ఆయన హాలీవుడ్ నటుడిగా కన్పిస్తున్నారు. త్వరలో జత కట్టనున్న హీరోని ఆకాశానికి ఎత్తేస్తున్నది నటి ఎమిజాక్సన్. ఈ ఇంగ్లిషు భామ అంతగా మోసేస్తున్న ఆ నటుడు బాలీవుడ్‌లోనూ విజయ కేతనం ఎగుర వేస్తున్న కోలివుడ్ నటుడు ధనుష్. మదరాసు పట్నం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ యూకే సుందరి ఆ తర్వాత ఐ చిత్రంతో అవకాశాలను కొల్లగొడుతున్నది. ప్రస్తుతం ఉదయ నిధి స్టాలిన్‌తో నటిస్తున్న చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. యువ నటుడు ధనుష్‌తో మరోచిత్రంలో నటించేందుకు రెడీ అయి పోతున్నది. ఈ చిత్రంలో నటించేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్టు ఎమి పేర్కొంది. కారణం ఏమిటమ్మా అంటే, ఆ చిత్ర హీరో ధనుష్ అంటోన్నది.
వేల ఇల్లాద పట్టదారి చిత్రం ఘన విజయం సాధించడంతో ఆ చిత్ర హీరో ధనుష్, దర్శకుడు వేల్ రాజ్ తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఈచిత్రంలో నాయకగా ఎమిజాక్సన్‌ను ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రంలో నటించే విషయంగా ఎమి జాక్సన్ పేర్కొంటూ, తనది ఈ చిత్రంలో ధనుష్‌ను వెంటాడి ప్రేమించే పాత్రగా వివరించారు. మరో విషయం ఏమిటంటే ధనూష్ నటించిన కొన్ని యాక్షన్ చిత్రాలను చూశానని, ఆ చిత్రాల్లో ధనుష్ తనకు కుట్టి హాలీవుడ్ నటుడిగా కన్పించారని పేర్కొంది. ఆయనతో నటించేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్టు చెప్పారు ఇదంతా, సహజమేనంటూ కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ధనుష్‌ను మోసేస్తున్న ఎమిజాక్సన్
Published Sun, Mar 15 2015 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM
Advertisement
Advertisement