హాలీవుడ్ మూవీస్‌లో బ్యాట్‌మ్యాన్ సిరీస్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిందే. ఈ సిరీస్‌లో వచ్చిన మూవీస్ అభిమానులను ఎంతో అలరించాయి. అయితే ఎప్పటి నుంచో ఈ సిరీస్ మరో సినిమా కోసం వేచి చూస్తున్న ఫ్యాన్స్‌ని ట్రైలర్‌తో సర్‌ఫ్రైజ్ చేశారు మేకర్స్.
డీసీ నిర్వహించిన ఫ్యాన్‌డమ్ ఈవెంట్‌లో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. వార్నర్ బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో రాబర్ట్ ప్యాటిన్సన్ కొత్త బ్యాట్‌మ్యాన్‌గా నటిస్తున్నాడు. ఈ ట్రైలర్‌లో అన్ని మూవీస్‌లాగే యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రాన్ని మొదట జూన్ 21న విడుల చేయాలని భావించారు. కోవిడ్ కారణంగా చిత్రీకరణ ఆలస్యమవుతూ కావడంతో అనంతరం అక్టోబర్ 1న రిలీజ్ చేయాలనుకున్నారు. కాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడగా.. మార్చి 4, 2022న సినిమా థియేటర్లలో విడుదల చేయనున్నారు.
చదవండి: సరికొత్తగా రాబోతున్న సూపర్‌మ్యాన్.. షాక్‌లో ఫ్యాన్స్
Comments
Please login to add a commentAdd a comment