ప్రస్తుతం సినీ ప్రియులు ఎక్కువగా ఓటీటీల వైపే చూస్తున్నారు. ఎంచక్కా ఇంట్లోనే ఉంటూ కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసేస్తున్నారు. దీంతో ఓటీటీ ప్రేక్షకుల కోసం ఎప్పటికప్పుడు సినిమాలు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. తాజాగా హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ డ్యూన్ పార్ట్- 2 ఓటీటీలోకి వచ్చేసింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం రెంటల్ విధానంలోనే మాత్రం అందుబాటులో ఉంది.
ప్రస్తుతం రెంటల్ విధానంలో అమెజాన్ ప్రైమ్‌తో పాటు బుక్‌మై షో ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు రూ.1500 కోట్ల బడ్డెజ్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.4500 కోట్ల వసూళ్లు సాధించింది. 2024లో హాలీవుడ్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీస్‌లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది.
కాగా.. లెజెండరీ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ బ్యానర్లపై డెనీస్ విల్లెన్యువే దర్శకత్వంలో రూపొందించారు. ఫ్రాంక్ హెర్బర్ట్ రచించిన డ్యూన్ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో తిమోతీ ఛాలామెట్, జెండ్యా, రెబాకా ఫెర్గూసన్, జోష్ బ్రోలిన్, ఆస్టిన్ బట్లర్ కీలక పాత్రలు నటించారు. 2021లో విడుదలైన అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ సినిమా డ్యూన్‌కు సీక్వెల్‌గా పార్ట్- 2 తీసుకొచ్చారు. మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment