దక్షిణాది చిత్ర పరిశ్రమలో నటిగా సమంత స్థానం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. దక్షిణాదిలో అగ్ర కథానాయికల్లో ఈమె ఒకరు. తెలుగు, తమిళం భాషల్లో స్టార్ హీరోలందరి సరసన నటించి టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు. ఇకపోతే వ్యక్తిగతంగానూ, వృత్తి పరంగానూ వివాదాలు చుట్టు ముట్టినా ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంది. తన జీవితంలో పెళ్లి అనే బంధం బ్రేక్ అయినా దానిని తట్టుకుని నిలబడింది. ఆ సంఘటనను ఆమె ఎదుర్కొన్నారు. ఇక మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి నుంచి బయట పడటం అంత సులువైన పనికాదని చెప్పవచ్చు. దానితోనూ పోరాడి కోలుకున్నారు.
మళ్లీ వెండితెరపై మెరిసేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ కింగ్ షారూక్‌ఖాన్‌తో కలిసి ఒక చిత్రం, మలయాళంలో మమ్ముట్టి సరసన ఒక చిత్రం, తమిళంలో విజయ్‌కు జంటగా ఒక చిత్రం చేయడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీటితో పాటు సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటించినందుకు భారీ పారితోషికం పుచ్చుకున్నట్లు ప్రచార సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా ఇటీవల ఒక భేటీలో మీరు నటిగా మారడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు సమంత బదులిస్తూ తాను సాధారణ కుంటుంబంలో పుట్టిన అమ్మాయినని, తన ఉన్నత చదువుకు ఫీజు కూడా కట్టలేని పరిస్థితిలో తన తండ్రి ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు.
దీంతో వేరే దారి లేక తాను సినిమాల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ఆమె చెప్పారు. రూ. 500 కోసం ఒక హోటల్‌లో హోస్ట్‌గా కూడా పనిచేసినట్లు సమంత గుర్తుచేసుకుంది. అయితే సినిమా తన జీవితాన్నే మార్చేసిందని ఆమె పేర్కొన్నారు. కాగా ఈమె నిర్మాతగానూ మారుతున్నట్లు ఆ మధ్య ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఖుషీ చిత్రం తరువాత సమంత నటించిన చిత్రమేదీ విడుదల కాకపోవడంతో ఆమె అభిమానులు చాలా నిరాశకి గురవుతున్నారనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment