Samantha First Hollywood Movie 'Arrangements Of Love' Controversial Role, Full Details In Telugu - Sakshi
Sakshi News home page

Samantha: మరో వివాదాస్పద పాత్రలో సమంత, బై-సెక్సువల్‌ తమిళ అమ్మాయిగా..

Published Fri, Nov 26 2021 11:12 AM | Last Updated on Fri, Nov 26 2021 12:19 PM

Samantha Announces Her First International Film Arrangements Of Love - Sakshi

"Arrangement Of Love" Movie Samantha Role: విడాకుల అనంతరం సమంత సినిమాల పరంగా దూసుకుపోతోంది. వరుస ప్రాజెక్ట్స్‌కు సంతకాలు చేస్తూ సరికొత్తగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. పెళ్లి తర్వాత డిసెంట్‌ రోల్స్‌ సెలక్ట్‌ చేసుకున్న సామ్‌ ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌ తర్వాత భిన్నమైన పాత్రలకు మోగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సమంత ఓ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌కు సంతకం చేసినట్లు ఇటీవల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌’ అనే చిత్రంతో సామ్‌ హాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చింది సమంత.

చదవండి: Samantha: హాలీవుడ్‌పై కన్నేసిన సమంత, ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు సైన్‌!

ఫిలిప్ జాన్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కబోతోంది. ఇది భారతీయ రచయిత ఎన్‌ మురారి రాసిన ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ లవ్’ నవల ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ కంటే మించిన వివాస్పద పాత్రలో సమంత నటించబోతోంది. బై-సెక్సువల్‌ తమిళ అమ్మాయిగా సమంత కనిపించబోతోందట. అంటే కేవలం పురుషులకు మాత్రమే కాకుండా స్త్రీల ఆకర్షణకు కూడా లోనయ్యే యువతి పాత్ర ఇది. అంతేగాక ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తీస్తున్నారట. తమిళ, హిందీ భాషలతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్ లాంటి భాషల్లో కూడా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారట.  

చదవండి: విడాకుల తర్వాత తొలిసారి అక్కినేని కాంపౌండ్‌లోకి సామ్‌!

‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’లో బోల్డ్‌ సీన్స్‌లో నటించి విమర్శలు ఎదుర్కొన్న సామ్‌ ఇప్పుడు దీనికంటే వివాదస్పద పాత్రం చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చెప్పాలంటే చైతో విడిపోవడానికి ఈ సినిమాలో రాజీ పాత్ర కూడా ఒక కారణమని వార్తలు వచ్చిన విషయం విధితమే. ఇక ఇటీవల శాకుంతలం మూవీని పూర్తి చేసుకున్న సమంత తమిళలో​ కాతువాకుల రెండు కాదల్‌లో నటిస్తోంది. దీనితో పాటు డ్రీమ్‌ వారియర్‌ బ్యానర్లో ఓ ద్విభాసా చిత్రంతో పాటు శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌లో శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మాణంలో సమంత మరో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. అంతేగాక ఈ ప్రాజెక్ట్స్‌కు సమంత భారీగా పారితోషికం అందుకుంటోందని కూడా వినికిడి. ఇదిలా ఉంటే పుష్పలో ఐటెం సాంగ్‌ చేయడానికి కూడా సామ్‌ సిద్ధమైన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement