Carrie star Samantha Weinstein Passes Away At 28 - Sakshi
Sakshi News home page

Samantha Weinstein: క్యాన్సర్‌తో పోరాటం.. పెళ్లైన ఆరు నెలలకే సమంత కన్నుమూత

May 25 2023 11:21 AM | Updated on May 25 2023 11:43 AM

Samantha Weinstein Passes Away - Sakshi

తను ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటుంది. తనతో కాసేపు కలిసి మాట్లాడితే చాటు ఆ పాజిటివ్‌ వైబ్స్‌ మాకూ వస్తాయని చాలామంది చెప్తూ ఉంటారు' అంటూ కూతుర్ని తలుచుకు

హాలీవుడ్‌ నటి సమంత(28) చిన్నవయసులోనే కన్నుమూసింది. రెండున్నరేళ్లుగా అండాశయ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. మే 14న ఆమె మరణించగా ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. నటి మరణంపై హాలీవుడ్‌ సెలబ్రిటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

సమంత ఇక లేదన్న విషాదాన్ని ఆమె తండ్రి జీర్ణించుకోలేకపోతున్నాడు. 'తను ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటుంది. తనతో కాసేపు కలిసి మాట్లాడితే చాటు ఆ పాజిటివ్‌ వైబ్స్‌ వస్తాయని చాలామంది చెప్తూ ఉంటారు' అంటూ కూతుర్ని తలుచుకుని కన్నీటిపర్యంతమయ్యాడు. సమంత మా అందరి జీవితాలను మార్చివేసిందంటూ ఆమె తల్లి భావోద్వేగానికి లోనైంది.

10 ఏళ్లకే నటనను కెరీర్‌గా ఎంచుకుంది సమంత. 2005లో బిగ్‌ గర్ల్‌లో జోసెఫిన్‌ పాత్రను పోషించింది. పలు చిత్రాల్లో నటించి మెప్పించిన సమంత 2022 అక్టోబర్‌లో మైఖేల్‌ నుట్సన్‌ను పెళ్లాడింది. మే 1న అతడితో కలిసి హనీమూన్‌కు వెళ్లిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇందులో నటి తన భర్తతో కలిసి చిరునవ్వులు చిందించింది. అయితే అదే ఆమె ఆఖరి పోస్టు కావడం గమనార్హం.

చదవండి: ప్రేయసిని పెళ్లాడిన నటుడు, ఫోటోలు వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement