Batman: ఆ స్వరం మూగబోయింది | Kevin Conroy The voice of Batman Passed Away | Sakshi
Sakshi News home page

బ్యాట్‌మన్‌ పాత్రకు స్వరంతో ప్రాణం పోశాడు.. క్యాన్సర్‌తో కన్నుమూత

Published Sat, Nov 12 2022 8:17 AM | Last Updated on Sat, Nov 12 2022 8:18 AM

Kevin Conroy The voice of Batman Passed Away - Sakshi

హాలీవుడ్‌ న్యూస్‌: డీసీ కామిక్స్‌లో బ్యాట్‌మన్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ క్యారెక్టర్‌ని ఆడియొన్స్‌కి అంతలా కనెక్ట్‌ చేసిన వ్యక్తి మాత్రం కెవిన్ కాన్రాయ్‌. గంభీరమైన స్వరంతో ‘ఐ యామ్‌ వెన్‌జెన్స్‌.. ఐ యామ్‌ ది నైట్‌.. ఐ యామ్‌ బ్యాట్‌మన్‌’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్‌.. చరిత్రలో నిలిచిపోయింది. అయితే.. దురదృష్టవశాత్తూ ఆయన ఇక లేరు.

బ్యాట్‌మన్‌ యానిమేటెడ్‌ సిరీస్‌లో బ్యాట్‌మన్‌ క్యారెక్టర్‌కు వాయిస్‌ ఓవర్‌ అందించిన కెవిన్ కాన్రాయ్ Kevin Conroy గురువారం కన్నుమూశారు. ప్రేగు క్యాన్సర్ బాధపడుతున్న ఆయన.. 66 ఏళ్ల వయసులో న్యూయార్క్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు శుక్రవారం వార్నర్‌ బ్రదర్స్‌ సంస్థ ప్రకటించింది. మరోవైపు ఆయనకు నివాళిగా సోషల్‌ మీడియాలో RIP Legend హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ నడుస్తోంది.

కామిక్స్‌ పోర్షన్‌ తర్వాత..  1992-96 మధ్య బ్యాట్‌మన్‌ యానిమేటెడ్‌ సిరీస్‌లు విపరీతంగా జనాదరణను సంపాదించుకున్నాయి. అందులో 15 చిత్రాలు, 400  టీవీ ఎపిసోడ్స్‌, 20కిపైగా వీడియోగేమ్స్‌, బ్యాట్‌మన్‌:ఆర్ఖామ్‌ అండ్‌ ఇన్‌జస్టిస్‌ ఫ్రాంచైజీలకు వాయిస్‌ ఓవర్‌ అందించారు కాన్రాయ్‌. తద్వారా బ్యాట్‌మన్‌ క్యారెక్టర్‌కు జనాల్లో విపరీతమైన ఆదరణ తీసుకొచ్చారాయన.

న్యూయార్క్‌ వెస్ట్‌బ్యూరీలో జన్మించిన కెవిన్‌ కాన్రాయ్‌.. థియేటర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. 1980 నుంచి టీవీ యాడ్స్‌ ద్వారా నటనలోకి అడుగుపెట్టి.. చాలాకాలం బుల్లితెర ప్రజలను అలరించారు. ఆపై కొన్ని చిత్రాలు, టీవీ సిరీస్‌ల్లోనూ మెరిశారు. 1991లో క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ ఆండ్రియా రొమానో ద్వారా బ్యాట్‌మన్‌ సిరీస్‌కు వాయిస్‌ ఓవర్‌ అందించడం ప్రారంభించారు. కామిక్స్‌పై ఏమాత్రం అవగాహన లేని కాన్రాయ్‌.. బ్రూస్‌ వేన్‌(బ్యాట్‌మన్‌) పాత్రకు తన గాత్రంతో జీవం పోశారు. హాలీవుడ్‌లో ‘గే’ సెలెబ్రిటీగా ఈయనకు పేరుంది. చివరిరోజుల్లో ఆయన వాన్ సి. విలియమ్స్ అనే వ్యక్తిని వివాహం చేసుకోవడం గమనార్హం.

ఇదీ చదవండి: ఇది.. మనిషిని మొత్తం కరిగిపోయేలా చేసిన సినిమా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement