సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ శృతిహాసన్ సినీ కేరీర్‌ను చూస్తే నటిగా, సంగీత దర్శకురాలిగా, గాయనీగా, గీత రచయితగా తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 14 ఏళ్ల వయసులోనే తన తండ్రి కమలహాసన్ కథానాయకుడిగా నటించిన హేరామ్ చిత్రంలో బాల నటిగా రంగప్రవేశం చేసిన శృతిహాసన్ ఆ తరువాత లక్ అనే హిందీ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు.
ఆ తరువాత తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తమిళంలో ఏళాం అరివు (7th సెన్స్) చిత్రంలో సూర్యకు జంటగా నటించి గుర్తింపు పొందారు. అలా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ అగ్ర కథానాయకిగా రాణిస్తున్న శృతిహాసన్ ఇప్పుడు హాలీవుడ్ చిత్రంలో నటించే స్థాయికి ఎదిగారు. చైన్నె స్టోరీ అనే అంతర్జాతీయ చిత్రంలో నటిస్తున్నారు. నిజానికి ఈ చిత్రంలో నటించే లక్కీఛాన్స్‌ను నటి సమంత పొందారు.
అయితే ఆమె మైయోసిటీస్ అనే అరుదైన వ్యాధికి గురి కావడంతో ఆ అవకాశాన్ని వదులుకున్నారు. దీంతో ఆ అదృష్టం శృతిహాసన్‌ను వరించింది. ఇది అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ అనే హాస్య నవల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో శృతిహాసన్ అనూ అనే లేడీ డిటెక్టీవ్‌గా నటిస్తున్నారు. కాగా ఈమె ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. హాలీవుడ్ చిత్రంలో నటించడం తన మనసుకు ఉత్సాహాన్నిస్తోందని ఆమె ఒక భేటీలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment