ఆ విషయంలో నిరూపించుకోవాల్సిన పనిలేదు: సమంత | Samantha Comments On Her Photos | Sakshi

ఆ విషయంలో నిరూపించుకోవాల్సిన పనిలేదు: సమంత

May 9 2024 2:57 PM | Updated on May 9 2024 3:40 PM

Samantha Comments On Her Photos

ఏ విషయంలోనూ తగ్గేదేలేదు అనే హీరోయిన్‌లలో సమంత ముందుటారని చెప్పవచ్చు. కొద్దిరోజుల క్రితం ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడిన శ్యామ్‌.. మళ్లీ కెమెరాల ముందుకు వచ్చింది. మయోసైటీస్‌ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్న సమంత ఆ వ్యాధికి చికిత్స తీసుకున్నారు. అంతకు ముందే భర్తకు దూరం అయ్యారు. గత  రెండేళ్లుగా ఏ చిత్రంలోనూ నటించేందుకు అంగీకరించలేదు. ఒప్పుకున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ల నుంచి కూడా ఆమె తప్పుకున్నారు.  అయినప్పటికీ వాటి గురించి కొంచెం కూడా ఆలోచించకుండా చలాకీగా ఉంటూ సంతోషంగా కాలాన్ని గడిపేస్తుంటారు. 

సమంతకు ఆర్థిక సమస్యలు లేవనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు తనే నిర్మాతగా మారి తెలుగులో మా ఇంటి బంగారం అనే హీరోయిన్‌ ఓరియన్‌టెడ్‌ కథా చిత్రాన్ని చేయడానికి సిద్ధం అయ్యారు. ఇక పోతే తరచూ తన గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ వార్తల్లో ఉంటున్నారు. కాగా అలానే ఇటీవల ఆమె అర్ధనగ్నంగా స్నానం చేస్తున్న ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. దీంతో ఒక్కసారిగా నెటిజన్లు సమంతపై విమర్శల దాడి చేశారు. 

సమంత ఇలా మారిపోయారేమిటి? ఆమెను ఇలా ఊహించుకోలేమంటూ అభిమానులు కామెంట్‌ చేశారు. తీరా అది సమంత ఫొటో కాదని, ఫేక్‌ అని తేలింది. అప్పుటి వరకూ ఈ వ్యవహారంపై నోరు మెదపని సమంత ఇప్పుడు తాను ఎవరికీ, ఏ విషయంలోనూ కొత్తగా నిరూపించుకోవలసిన అవసరం లేదని తన ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొన్నారు. దీంతో దటీజ్‌ సమంత అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement