
Gunasekhar Congratulates Samantha For Her Hollywood Debut: నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత దూకుడు పెంచింది. వరుస సినిమాలు చేస్తూ జోరు కొనసాగిస్తుంది. తాజాగా బాలీవుడ్ బడా హీరోయిన్స్‌కు కూడా దక్కని అవకాశాన్ని చేజిక్కుంచుకుంది. తొలి అంతర్జాతీయ ప్రాజెక్ట్‌పై సైన్ చేసింది. ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో సమంత నటిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
‘డోంటన్ అబ్బే’ ఫేమ్ ఫిలిప్ జాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ చిత్రంలో సామ్ బై-సెక్సువల్ తమిళ అమ్మాయిగా కనిపించనున్నట్లు సమాచారం. అయితే సినిమా, సినిమాకు వైవిధ్యం చూపిస్తూ టాలీవుడ్‌ను దాటి, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు సైన్ చేస్తుండటంతో సామ్‌పై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజాగా డైరెక్టర్ గుణశేఖర్ ట్వీట్ చేస్తూ.. 'మీ డెడికేషన్‌కు ఇది తగిన ఫలితం. ఇంకా మరెన్నో చేయాలి' అంటూ పేర్కొనగా.. 'థ్యాంక్యూ సార్' అంటూ సమంత రిప్లై ఇచ్చింది. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో శాకుంతలం సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
Thankyou sir ☺️🙏 https://t.co/kF1hRoCuCM
— Samantha (@Samanthaprabhu2) November 26, 2021