హీరోయిన్‌ 'సమంత' దినచర్య ఇదే.. నెట్టింట వైరల్‌ | Actress Samantha Regular Habits | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ 'సమంత' దినచర్య ఇదే.. నెట్టింట వైరల్‌

Published Sat, Sep 14 2024 8:43 AM | Last Updated on Sat, Sep 14 2024 10:56 AM

Actress Samantha Regular Habits

చిత్ర పరిశ్రమలో నటి సమంత ఎప్పుడూ ప్రత్యేకమే. పాకెట్‌ మనీ కోసం వేడుకల్లో పాల్గొనే స్థాయి నుంచి పాన్‌ ఇండియా నటిగా అగ్రస్థాయికి చేరుకుంది. ఆమె జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. తమిళం, తెలుగు భాషల్లో స్టార్‌ హీరోలతో జతకట్టి పాపులర్‌ అయిన ఈ చెన్నై బ్యూటీ ఆ తరువాత ఫ్యామిలీమెన్‌ 2 వెబ్‌ సిరీస్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈమె నటించిన మరో వెబ్‌ సిరీస్‌ సిటాడెల్‌ త్వరలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఇటీవల మయోసిటీస్‌ అనే అరుదైన వ్యాధికి గురైన సమంత దాని నుంచి బయటపడడానికి గట్టిగానే ప్రయత్నించారు. ప్రస్తుతం ఆరోగ్య పరంగా కోలుకున్న శ్యామ్‌  మళ్లీ నటించడానికి సిద్ధమైంది. తానే సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను ప్రకటించి తనే ప్రధాన పాత్రలో మా ఇంటి బంగారం అనే చిత్రాన్ని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఆ తరువాత దీనికి సంబంధించిన పురోగతే లేదు. 

ఇదీ చదవండి: సందీప్‌, సాయి ధరమ్‌తేజ్‌తో ఎఫైర్స్.. రెజీనా రియాక్షన్‌

అదేవిధంగా తొలిసారిగా మలయాళ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు, గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా నటించనున్న చిత్రంలో కథానాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అదేవిధంగా చాలా గ్యాప్‌ తరువాత తమిళంలో విజయ్‌ 69వ చిత్రంలో నటించనున్నట్లు ప్రచారం  జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సమంత తన దిన చర్య గురించి ఒక వీడియోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. 

అందులో “నేను ఉదయం నిద్ర లేవగానే 6.30 గంటలకు సూర్యోదయాన్ని చూసి శరీరానికి కావలసిన విటమిన్స్‌ను పొందుతాను. ఆ తరువాత ఆయిల్‌ పుల్లింగ్‌ చేస్తాను. 7 గంటలకు జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేస్తాను. ఆ తరువాత ఇంటికి చేరుకుని దేవునికి పూజ చేస్తాను. కారులో షూటింగ్‌కు వెళ్లేటప్పుడు కళ్ల భద్రత కోసం చికిత్స చేసుకుంటాను. 9 గంటలకు షూటింగ్‌ స్పాట్‌కు వెళ్లగానే ముఖానికి ఐస్ థెరపీ చేసుకుని ప్రెష్‌ అవుతాను. ఆ తరువాత మేకప్‌ వేసుకుని షూటింగ్‌కు రెడీ అవుతాను. ఆ తరువాత సాయంత్రం 6 గంటలకు  బాడీ‌ థెరపీ చేయించుకుంటాను. 7 గంటలకు టెన్నీస్‌ ఆటతో ఆనందిస్తాను. రాత్రి 9.30 గంటలకు ధ్యానం చేస్తాను. 10 గంటలకు నిద్రకు ఉపక్రమిస్తాను’ అని సమంత తన దిన చర్యను వీడియో ద్వారా వెల్లడించారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement