బ్యాట్‌మ్యాన్‌ హీరోకు కరోనా? | Robert Pattinson tests positive for Covid-19 | Sakshi
Sakshi News home page

బ్యాట్‌మ్యాన్‌ హీరోకు కరోనా?

Published Sat, Sep 5 2020 4:57 AM | Last Updated on Sat, Sep 5 2020 4:57 AM

Robert Pattinson tests positive for Covid-19 - Sakshi

రాబర్ట్‌ పాటిసన్

హాలీవుడ్‌ నటుడు, బ్యాట్‌మ్యాన్‌ హీరో రాబర్ట్‌ పాటిసన్‌కు కరోనా సోకిందట. ప్రస్తుతం లండన్‌లో జరుగుతున్న ‘బ్యాట్‌మ్యాన్‌’ చిత్రీకరణను కొన్ని రోజుల పాటు నిలిపివేశారు. ఈ విషయం గురించి చిత్రనిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ మాట్లాడుతూ – ‘‘బ్యాట్‌మ్యాన్‌’ చిత్రబృందంలో ఒక కీలక వ్యక్తికి కరోనా సోకడంతో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అతన్ని ఐసోలేషన్‌లో ఉంచాం.

మా చిత్రీకరణను కొన్ని రోజులు నిలిపివేస్తున్నాం’’ అన్నారు. కానీ ఆ కీలక వ్యక్తి ఎవరు అని ప్రకటించలేదు. అయితే  కథానాయకుడు రాబర్ట్‌ పాటిసన్‌కే కరోనా సోకిందన్నది హాలీవుడ్‌ మీడియా కథనం. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో చిత్రీకరణ ప్రారంభం అయిన తొలి చిత్రం ‘బ్యాట్‌మ్యాన్‌’. మరి.. ఈ యూనిట్‌లో ఒకరికి కరోనా సోకడంతో మిగిలిన చిత్రబృందాలు వెనకడుగు వేస్తాయా? మరింత జాగ్రత్తలు పాటిస్తాయా? అని హాలీవుడ్‌ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement