బెంగళూరు: భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో).. ఇప్పుడు ఎక్కడా విన్నా ఇస్రో పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఇస్రో ప్రాజెక్ట్ లాంచింగ్ సందర్భంగా కౌంట్‌డౌన్ చదువుతూ ఒక మహిళ గొంతు వినపడుతుంది. కాగా, ఆ స్వరం మూగబోయింది. ఇస్రో ప్రతీ ప్రాజెక్ట్‌లో కౌంట్‌డౌన్ వినిపించే గొంతు ఇక మళ్లీ వినపడదు. కౌంట్‌డౌన్ చదివే ఇస్రో శాస్త్రవేత్త వలర్మతి తుదిశ్వాస విడిచారు.
వివరాల ప్రకారం.. వరుస విజయాలతో ఎంతో ఆనందంతో ఉన్న ఇస్రో శాస్త్రవేతల బృందంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇస్రో ప్రయోగాలకు కౌంట్‌డౌన్ వాయిస్ అందించే శాస్త్రవేత్త వలర్మతి కన్నుమూశారు. గుండెపోడుతో వలర్మతి మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆమె మృతి పట్ల ఇస్రో శాస్త్రవేత్తలు సంతాపం వ్యక్తం చేశారు.
శాస్త్రవేత్తల సంతాపం..
అయితే, శాస్త్రవేత్త వలర్మతి.. చంద్రయాన్-3 లాంచ్ సమయంలోనూ ఆమెనే స్వరాన్ని అందించారు. అదే ఆమె వాయిన్ వినిపించిన చివరి మిషన్. ఇస్రోలో ఆమెను వలర్మతి మేడం అని పిలుస్తారు. వలర్మతి మరణం నేపథ్యంలో ప్రముఖులు, ఇస్రో శాస్త్రవేత్తలు సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని తెలుపుతున్నారు. కాగా, వలర్మతి మృతిపై ఇస్రో మాజీ డైరెక్టర్ పీవీ వెంకటకృష్ణన్ స్పందించారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. భవిష్యత్తులో శ్రీహరికోట నుంచి ఇస్రో చేపట్టి ప్రాజెక్ట్స్ కౌంట్డౌన్లలో వలర్మతి మేడం గొంతు వినిపించదు. చంద్రయాన్-3నే ఆమె చివరి కౌంట్‌డౌన్. ఆమెది ఆకస్మిక మరణం. బాధగా ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు.
ISRO scientist Valarmathi, who lent her voice on countdowns for rocket launches, has died due to cardiac arrest.
— Nandan Pratim Sharma Bordoloi (@NANDANPRATIM) September 4, 2023
Her last countdown was during the launch of Chandrayaan-3. pic.twitter.com/UwaFKN8EUG
అబ్దుల్ కలాం అవార్డు పొందిన తొలి మహిళ..
శాస్త్రవేత్త వలర్మతి.. తమిళనాడులోని ఆరియలూర్లో 1959 జులై 31న జన్మించారు. కోయంబత్తూర్‌లోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ చదివారు. 1984లో ఇస్రోలో శాస్త్రవేత్తగా జాయిన్ అయ్యారు. ఇస్రో చేపట్టిన అనేక ప్రయోగాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. తొలి దేశీయ రాడార్ ఇమేజింగ్ సాటిలైట్ (ఆర్‌ఐఎస్‌ఏటీ-1) మిషన్‌కు ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేశారు. తమిళనాడు ప్రభుత్వం.. 2015లో ఆమెకు అబ్దుల్ కలామ్ అవార్డు ఇచ్చింది. ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి వలర్మతి కావడం విశేషం.
ఇది కూడా చదవండి: చాందినీ చౌక్ చరిత్ర ఏమిటి?
Comments
Please login to add a commentAdd a comment