Samantha Hollywood Film With Strong Chennai Connection - Sakshi
Sakshi News home page

Samantha: త్వరలోనే హాలీవుడ్‌ సినిమాలో నటించనున్న సమంత

Published Sat, May 27 2023 8:29 AM | Last Updated on Sat, May 27 2023 8:57 AM

Samantha Hollywood Film With Strong Chennai Connection - Sakshi

సమంత నట వయస్సు సుమారు దశాబ్దంన్నర. వయసు 36 ఏళ్లు. ఈ మధ్యకాలంలో ఆమె నటిగా రంగ ప్రవేశం చేయడం, స్టార్‌ హీరోయిన్గా ఎదగడం, బహుభాషా నటిగా గుర్తింపు తెచ్చుకోవడం, ప్రేమ, పెళ్లి, విడిపోవడం వరకు జరిగిపోయింది. అంతేకాకుండా ఇటీవల మయోటీస్‌ అనే ప్రాణాంతక వ్యాధికి గురికావడం, దానితో పోరాడి కోలుకోవడం, అదేవిధంగా ఇటీవల ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న చారిత్రక కథా చిత్రం శాకుంతలం ఆశించిన విజయాన్ని సాధించలేకపోవడంతో సమంత పని అయిపోయింది అనే కామెంట్స్‌ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

అలా ఒక సెలబ్రిటీగా సమంత ఎంత ఉన్నత స్థాయికి ఎదిగిందో అంతగా విమర్శలను, ఎదురీతను ఈదిందనే చెప్పాలి. అలాంటి సమంత ఆత్మవిశ్వాసంతో మనోధైర్యంతో ముందుకు సాగుతూనే ఉంది. ప్రస్తుతం తెలుగులో విజయ్‌దేవరకొండకు జంటగా ఖుషి అనే చిత్రంలో నటిస్తున్న ఈమె ఆంగ్ల వెబ్‌ సీరీస్‌ సిటాడెల్‌ హిందీ రీమేక్‌లో నటిస్తోంది. అలా పాన్‌ ఇండియా నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి ఇప్పుడు పాన్‌ వరల్డ్‌ నటిగా పేరు తెచ్చుకోపోతోంది.

అవును ఇప్పుడు సమంత హాలీవుడ్లోకి ఎంట్రీ షురూ అయ్యింది. చైన్నె స్టోరీ అనే హాలీవుడ్‌ చిత్రంలో నటించబోతోంది. ఇందులో ఇంగ్లాండ్‌ దేశానికి చెందిన హాలీవుడ్‌ నటుడు వివేక్‌ కల్రా కథానాయకుడిగా నటించరున్నారు. దీనికి ఫిలిప్‌ జాన్‌ అనే ఆయన దర్శకత్వం వహించారు. ఇది ఇంగ్లాండ్‌కు చెందిన యువకుడికి, చైన్నెకు చెందిన అమ్మాయితో జరిగే ప్రేమకథగా సాగే చిత్రంగా ఉంటుందని సమాచారం త్వరలోనే ఈ చిత్రం సెట్‌ పైకి వెళ్లనున్నట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement