Warner Brothers
-
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన రూ.1500 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రస్తుతం సినీ ప్రియులు ఎక్కువగా ఓటీటీల వైపే చూస్తున్నారు. ఎంచక్కా ఇంట్లోనే ఉంటూ కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసేస్తున్నారు. దీంతో ఓటీటీ ప్రేక్షకుల కోసం ఎప్పటికప్పుడు సినిమాలు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. తాజాగా హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ డ్యూన్ పార్ట్- 2 ఓటీటీలోకి వచ్చేసింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం రెంటల్ విధానంలోనే మాత్రం అందుబాటులో ఉంది. ప్రస్తుతం రెంటల్ విధానంలో అమెజాన్ ప్రైమ్‌తో పాటు బుక్‌మై షో ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు రూ.1500 కోట్ల బడ్డెజ్తో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.4500 కోట్ల వసూళ్లు సాధించింది. 2024లో హాలీవుడ్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీస్‌లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా.. లెజెండరీ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ బ్యానర్లపై డెనీస్ విల్లెన్యువే దర్శకత్వంలో రూపొందించారు. ఫ్రాంక్ హెర్బర్ట్ రచించిన డ్యూన్ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో తిమోతీ ఛాలామెట్, జెండ్యా, రెబాకా ఫెర్గూసన్, జోష్ బ్రోలిన్, ఆస్టిన్ బట్లర్ కీలక పాత్రలు నటించారు. 2021లో విడుదలైన అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ సినిమా డ్యూన్‌కు సీక్వెల్‌గా పార్ట్- 2 తీసుకొచ్చారు. మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. -
దేవత లాంటి యువతి దెయ్యంగా ఎలా మారింది?.. రిలీజ్ ఎప్పుడంటే?
హాలీవుడ్ హర్రర్ చిత్రాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రేక్షకులను భయపెట్టాలన్నా.. థ్రిల్లింగ్‌కు గురిచేయాలన్నా హాలీవుడ్ చిత్రాలకే సాధ్యం. ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లను కొల్లగొట్టేవి ఇలాంటి చిత్రాలే. ది కంజూరింగ్ అనే చిత్రాన్నే తీసుకుంటే ప్రపంచంలోనే అత్యధికంగా వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అదే విధంగా హాలీవుడ్లో ది నన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: పవన్ కల్యాణ్ ఓజీపై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్..! ) తాజాగా దానికి సీక్వెల్‌గా వస్తోన్న చిత్రం నన్ -2. ఇది ది కంజూరింగ్ ఫ్రాంచైజీలో రూపొందిన 9వ చిత్రం కావడం మరో విశేషం. మైఖేల్ ఛావ్స్ దర్శకత్వం వహించిన ఈ అమెరికన్ చిత్రంలో బోలి ఆరోన్న్స్, తెలుసా ఫార్మికా, స్టీమ్ రెయిడ్, ప్రధాన పాత్రలు పోషించారు. న్యూలైన్ సినిమా ఆటోమిక్ మాన్స్టర్, ది సఫ్రాన్ కంపెనీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించారు. ఒక దేవత లాంటి యువతి దెయ్యంగా ఎలా మారింది? అన్న ఇతివృత్తంతో నన్–2 తెరకెక్కించారు. ఈ చిత్రం కథ, కథనం, స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయని వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. ఈ చిత్రం భారతదేశంలో తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా ఈనెల 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. (ఇది చదవండి: గోపీచంద్‌ని తిట్టడం తప్పే.. ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన డైరెక్టర్) On September 8th, the greatest evil in the conjuring universe returns #TheNun2. pic.twitter.com/zYdo2dzwVR — Warner Bros. Pictures (@wbpictures) July 6, 2023 -
హైదరాబాద్‌కు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ.. 1200 మందికి ఉపాధి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాత మీడియా, ఎంటర్టైన్మెంట్ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హైదరాబాద్ నగరంలో తన కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. నగరంలో ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సెంటర్(ఐడీసీ)ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు బుధవారం న్యూయార్క్‌లో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థను సందర్శించి సంస్థ ఫైనాన్స్ విభాగం సీనియర్ ఉపాధ్యక్షురాలు అలెగ్జాండ్రా కార్టర్‌తో సమావేశమయ్యారు. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాభివృద్ధి, ఆవిష్కరణల విషయంలో ఇరువర్గాలు ఒకే విధమైన ఆశయాలను కలిగి ఉన్నట్టు ఈ చర్చల సందర్భంగా అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈ రంగాల ఉజ్వల భవిష్యత్‌కి కలిసి పనిచేయాలని నిర్ణయించారు. గొడుగు కింద ప్రఖ్యాత వినోద ఛానళ్లు.. వైవిధ్యభరిత కంటెంట్, బ్రాండ్స్, ఫ్రాంచైజీల ద్వారా టెలివిజన్, సినిమా, స్ట్రీమింగ్, గేమింగ్ వంటి రంగాల్లో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ప్రపంచ ఖ్యాతి గడించింది. సంస్థ గొడుగు కింద ప్రపంచ ప్రఖ్యాత హెచ్‌బీఓ, హెచ్‌బీఓ మ్యాక్స్, సీఎన్ఎన్, టీఎల్సీ, డిస్కవరీ, డిస్కవరీ ప్లస్, డబ్ల్యూబీ, ఈరోస్పోర్ట్, అనిమల్ ప్లానెట్, కార్టూన్ నెట్వర్క్, నిమాక్స్, పోగో, టూన్ కార్ట్, హెచ్‌జీటీవీ, క్వెస్ట్ వంటి ఎంటర్టైన్మెంట్ ఛానళ్లు పనిచేస్తున్నాయి. హైదారాబాద్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా భారతీయ మార్కెట్లోని అపార వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు నగర మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాలపై తనదైన ముద్ర వేయాలని వార్నర్ బద్రర్స్ డిస్కవరీ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. చదవండి: 105 సీట్లు మనవే! చెప్పినట్టు పనిచేస్తే గెలుస్తం.. లేదంటే మునుగుతం వ్యూహాత్మక కేంద్రంగా సేవలు.. మన దేశంలో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ కార్యకలాపాలకు హైదరాబాద్‌లోని ఐడీసీ వ్యూహాత్మక కేంద్రంగా సేవలందించనుంది. తొలి ఏడాది 1200 వృత్తి నిపుణులకు ఉద్యోగావకాశాలు కల్పించనుంది. వ్యాపారాభివృద్ధికి అనుగుణంగా ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచుకోనుంది. స్థానిక నిపుణులను ప్రోత్సహించడం, హైదరాబాద్ నగరంలో మీడియా, వినోద రంగ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పాడు అందించడంలో సంస్థ చిత్తశుద్ధికి ఈ నిర్ణయం నిదర్శనమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కాళేశ్వరం, భగీరథ ప్రాజెక్టులపై ప్రసంగించనున్న కేటీఆర్ కాగా, వారం రోజుల అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే అంతర్జాతీయ విమానాశ్రయానికి బుధవారం చేరుకున్న మంత్రి కె.తారకరామారావుకు అక్కడి ఎన్ఆర్ఐలు ఘనస్వాగతం పలికారు. ఈనెల 21 నుంచి 25 వరకు నెవాడాలోని హెండర్సన్లో అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్(ఏఎస్సీఈ) ఆధ్వర్యంలో జరగనున్న ప్రపంచ పర్యావరణ, నీటి వనరుల సదస్సుకు కేటీఆర్ హాజరవుతున్నారు. తెలంగాణ పరివర్తనాత్మక ప్రాజెక్టులు – కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు, మిషన్ భగీరథ ప్రాజెక్టుల గురించి సదస్సులో ప్రసంగించనున్నారు. వివిధ వాణిజ్య సమావేశాల్లోనూ కేటీఆర్ పాల్గొననున్నారు. Thrilled to announce the grand entry of global media powerhouse "Warner Bros. Discovery" into the entertainment realm of Telangana! Hyderabad is set to witness the launch of their incredible IDC, a hub of creativity and innovation, with a whopping 1200 employees in the first… pic.twitter.com/z5hAj5kBNs — KTR (@KTRBRS) May 17, 2023 -
ఫెంటాస్టిక్ బీస్ట్స్ 3 రిలీజ్ ఎప్పుడంటే?
హాలీవుడ్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం 'ఫెంటాస్టిక్ బీస్ట్స్: ది సీక్రెట్స్ ఆఫ్ డంబుల్ డోర్' చిత్రం ఈ నెల 8వ తేదీ సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రాబోతోంది. దీన్ని ఆంగ్లం, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ దేశవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనుంది. డేవిడ్ యేట్స్ దర్శకత్వం వహించిన ఇందులో ఆస్కార్ అవార్డు గ్రహీత ఎడ్డీ రెడ్మైన్, జూడ్ లా, ఎజ్రా మిల్లర్ తదితరులు నటించారు. చదవండి: గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న నిర్మాత -
బాక్సాఫీస్ ‘రన్నర్’!
హాలీవుడ్ చిత్రం ‘ది మేజ్ రన్నర్’ బాక్సాఫీస్ రేస్‌లో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు 32.5 మిలియన్ డాలర్లు వసూలు చేసి టాప్‌లో నిలిచింది. యూనివర్సల్ ‘ఏ వాక్ ఎమాంగ్ ది టాంబ్స్టోన్స్’ (13.1 మిలియన్ డాలర్లు), వార్నర్ బ్రదర్స్ ‘దిస్ ఈజ్ వేర్ ఐ లీవ్ యూ’ (11.9 మిలియన్ డాలర్లు) వంటి మెగా చిత్రాలను వెనక్కు నెట్టి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మేజర్ సిటీస్‌లో తమ చిత్రానికి ఆదరణ బాగుందని... మిగిలిన ప్రాంతాల్లో అంతగా ఎక్కలేదని వార్నర్ బ్రదర్స్ డొమెస్టిక్ డిస్ట్రిబ్యూషన్ హెడ్ డాన్ ఫెల్మ్యాన్ వెల్లడించాడు. -
బ్యాట్మేన్కు 75 ఏళ్లు!
కొన్ని పాత్రలు చిరంజీవులు. ఎన్ని తరాలు మారినా, ఎన్ని ట్రెండ్లు మారినా ఆ పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. హాలీవుడ్లో ‘బ్యాట్‌మేన్’ పాత్ర అలాంటిదే. ముందు కామిక్ పుస్తకాల్లో పుట్టి, ఆ తర్వాత వెండితెరకు వచ్చాడు బ్యాట్‌మేన్. కామిక్ పుస్తకాలు చదువుతున్నప్పుడు బ్యాట్‌మేన్ ఎంత ఉద్వేగానికి గురి చేశాడో, తెరపైనా అంతే ఉద్వేగానికి గురి చేశాడు. ఇప్పుడీ ఉపోద్ఘాతం అంతా ఎందుకో మీరు ఊహించే ఉంటారు. అవును.. బ్యాట్‌మేన్ పాత్ర పుట్టి ఇప్పటికి 75 ఏళ్లయ్యింది. ఇన్నేళ్లల్లో ఎన్నో పుస్తకాలు, ఎన్నో సినిమాలొచ్చాయి. ప్రస్తుతం ‘బ్యాట్‌మేన్ వెర్సస్ సూపర్‌మేన్’ చిత్రం నిర్మాణంలో ఉంది. ఇప్పటివరకు పలు బ్యాట్‌మేన్ చిత్రాలు తీసిన వార్నర్ బ్రదర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బ్యాట్‌మేన్‌గా బెన్ ఆఫ్లిక్, సూపర్‌మేన్‌గా హెన్రీ కావిల్ నటిస్తున్నారు. 2016లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. జూలై 23 ‘బ్యాట్‌మేన్ డే’గా ప్రకటించిన సందర్భంగా ఈ చిత్రంలోని బ్యాట్‌మేన్ సూట్ ఎలా ఉంటుందో విడుదల చేశారు. ఈ బ్యాట్‌మేన్ చేసే సాహస విన్యాసాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయని చిత్రదర్శకుడు జాక్ స్నైడర్ పేర్కొన్నారు.