బ్యాట్‌మేన్‌కు 75 ఏళ్లు!
కొన్ని పాత్రలు చిరంజీవులు. ఎన్ని తరాలు మారినా, ఎన్ని ట్రెండ్లు మారినా ఆ పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. హాలీవుడ్‌లో ‘బ్యాట్‌మేన్’ పాత్ర అలాంటిదే. ముందు కామిక్ పుస్తకాల్లో పుట్టి, ఆ తర్వాత వెండితెరకు వచ్చాడు బ్యాట్‌మేన్. కామిక్ పుస్తకాలు చదువుతున్నప్పుడు బ్యాట్‌మేన్ ఎంత ఉద్వేగానికి గురి చేశాడో, తెరపైనా అంతే ఉద్వేగానికి గురి చేశాడు. ఇప్పుడీ ఉపోద్ఘాతం అంతా ఎందుకో మీరు ఊహించే ఉంటారు. అవును.. బ్యాట్‌మేన్ పాత్ర పుట్టి ఇప్పటికి 75 ఏళ్లయ్యింది. ఇన్నేళ్లల్లో ఎన్నో పుస్తకాలు, ఎన్నో సినిమాలొచ్చాయి.
ప్రస్తుతం ‘బ్యాట్‌మేన్ వెర్సస్ సూపర్‌మేన్’ చిత్రం నిర్మాణంలో ఉంది. ఇప్పటివరకు పలు బ్యాట్‌మేన్ చిత్రాలు తీసిన వార్నర్ బ్రదర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బ్యాట్‌మేన్‌గా బెన్ ఆఫ్లిక్, సూపర్‌మేన్‌గా హెన్రీ కావిల్ నటిస్తున్నారు. 2016లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. జూలై 23 ‘బ్యాట్‌మేన్ డే’గా ప్రకటించిన సందర్భంగా ఈ చిత్రంలోని బ్యాట్‌మేన్ సూట్ ఎలా ఉంటుందో విడుదల చేశారు. ఈ బ్యాట్‌మేన్ చేసే సాహస విన్యాసాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయని చిత్రదర్శకుడు జాక్ స్నైడర్ పేర్కొన్నారు.