయటకు వెళ్లిపోయాడు’’ అని తెలిపాడు. చదవండి: Halloween 2021: దెయ్యాల్లా మారిన మన స్టార్స్‌ని గుర్తుపట్టారా? -
అదిరిపోయే యాక్షన్ సీన్స్‌తో కొత్త ‘బ్యాట్‌మ్యాన్’
హాలీవుడ్ మూవీస్‌లో బ్యాట్‌మ్యాన్ సిరీస్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిందే. ఈ సిరీస్‌లో వచ్చిన మూవీస్ అభిమానులను ఎంతో అలరించాయి. అయితే ఎప్పటి నుంచో ఈ సిరీస్ మరో సినిమా కోసం వేచి చూస్తున్న ఫ్యాన్స్‌ని ట్రైలర్‌తో సర్ఫ్రైజ్ చేశారు మేకర్స్. డీసీ నిర్వహించిన ఫ్యాన్డమ్ ఈవెంట్లో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. వార్నర్ బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో రాబర్ట్ ప్యాటిన్సన్ కొత్త బ్యాట్‌మ్యాన్‌గా నటిస్తున్నాడు. ఈ ట్రైలర్లో అన్ని మూవీస్‌లాగే యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రాన్ని మొదట జూన్ 21న విడుల చేయాలని భావించారు. కోవిడ్ కారణంగా చిత్రీకరణ ఆలస్యమవుతూ కావడంతో అనంతరం అక్టోబర్ 1న రిలీజ్ చేయాలనుకున్నారు. కాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడగా.. మార్చి 4, 2022న సినిమా థియేటర్లలో విడుదల చేయనున్నారు. చదవండి: సరికొత్తగా రాబోతున్న సూపర్‌మ్యాన్.. షాక్‌లో ఫ్యాన్స్ -
భావోద్వేగ దృశ్యం: కన్నీళ్లు ఆగడం లేదు
న్యూఢిల్లీ: క్యాన్సర్ వ్యాధితో చివరి రోజులు లెక్కబెడుతున్న ఓ చిన్నారి కోరికను తీర్చేందుకు వైద్యుడు బ్యాట్మెన్గా కనిపించిన వీడియో నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తోంది. ఫీల్ గుడ్ అనే ట్విటర్ పేజీలో శనివారం షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలోని నార్త్ డకోటాకు చెందిన ఓ డాక్టర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న అయిదేళ్ల చిన్నారి కోసం బాట్‌మెన్ వేషం వేసి ఆనందపరిచిన ఈ వీడియో ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకుంటోంది. దీంతో ఆ వైద్యుడిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 44 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో క్యాన్సర్ బాధిత చిన్నారిని నీ అతి పెద్ద కోరిక ఏంటి అని అడిగినప్పుడు...ఆ చిన్నారి తన అభిమాన సూపర్ హీరో బ్యాట్‌మెన్‌ను కలవాలన్న కోరిక వెల్లడించాడు. (చదవండి: అమిత్‌షా ట్విట్టర్ ఖాతా తాత్కాలిక నిలిపివేత) దీంతో కొంత సమయం తర్వాత ఆ డాక్టర్ బ్యాట్‌మెన్ దుస్తులు ధరించి ఆస్పత్రి కారిడార్‌లో చిన్నారికి ఎదురుగా వచ్చాడు. ఆ చిన్నారిని దగ్గరకు పిలిచి తనని హత్తుకొమ్మని అడిగాడు. ఆ బాలుడు హత్తుకోగానే... నిన్ను ఇబ్బంది పెడుతున్న మహమ్మారితో ధైర్యంగా పోరాడు అంటూ ధైర్యాని నింపాడు. ఈ వీడియో షేర్ చేసిన గంట వ్యవధిలోనే వేలల్లో వ్యూస్ వందల్లో కామెంట్స్ వచ్చాయి. ‘నేను దీన్ని పదిసార్లు చూశాను.. చూసిన ప్రతిసారి భావోద్యేగానికి లోనయ్యాను’, ‘ఈ వైద్యుడిని అతడి కుటుంబాన్ని దేవుడు ఆశ్వీర్వాదించాలని, ఆ దేవుడు చిన్నారిని క్యాన్సర్ నుంచి స్వస్థపరచాలని వేడుకుంటున్న’అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. (చదవండి: ఈ నెలలో ఇదే పెద్ద జోక్!) -
బ్యాట్‌మ్యాన్ హీరోకు కరోనా?
హాలీవుడ్ నటుడు, బ్యాట్‌మ్యాన్ హీరో రాబర్ట్ పాటిసన్‌కు కరోనా సోకిందట. ప్రస్తుతం లండన్‌లో జరుగుతున్న ‘బ్యాట్‌మ్యాన్’ చిత్రీకరణను కొన్ని రోజుల పాటు నిలిపివేశారు. ఈ విషయం గురించి చిత్రనిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ మాట్లాడుతూ – ‘‘బ్యాట్‌మ్యాన్’ చిత్రబృందంలో ఒక కీలక వ్యక్తికి కరోనా సోకడంతో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అతన్ని ఐసోలేషన్‌లో ఉంచాం. మా చిత్రీకరణను కొన్ని రోజులు నిలిపివేస్తున్నాం’’ అన్నారు. కానీ ఆ కీలక వ్యక్తి ఎవరు అని ప్రకటించలేదు. అయితే కథానాయకుడు రాబర్ట్ పాటిసన్కే కరోనా సోకిందన్నది హాలీవుడ్ మీడియా కథనం. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో చిత్రీకరణ ప్రారంభం అయిన తొలి చిత్రం ‘బ్యాట్‌మ్యాన్’. మరి.. ఈ యూనిట్లో ఒకరికి కరోనా సోకడంతో మిగిలిన చిత్రబృందాలు వెనకడుగు వేస్తాయా? మరింత జాగ్రత్తలు పాటిస్తాయా? అని హాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. -
బ్యాట్‌మేన్ టీజర్ రెడీ
సూపర్ హీరో బ్యాట్‌మేన్ ని పలు చిత్రాల్లో చూశాం. ఇప్పుడు మరోసారి బ్యాట్మేన్ని చూడబోతున్నాం. ‘బ్యాట్‌మేన్’ టైటిల్‌తో సరికొత్త తరహాలో ఈ చిత్రాన్ని మాట్ రీవెస్ దర్శకత్వంలో వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మిస్తోంది. రాబర్ట్ పాటిన్సన్ బ్యాట్‌మేన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ లాక్డౌన్ ముందే ప్రారంభమయింది. లాక్డౌన్ వల్ల చిత్రీకరణకు అంతరాయం ఏర్పడింది. మళ్లీ షూటింగ్‌ను ప్రారంభించారు. లాక్డౌన్ తర్వాత షూటింగ్ ప్రారంభించిన తొలి భారీ చిత్రమిదే. ఈ సరికొత్త బ్యాట్‌మేన్ సినిమా గురించి ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎలా ఉండబోతోందో శాంపిల్ చూపించడానికి డేట్ సిద్ధం చేసింది చిత్రబృందం. ఈ నెల 22న ఈ చిత్రానికి సంబంధించిన తొలి టీజర్‌ను విడుదల చేయనున్నారు. ‘డీసీ ఫ్యాన్డమ్’ అనే ఆన్లైన్ ఈవెంట్ ఒకటి ఆగస్ట్ 22న జరగనుంది. ఈ ఈవెంట్లో ఈ టీజర్‌ను విడుదల చేయనున్నారు. సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. -
స్పైడర్‌మేన్, బ్యాట్‌మేన్, ఐరన్మేన్లు కలిస్తే..
సాక్షి, న్యూఢిల్లీ : ‘హాలీవుడ్‌కు స్పైడర్ మేన్, బ్యాట్‌మేన్, ఐరన్మేన్లు ఉంటే కేరళ వాసులకు వీరందరు కలిసిన ఫిషర్మెన్’ ఉన్నారన్న కొటేషన్‌తో కేరళ వరద ప్రాంతాల్లో మత్స్యకారులు లేదా జాలర్లు అందించిన సేవలను సోషల్ మీడియా, ముఖ్యంగా వాట్సాప్ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. వారి సహాయక చర్యలు అమోఘమని చెప్పడానికి పడవ పక్కన ఎర్రటి వర్షపు కోటును ధరించి కుడి చేతిలో భారీ తెడ్డును పట్టుకొని ఠీవీగా నిలబడిన మత్స్యకారుడి ఫొటోను కొటేషన్ కింద పొందుపర్చారు. ఇక పక్క పడవలో కేరళ రాష్ట్ర నమూనాను చూపించారు. సమాజంలోని విద్యార్థులు, వృత్తినిపుణులు, నావికులు, సాయుధ దళాల సిబ్బంది కుల, మత భేదాలు లేకుండా నిస్వార్ధంగా వరద సహాయక చర్యల్లో నిమగ్నమైనప్పుడు ఒక్క మత్స్యకారుల సేవలనే కొనియాడడం సమంజసం కాదని కొందరికైనా అనిపించవచ్చు. కానీ కేరళ వాసుల్లో సామాజికంగా బాగా వెనకబడిన అట్టడుగు వర్గాల వారు మత్స్యకారులు. మనష్యులకు దూరంగా బతికే సముద్రపు అల్లకల్లోల ప్రపంచం వారిది. ఏ పూటకాపూట వెతుక్కునే జీవితాలు వారివి. ఇతర మానవ సమాజంతో వారు కలిసేదే బహు తక్కువ. చేపల వేట నుంచి రాగానే వారు తెగిన వలల పోగులను అల్లుకొనో దెబ్బతిన్న పడవల మరమ్మతు చేసుకొనో మళ్లీ రేపటి వేటకు సిద్ధమవుతారు. రాత్రికి ఇంత తిని పడుకుంటారు. వారికి పక్కా ఇళ్లుగానీ, ఇళ్ల పట్టాలుగానీ ఏ ప్రభుత్వం ఏనాడు కల్పించలేదు. వారు ఏనాడు డిమాండ్ చేయనూ లేదు. అలాంటి వారు నిస్వార్థంగా సేవలందించడం ఎప్పటికీ ఎనలేనిదే. ముఖ్యంగా పట్టణం తిట్ట, అలప్పూజ, ఎర్నాకులం, త్రిశూర్ ప్రాంతాల్లో వారు అందించిన సేవలు అమోఘం. దాదాపు వెయ్యి మంది జాలర్లు, ఐదు వందల బోట్లతో, సొంత డబ్బుతో ఇంధనం కొని సేవలు అందించడం మామూలు విషయం కాదు. కాకపోతే సముద్రపు అలల్లో, ప్రమాదకర పరిస్థితుల్లో బోట్లను నడిపిన అనుభవం వారికి సహాయక చర్యల్లో ఎంతో ఉపయోగపడింది. ఒక్క అలప్పూజా ప్రాంతంలోనే వారు 16000 మంది ప్రజల ప్రాణాలను రక్షించారని ఆ జిల్లా కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. ‘అరే సరిగ్గా చదువుకోకపోతే మత్స్యకారుడివి తప్పా మరేమి కావంటూ మా ట్యూషన్ మాస్టర్ తిట్టినప్పుడు నిజంగా బాధ పడేవాడిని. నిజంగా నేడు వారిని చూస్తే గర్వంగా ఉంది. నీట మునిగిన ఓ విలాసవంతమైన అపార్ట్మెంట్ నుంచి నా సోదరిని రక్షించి తీసుకొచ్చారు. అందుకు ప్రతిఫలంగా తీసుకోవాల్సిందిగా ఓ నోట్ల కట్టను అందజేసినా, తమరు తమకు సోదరి లాంటి వారేనంటూ డబ్బును తిరస్కరించినట్లు నా సోదరి ఏడుస్తూ చెప్పడం నాకు ఏడుపు తెప్పించింది’ ఒకరు వాట్సాప్‌లో సందేశం పెట్టారు. ఇలాంటి సందేశాలు మరెన్నో! వైరల్ అవుతున్నాయి. సహాయక చర్యలతో మత్స్యకారుల పాత్ర ముగిసింది. ఇందులో వారు పలువురు గాయపడ్డారు. కొందరి బోట్లు కూడా దెబ్బతిన్నాయి. కేరళ పునర్నిర్మాణంలో వారి పాత్ర ఎలాగు ఉండదు. త్వరలోనే వారిని ప్రజలు మరచిపోవచ్చు. నేడు మత్స్యకారుల సేవలను కొనియాడుతూ కొన్ని రాజకీయ పార్టీల నాయకులు వారికి శాలువాలు కప్పి సన్మానాలు చేస్తున్నారు. భారీ ఉపన్యాసాలతో ఊదరగొడుతున్నారు. రాజకీయావసారాల కోసం మాట్లాడడం ఆ తర్వాత మరచిపోవడం రాజకీయ నాయకులకు అలవాటే. కానీ ప్రజలు అలా వారి సేవలను మరచిపోరాదు. తమ ప్రాణాలను కాపాడిన మత్స్యకారులను తర్వాతనైనా గుర్తించి అన్ని విధాల ఆదుకునే ప్రయత్నం చేయాలి. వాస్తవానికి గతేడాది వచ్చిన ‘ఓఖీ’ తుపానులో ఈ నాటి వరదల కన్నా ఎక్కువ మంది మత్స్యకారులు మరణించారు. వారి పాకలు కొట్టుకుపోయాయి. వారికి అందిన సహాయం అంతంత మాత్రమే. వారిది రోజూ చస్తూ బతికే జీవితమే. అధికారిక లెక్కల ప్రకారమే చేపల వేటకు వెళ్లన మత్స్యకారుల్లో నాలుగు రోజులకు ఒకరు చొప్పున మరణిస్తున్నారట. ప్రజలే ముందుగా తమకు సాయం చేసిన మత్స్యకారులను గుర్తించాలి, ముఖ్యంగా పడవలు దెబ్బతిన్న వారిని గుర్తించి, వారి పడవలకు మరమ్మతులు చేయించాలి. అవసరమైన వారికి వలలు కొనివ్వాలి. ఆ తర్వాత వారి ఇళ్ల స్థలాల కోసం వారి తరఫున ప్రభుత్వంతో పోరాడి ఇప్పించాలి. అందులో సహాయక చర్యల్లో పాల్గొన్న వారికే ప్రాధాన్యత ఉండేలా చూడాలి. ఆ తర్వాత వారి ఇళ్ల నిర్మాణానికి సహకరించాలి. వారికి జాతీయ, రాష్ట్ర రిస్క్యూ టీముల్లో ఉద్యోగాలు వచ్చేలా చూడాలి. అంతిమంగా వారి సేవలు చిరస్మరణీయంగా ఉండేలా ఓ మెమోరియల్ లాంటిది ఏర్పాటు చేయాలి. వారి సహకార సంఘం కార్యకలాపాలు అక్కడి నుంచే ప్రారంభించేలా ఉంటే ఇంకా బాగుండవచ్చు. వీటి సాధన కోసం నవంబర్ 21న రానున్న మత్స్యకారుల దినోత్సవాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం మంచిదేమో! -
ఆ దిగ్గజ క్రికెటర్లు నా దగ్గరకు వస్తారు!
సాక్షి, ముంబై: ఐపీఎల్ క్రికెట్ అంటే దంచుడే, దంచుడు. ఏ బ్యాట్స్‌మన్ అయినా దొరికిన బంతిని బలంగా బాదడం తప్పనిసరి. సిక్సర్ల వర్షంతో ఎలాంటి బ్యాటయినా విరిగిపోవడం, పాడవడం పరిపాటి. అయితే అవన్నీ మామూలు బ్యాట్లయితే పర్లేదు. వాటిని పక్కన పడేసి కొత్త బ్యాట్లందుకుంటారు బ్యాట్స్‌మెన్. కానీ ఎంతో అచ్చొచ్చిన బ్యాటయితే ఎలా మరి? దాన్ని త్వరగా, చక్కగా బాగుచేసి బ్యాట్స్‌మెన్‌ను బతికించేదెవరు? అనే ప్రశ్నకు సమాధానం ముంబైకి చెందిన అస్లాం చౌదరీ. అతన్ని ముద్దుగా అందరూ ఐపీఎల్ ‘బ్యాట్మన్’. అని పిలుస్తారు. ఎప్పుడో 1920లో తన తండ్రి ప్రారంభించిన బ్యాట్ల తయారీ వర్క్ షాప్‌ని అస్లాం నిర్వహిస్తున్నారు. షాప్ పాతదే అయినా.. తన కళా నైపుణ్యంతో నాణ్యమైన బ్యాట్లని తయారు చేసి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు చౌదరీ. ఎప్పడూ బ్యాట్ల తయారీలో తీరిక లేకుండా మునిగి పోయే 65 ఏళ్ల అస్లాం ఐపీఎల్ సీజన్ వస్తే ఇంకాస్త బిజీ అయిపోతారు. తమకు బాగా కలిసొచ్చిన బ్యాట్లను రిపేరు చేయడానికి గొప్ప క్రికెట్ స్టార్లు ఆయనను ఆశ్రయిస్తారు. అస్లాం ఆదివారం ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బ్యాట్ల తయారీ ప్రస్థానాన్ని వివరించారు. తండ్రి చూపిన దారిలో పయనిస్తూ తన నాణ్యమైన క్రికెట్ బ్యాట్ల తయారీ పరంపరను చెప్పుకొచ్చారు. ఎప్పుడూ క్రికెటర్ల మేనేజర్లు, సహాయక సిబ్బంది ఫోన్ చేసి ఆయా స్టార్ల బ్యాట్లకు మరమ్మతులు చేయాలని పిలుస్తుంటారు. కానీ ఒకసారి స్వయంగా విరాట్ కోహ్లి ఫోన్ చేశాడని, తాను ఒక్క క్షణంపాటు.. మాట్లాడేది విరాట్ కాదేమోనని సంశయించానని అస్లాం తన ఆనందం వ్యక్తం చేశారు. సచిన్, డుప్లెసిస్, స్టీవ్ స్మిత్, క్రిస్ గేల్ వంటి దిగ్గజ క్రికెటర్లకు బ్యాట్లు అందించానని ఈ బ్యాట్మన్ చెప్పుకొచ్చారు. అయితే ‘‘ఐపీఎల్ సీజన్లో బ్యాట్లకు మరమ్మతులు చేయడం కొంచెం ఇబ్బందే. ఎందుకంటే తమ సెంటిమెంట్ బ్యాట్ దెబ్బతిన్నప్పుడు ఏ ఆటగాడికైనా ఏం చేయాలో పాలుపోదు. వారు ఆడబోయే మరుసటి మ్యాచ్‌కి బ్యాట్ మరమ్మతులు పూర్తి కావాలి. దాంతో కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది.’’ అని అస్లాం తెలిపారు. తన వద్దకు మరమ్మతులకు వచ్చే బ్యాట్లకు ఎక్కువగా.. వాటి ఆకృతిని సరిచేయడం, బ్యాట్ అంచులు పెంచడం లేక తగ్గించడం చేస్తుంటానన్నారు. బ్యాట్ల రిపేర్ కోసం క్రికెటర్లు ఉండే చోటుకి వెళ్లి వాటిని తెస్తుంటానని, ఎందుకంటే, ఈ ఇరుకు వీధుల్లోకి ఆటగాళ్లు వస్తే మళ్లీ తిరిగి వెళ్లడం చాలా కష్టమని చెప్పారు. ఒకసారి శ్రీలంక బ్యాట్స్‌మన్ లసిత్ మలింగ అలా వచ్చి ఇరుక్కుపోయాడని, దాదాపు రెండు గంటలు మా షాప్‌లోనే నిరీక్షించి పోలీసుల సాయంతో బయటపడ్డాడని గుర్తు చేసుకున్నారు. కాగా, ఇప్పటికీ చేతితో బ్యాట్లను తయారు చేసే అతి కొద్ది మందిలో అస్లాం ఒకరు. -
క్రిమినల్స్ పనిపడుతున్న 'బ్యాట్ మ్యాన్'!
మాస్కోః సమాజంలో చీడపురుగుల్ని ఏరి పారేయాలంటే ఏదో అద్భుత శక్తి ఉద్భవించాల్సిందే.. అలాగే చట్టాన్నీ, పోలీసుల్నీ తప్పించుకుని తిరిగే అక్రమార్కులను అంతం చేయాలన్నా అటువంటి వారివల్లే కావాలి. అందుకే మన దర్శకులు అలాంటి పాత్రలను సృష్టించి వారిని హీరోలుగా చూపిస్తుంటారు. కానీ మాస్కోలో దుష్టశక్తులను చీల్చి చెండాడేందుకు నిజంగానే ఓ వ్యక్తి రంగంలోకి దిగాడు. చీకటి పనులకు పాల్పడే క్రిమినల్స్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు. రష్యాలోని మాస్కో శివారు ప్రాంతమైన కిమ్కీలో మారువేషం ధరించి వచ్చే మనిషి.. స్థానిక నేరస్థుల పనిపడుతున్నాడు. సమాజానికి చెడు తలపెట్టే ప్రతి వ్యక్తిపై దృష్టి సారిస్తున్న 'బ్యాట్ మ్యాన్' వివరాలను తాజాగా ఓ ట్యాక్సీ డ్రైవర్ వివరించాడు. ఎక్కడ అన్యాయం, హింస, అవినీతి ఉంటుందో అక్కడ తాను ప్రత్యక్షమౌతానంటూ ఛాలెంజ్ చేస్తున్న ఆ అపరిచితుడు.. బ్యాట్ మ్యాన్ దుస్తులతో ముసుగు ధరించి వచ్చి.. నేరస్థులను చితకబాది వదిలిపెడుతున్నట్లు చెప్పాడు. గతనెల్లో జరిగిన ఇటువంటి ఘటనపై వివరాలు వెల్లడించిన ట్యాక్సీ డ్రైవర్.. ఘటనతర్వాత అక్కడకు వచ్చిన పోలీసులు.. సదరు క్రిమినల్స్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపాడు. హీరోలా వచ్చి విలన్ల లాంటి క్రిమినల్స్ పనిపడుతున్న ఆ ముసుగు వ్యక్తిని ఇప్పుడు కిమ్కీ వాసులు 'కిమ్కీ బ్యాట్ మ్యాన్' అని పిలుస్తున్నారు. గత నెల్లో జరిగిన ఘటనలో సదరు ముసుగు వీరుడు.. అర్థరాత్రి సమయంలో ఓ భవనంలోకి ప్రవేశించి, అక్కడివారిని చితకబాది వదిలి పెట్టాడని, తర్వాత ఆ భవనం డ్రగ్ డెన్ గా తెలిసిందని ట్యాక్సీ డ్రైవర్ పోలీసులకు తెలిపిన వివరాలను బట్టి తెలుస్తోంది. దీంతో ఇప్పడా బ్యాట్ మ్యాన్ వివరాలు తెలుసుకునేందుకు ఓ రష్యా పత్రిక పరిశోధనలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సదరు వ్యక్తి పోలీసులకు ట్వీట్ చేసిన లేఖను సంపాదించింది. నేరస్థులపై వన్ మ్యాన్ ఆర్మీలా యుద్ధం చేస్తానని, మానవత్వానికి మొదటి హీరో తానేనంటూ తనను తాను అభివర్ణించుకున్న అతడు.. తన పేరు రీపర్ అంటూ ఆ లేఖలో తెలిపాడు. తన ప్రయత్నానికి పోలీసుల అండదండలు కావాలని లేఖద్వారా విన్నవించాడు. తాను చట్టానికి వ్యతిరేకం కాదని, పోలీసులు వెళ్ళలేని ప్రాంతాలకు సైతం తాను వెళ్ళి, అక్కడి నేరగాళ్ళు, డ్రగ్ మాఫియా, రేపిస్టులవంటి వారి పని పడతానని అందుకు సమాచారం ఇచ్చి సహకరించాలని పోలీసులను లేఖలో కోరాడు. తన ట్విట్టర్ పేజీ (Twitter page, @JnecReaper) ద్వారా నేరస్థుల సమాచారాన్ని తనకు కిమ్కీ వాసులెవ్వరైనా అందించవచ్చని కూడ తెలిపాడు. ఇప్పటికే నేరస్థుల విషయంలో పోలీసులకు సహకరించానని, ఎన్నో డ్రగ్ ల్యాబ్స్ ను నాశనం చేశానని లేఖలో వివరించిన అతడి ట్విట్టర్ అకౌంట్ తెరిస్తే మాత్రం 'ఇది ఆరంభం మాత్రమే' అని ఉందట. -
బ్యాట్మన్ కారులో పెళ్లికొడుకు బరాత్
-
బ్యాట్మన్ కారులో పెళ్లికొడుకు బరాత్
పెళ్లి జీవితంలో వచ్చే అత్యంత అరుదైన ఘట్టం. దానిని మధుర జ్ఞాపకంగా మలుచుకోవాలనుకున్నాడేమో ఈ పెళ్లికొడుకు. సూపర్‌హీరో బ్యాట్మన్ డ్రైవర్‌గా పెట్టుకొని బ్యాట్ మొబైల్ వాహనంలో అత్యంత ఘనంగా పెళ్లిమంటపానికి వచ్చాడు పవన్‌దీప్ సింగ్. బాజాభజంత్రిలతో బరాత్ ముందు సాగుతుండగా.. అత్యంత వినూత్నమైన బ్యాట్ మొబైల్లో పెళ్లి మంటపానికి వచ్చిన ఆయన అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. లండన్‌లోని హౌన్స్లోకు చెందిన పవన్‌దీప్-సందీప్ కౌర్ వివాహం గత సెప్టెంబర్ 12న జరిగింది. ఈ వివాహంలో అందరినీ ఆకర్షించింది బ్యాట్మన్ సినిమాలో ఉపయోగించిన బ్యాట్ మొబైల్ వాహనం. ఈ వాహనాన్ని బ్యాట్మన్ వేషధారి నడుపుతూ వరుడిని పెళ్లిమంటపం దగ్గర దింపాడు. ఈ అరుదైన పెళ్లికొడుకు వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్నది. మొత్తానికి ఈ వినూత్న ప్రయత్నం ఆయన వివాహాన్ని ఓ మధురస్మృతిగా మార్చి ఉంటుంది. -
సర్దార్జీ పెళ్లా మజాకా!
పెళ్లంటే? పందిళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, బ్యాండ్ బాజా బారాత్‌లు.. ఆగండాగండి.. ఇది మీరనుకునే మామూలు పెళ్లి కాదు. సర్దార్జీ షాదీ! తాళి, తలంబ్రాల మాటేమోగానీ, బారాత్ (ఊరేగింపు)లో ఈయన సృష్టించిన అలజడి (నిజానికి సందడి అనాలేమో) అంతా ఇంతాకాదు! ఇంతకీ సర్దార్జీ ఏం చేశారంటే.. సాధారంణంగా ఏ గుర్రంపైనో లేదంటే టాప్‌లెస్ కారులోనే ఊరేగింపుగా వస్తారు పెళ్లికొడుకులు. ఈయన మాత్రం బ్యాట్‌మొబైల్‌లో వచ్చాడు. బ్యాట్ మొబైల్ అంటే ఏమిటో తెలుసుగా.. కామిక్ హీరో బ్యాట్మన్ వాహనం! మరి ఆ వాహనాన్ని మామూలు మనుషులు నడపలేరు. కాబట్టి.. బ్యాట్మన్ చేతే వాహనాన్ని డ్రైవ్ చేయించాడు సర్దార్జీ! వరుడి బంటు పాత్రలో ఒద్దికగా ఒదిగిపోయిన బ్యాట్మన్.. పెళ్లి కూతురి ఇల్లు రాగానే 'మహారాజరాజశ్రీ సర్దార్జీ గారు వేంచేశారహో..' అంటూ పెద్ద పెట్టున అరిచి సందడిలో మునిగిపోయిన పెళ్లింటి వారిని అలర్ట్ చేశాడు. కార్ డోర్ తెరిచి.. బ్లింగ్ అవుతున్న సింగ్ గారిని పెళ్లింటిలోకి పంపేశాడు. ఏ ఊళ్లో జరిగిందీ, ఆ సర్దార్జీ పేరు ఇతర వివరాలు లేకుండా 'అర్బన్ సర్దార్జీ' ఫేస్బుక్ పేజ్ లో అప్ లోడ్ అయిన ఈ బారాత్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. -
కామిక్ అవతార్
స్పైడర్‌మ్యాన్, సూపర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్... ఇలా హాలీవుడ్ సూపర్‌హీరో సినిమాలన్నీ కామిక్స్ నుంచి పుట్టినవే. తొలిసారిగా ఓ వెండితెర హీరో కామిక్ బుక్‌లో సూపర్‌హీరోగా అలరించనున్నారు. జేమ్స్ కామెరూన్ తీసిన ‘అవతార్’... ప్రపంచ సినిమా చరిత్రలోనే ఓ అద్భుతం. ఆరేళ్ల క్రితం ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పండోరా అనే గ్రహాన్ని తన అద్భుతమైన గ్రాఫిక్స్ మాయాజాలంతో తెర మీద ఆవిష్కరించిన జేమ్స్ కామెరూన్ ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన మూడు సీక్వెల్స్ ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ‘అవతార్’ని కామిక్ బుక్‌లో హీరోగా పరిచయం చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ‘‘డార్క్ హౌస్ కామిక్స్ సంస్థతో కలిసి ఈ ప్రాజెక్టు చేపడుతున్నాం. మరి కొన్ని కొత్త కథలతో, పండోరా గ్రహంలోని మరికొన్ని కొత్త కోణాలను పదేళ్ల పాటు పుస్తక రూపంలో తీసుకురానున్నాం’’ అని చెప్పారు. -
బ్యాట్మేన్కు 75 ఏళ్లు!
కొన్ని పాత్రలు చిరంజీవులు. ఎన్ని తరాలు మారినా, ఎన్ని ట్రెండ్లు మారినా ఆ పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. హాలీవుడ్లో ‘బ్యాట్‌మేన్’ పాత్ర అలాంటిదే. ముందు కామిక్ పుస్తకాల్లో పుట్టి, ఆ తర్వాత వెండితెరకు వచ్చాడు బ్యాట్‌మేన్. కామిక్ పుస్తకాలు చదువుతున్నప్పుడు బ్యాట్‌మేన్ ఎంత ఉద్వేగానికి గురి చేశాడో, తెరపైనా అంతే ఉద్వేగానికి గురి చేశాడు. ఇప్పుడీ ఉపోద్ఘాతం అంతా ఎందుకో మీరు ఊహించే ఉంటారు. అవును.. బ్యాట్‌మేన్ పాత్ర పుట్టి ఇప్పటికి 75 ఏళ్లయ్యింది. ఇన్నేళ్లల్లో ఎన్నో పుస్తకాలు, ఎన్నో సినిమాలొచ్చాయి. ప్రస్తుతం ‘బ్యాట్‌మేన్ వెర్సస్ సూపర్‌మేన్’ చిత్రం నిర్మాణంలో ఉంది. ఇప్పటివరకు పలు బ్యాట్‌మేన్ చిత్రాలు తీసిన వార్నర్ బ్రదర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బ్యాట్‌మేన్‌గా బెన్ ఆఫ్లిక్, సూపర్‌మేన్‌గా హెన్రీ కావిల్ నటిస్తున్నారు. 2016లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. జూలై 23 ‘బ్యాట్‌మేన్ డే’గా ప్రకటించిన సందర్భంగా ఈ చిత్రంలోని బ్యాట్‌మేన్ సూట్ ఎలా ఉంటుందో విడుదల చేశారు. ఈ బ్యాట్‌మేన్ చేసే సాహస విన్యాసాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయని చిత్రదర్శకుడు జాక్ స్నైడర్ పేర్కొన్నారు. -
ఎగిరే కారు.. బాగుంది సారూ..
ఎగిరే కార్లు కొన్ని వచ్చాయి.. మరికొన్ని డిజైన్లు వచ్చాయి. ఇది మాత్రం వాటన్నిటికన్నా స్టైలిష్ అని చెప్పక తప్పదు.. హాలీవుడ్ సినిమాలో బ్యాట్‌మాన్ వినియోగించే వాహనంలా ఉన్న ఈ జీఎఫ్ 7 డిజైన్‌ను అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన గ్రెగ్ బ్రౌన్, డేవ్‌లు రూపొందించారు. గాలిలోకి ఎగిరేటప్పుడు ఈ కారుకుండే రెక్కలు విచ్చుకుంటాయి. నేలపై ఎలక్ట్రిక్ మోటార్ల సాయంతో నడిచే ఈ వాహనం.. గాలిలో జెట్ ఇంజిన్ సాయంతో ఎగురుతుంది. గాలిలో ఎగిరేటప్పుడే.. ఇందులోని జెట్ ఇంజిన్ ఎలక్ట్రిక్ మోటార్ల తాలూకు బ్యాటరీని రీచార్జ్ చేస్తుంది. జీఎఫ్ 7 మార్కెట్లోకి రావడానికి మరో నాలుగేళ్ల సమయం పడుతుందని గ్రెగ్, డేవ్‌లు చెబుతున్నారు. నేలపై గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ జీఎఫ్ 7.. ఆకాశంలో 885 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. దీని ధర రూ.17-30 కోట్ల మధ్య ఉండవచ్చు. -
‘సూపర్ హీరో’లకు గౌరవం!
అదో వింత ఆకారం. దూరం నుంచి చూస్తేనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అదే ఏ స్పైడర్మేనో, సూపర్మేనో, బాట్మేనో, ఐరన్మేనో అయితే గాల్లో ఎగిరెగిరి ఆ ఆకారం షేపులు మార్చేస్తారు. ఈ సూపర్ హీరోలు చేసే విన్యాసాలను చూసి, పిల్లలు థ్రిల్ అయిపోతారు. పెద్దల పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంటుంది. ‘మనం కూడా ఓసారి అలా మారిపోతే ఎంత బాగుండు’ అనుకుంటాం. వాస్తవానికి స్పైడర్‌మేన్, సూపర్‌మేన్, బాట్మేన్, ఐరన్‌మేన్ కాల్పనిక పాత్రలని తెలిసినా, నిజం అన్నట్లుగా నమ్మేస్తాం. అంతగా ప్రేక్షకుల హృదయాలను ఈ పాత్రలు టచ్ చేశాయి. అందుకే, ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్ కమిటీ ఓ నిర్ణయం తీసుకుంది. వీక్షకులను ఎంతగానో ప్రభావితం చేస్తున్న ఈ ‘సూపర్ హీరో’ యానిమేషన్ కేరక్టర్స్‌ను, ఎంతో రిస్క్‌తో కూడుకున్న ఆ పాత్రలను పోషించే నటులను, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ తరహా చిత్రాలను నిర్మిస్తున్న నిర్మాతలను గౌరవించాలనుకుంది. మార్చి 2న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఆస్కార్ అవార్డ్స్ వేడుక జరగనుంది. ఈ లోపు ఆ ప్రాంగణంలో ఓ భారీ ఎగ్జిబిషన్‌ని ఏర్పాటు చేశారు. గత తొమ్మిది దశాబ్దాల్లో కాల్పనిక పాత్రలతో రూపొందిన చిత్రాలకు సంబంధించిన ఫొటోలు, పోస్టర్లను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. అలాగే, వెండితెరపై ఈ సూపర్ హీరోలు చేసిన విన్యాసాల తాలూకు వీడియో క్లిప్పింగ్స్‌ని కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్‌కి భారీ ఎత్తున స్పందన లభిస్తోందట. సుమారు 80 చిత్రాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, ప్టోసర్లను పొందుపరచడంతో చూడ్డానికి రెండు కళ్లూ చాలడంలేదని హాలీవుడ్వారు అంటున్నారు. ఆస్కార్ అవార్డ్ కమిటీ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ పద్ధతిని మెచ్చుకుంటున్నారు కూడా.