బ్యాట్‌మేన్‌ టీజర్‌ రెడీ | The Batman 2021 release date announced | Sakshi
Sakshi News home page

బ్యాట్‌మేన్‌ టీజర్‌ రెడీ

Published Mon, Aug 17 2020 4:54 AM | Last Updated on Mon, Aug 17 2020 4:54 AM

The Batman 2021 release date announced - Sakshi

రాబర్ట్‌ పాటిన్సన్

సూపర్‌ హీరో బ్యాట్‌మేన్‌ ని పలు చిత్రాల్లో చూశాం. ఇప్పుడు మరోసారి బ్యాట్‌మేన్‌ని చూడబోతున్నాం. ‘బ్యాట్‌మేన్‌’ టైటిల్‌తో సరికొత్త తరహాలో ఈ చిత్రాన్ని మాట్‌ రీవెస్‌ దర్శకత్వంలో వార్నర్‌ బ్రదర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రాబర్ట్‌ పాటిన్సన్‌ బ్యాట్‌మేన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ లాక్‌డౌన్‌ ముందే ప్రారంభమయింది. లాక్‌డౌన్‌ వల్ల చిత్రీకరణకు అంతరాయం ఏర్పడింది. మళ్లీ షూటింగ్‌ను ప్రారంభించారు.

లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్‌ ప్రారంభించిన తొలి భారీ చిత్రమిదే. ఈ సరికొత్త బ్యాట్‌మేన్‌ సినిమా గురించి ఫ్యాన్స్‌ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎలా ఉండబోతోందో శాంపిల్‌ చూపించడానికి డేట్‌ సిద్ధం చేసింది చిత్రబృందం. ఈ నెల 22న ఈ చిత్రానికి సంబంధించిన తొలి టీజర్‌ను విడుదల చేయనున్నారు. ‘డీసీ ఫ్యాన్‌డమ్‌’ అనే ఆన్‌లైన్‌ ఈవెంట్‌ ఒకటి ఆగస్ట్‌ 22న జరగనుంది. ఈ ఈవెంట్‌లో ఈ టీజర్‌ను విడుదల చేయనున్నారు. సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement