ovarian cancer
-
రెండున్నరేళ్లుగా క్యాన్సర్‌తో పోరాటం.. నటి కన్నుమూత
హాలీవుడ్ నటి సమంత(28) చిన్నవయసులోనే కన్నుమూసింది. రెండున్నరేళ్లుగా అండాశయ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. మే 14న ఆమె మరణించగా ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. నటి మరణంపై హాలీవుడ్ సెలబ్రిటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సమంత ఇక లేదన్న విషాదాన్ని ఆమె తండ్రి జీర్ణించుకోలేకపోతున్నాడు. 'తను ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటుంది. తనతో కాసేపు కలిసి మాట్లాడితే చాటు ఆ పాజిటివ్ వైబ్స్ వస్తాయని చాలామంది చెప్తూ ఉంటారు' అంటూ కూతుర్ని తలుచుకుని కన్నీటిపర్యంతమయ్యాడు. సమంత మా అందరి జీవితాలను మార్చివేసిందంటూ ఆమె తల్లి భావోద్వేగానికి లోనైంది. 10 ఏళ్లకే నటనను కెరీర్‌గా ఎంచుకుంది సమంత. 2005లో బిగ్ గర్ల్‌లో జోసెఫిన్ పాత్రను పోషించింది. పలు చిత్రాల్లో నటించి మెప్పించిన సమంత 2022 అక్టోబర్‌లో మైఖేల్ నుట్సన్‌ను పెళ్లాడింది. మే 1న అతడితో కలిసి హనీమూన్‌కు వెళ్లిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో నటి తన భర్తతో కలిసి చిరునవ్వులు చిందించింది. అయితే అదే ఆమె ఆఖరి పోస్టు కావడం గమనార్హం. View this post on Instagram A post shared by Samantha Weinstein (@samsationalw) View this post on Instagram A post shared by Samantha Weinstein (@samsationalw) చదవండి: ప్రేయసిని పెళ్లాడిన నటుడు, ఫోటోలు వైరల్ -
అండాశయాల్లో వచ్చే క్యాన్సర్
గర్భాశయానికి ఇరుపక్కలా బాదం పప్పు సైజులో ఉండే అండాశయాలు అండాలను ఉత్పత్తి చేయడంతో పాటు స్త్రీ హార్మోన్లు అయిన ఈస్ట్రోజెన్, ప్రోజెస్టిరాన్లను విడుదల చేస్తుంటాయి. స్త్రీలలో నెలసరికి ఈ హార్మోన్లే కారణం. ఈ హార్మోన్లు సరిగ్గా విడుదల అయినంత కాలం అనేక గైనిక్ సమస్యలకు దూరంగా ఉండటంతో పాటు సంతానలేమి సమస్య కూడా బాధించదు. అండాశయాలలో కణాలు అపరిమితం గా పెరిగి పక్కనున్న కణజాలాలకు, ఇతర భాగాలకు వ్యాపించడాన్ని ‘ఒవేరియన్ క్యాన్సర్’ అంటారు. అపరిమితంగా పెరిగిపోయే ఈ కణాలను బట్టి ఈ క్యాన్సర్‌ను మూడు రకాలుగా విభజించారు. 1. ఎపిథీలియల్ ఒవేరియన్ క్యాన్సర్ వయసు పైబడిన స్త్రీలలో దాదాపు 90% వరకు ఈ క్యాన్సర్ వస్తుంటుంది. 2. జెర్మ్‌సెల్ ట్యూమర్ ఒవేరియన్ క్యాన్సర్ వయసులో ఉండే అమ్మాయిల్లో వచ్చే ఒవేరియన్ క్యాన్సర్ ఇది. ఈ క్యాన్సర్ కణాలు అండాల నుంచి పుడతాయి. 3. సెక్స్కార్డ్ స్ట్రోమల్ ట్యూమర్ ఒవేరియన్ క్యాన్సర్ ఈ క్యాన్సర్ కణాలు అండాలలో హార్మోన్స్ ఉత్పత్తి అయ్యే దగ్గర్నుంచి తయారవుతాయి. స్త్రీలలో ఈస్ట్రోజెన్, ప్రోజెస్టిరాన్ హార్మోన్లు చాలా ఎక్కువగా, దీర్ఘకాలికంగా ఉంటే ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. స్త్రీలలో వచ్చే క్యాన్సర్లలో అండాశయ క్యాన్సర్‌ది మూడో స్థానం. గర్భాశయ ముఖద్వార, రొమ్ము క్యాన్సర్ల తర్వాత ఈ క్యాన్సర్లే ఎక్కువ. ఇక్కడ పేర్కొన్న మూడు రకాలే కాకుండా వాటిలోనూ ఇంకా ఎన్నో సబ్–టైప్స్ ఉంటాయి. స్త్రీలలో 50 ఏళ్లు పైబడ్డాక ఎక్కువగా కనిపించే ఈ క్యాన్సర్‌ను ఒక సైలెంట్ కిల్లర్‌గా పేర్కొంటూ ఉంటారు. ఎందుకంటే పొత్తికడుపు లో చాలా లోపలికి ఉండే అండాశయాల క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలు కూడా చాలా ఆలస్యంగా బయటపడుతూ ఉంటాయి. ఎవరెవరిలో... ►పిల్లలు కలగని మహిళల్లో ►బ్రెస్ట్, కోలన్ క్యాన్సర్ వచ్చిన మహిళల్లో ►సంతానం కోసం చాలా ఎక్కువగా మందులు వాడిన వారిలో ►హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని దీర్ఘకాలికంగా తీసుకున్నవారిలో ►కొవ్వు పదార్థాలు, మాంసాహారం ఎక్కువగా తీసుకునేవారిలో ►క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ ఉండి, 50 ఏళ్లు పైబడిన స్త్రీలలో ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు కొంత ఎక్కువ అనే చెప్పవచ్చు. గైనకాలజిస్ట్ దగ్గరికి గైనిక్ చెకప్స్‌కు వెళ్లినప్పుడు ఈ క్యాన్సర్ అంత త్వరగా బయటపడకపోవచ్చు. అందుకే అనుమానంగా ఉంటే అల్ట్రాసౌండ్ పరీక్షతో పాటు బ్లడ్‌టెస్ట్‌లు, సీఏ 125, పాప్ టెస్ట్ మొదలైనవాటితో పాటు సీటీ, ఎమ్మారై వంటివి కూడా చేస్తారు. బ్రెస్ట్ క్యాన్సర్‌కు కారణమయ్యే బీఆర్సీఏ–1 జీన్ మ్యుటేషన్లో తేడాలున్నప్పుడు ఈ క్యాన్సర్ పరీక్షలు 25 ఏళ్ల వయసు నుంచే చేయించడం మంచిది. మెనోపాజ్ దశకు ముందు నుంచి ఈస్ట్రోజెన్ హార్మోన్ ను మాత్రమే 5 నుంచి 10 ఏళ్ల కంటే ఎక్కువగా తీసుకుంటే ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు పెరగవచ్చు. ప్రోజెస్టిరాన్ హార్మోన్ కాంబినేషన్లో ఈస్ట్రోజెన్ తీసుకుంటే ఆ ముప్పు కొంతవరకు తగ్గవచ్చు. అన్ని క్యాన్సర్లలోలాగే ఈ క్యాన్సర్‌లో కూడా నాలుగు స్టేజ్‌లు ఉంటాయి. స్టేజ్ 1: ఒకటి లేదా రెండు అండాశయాలకు మాత్రమే పరిమితం. స్టేజ్ 2: గర్భాశయానికీ వ్యాప్తి చెందడం స్టేజ్ 3: అండాశయాలు, గర్భాశయంతో పాటు లింఫ్ నాళాలు, పొత్తికడుపు లైనింగ్‌కు వ్యాప్తి చెందడం. స్టేజ్ 4: పైవాటితోపాటు శరీరంలోని ఇతర అవయవాలకు సోకడం. ఈరోజుల్లో వాడే బర్త్‌కంట్రోల్ పిల్స్ (పిల్లలు పుట్టకుండా ఉండేందుకు వాడే టాబ్లెట్ల) వల్ల ట్యూబల్ లిగేషన్, హిస్టరెక్టమీ అయిన మహిళల్లో ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొంత తక్కువగా ఉండవచ్చు. చికిత్స స్టేజ్‌లపై ఆధారపడి సర్జరీతో పాటు ఇతర థెరపీలను ఎంతకాలం ఇవ్వాలో నిర్ణయిస్తారు. నోటిద్వారా, ఐవీ ద్వారా లేక నేరుగా పొట్టలోకే ఇచ్చే కీమోతో పాటు టార్గెటెడ్ థెరపీలు కూడా ఉంటాయి. పెళ్లికాని అమ్మాయిలు ఈ క్యాన్సర్‌కు ఇచ్చే కీమో, రేడియోథెరపీల కారణంగా మెనోపాజ్ లాంటి లక్షణాలకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే వీరి అండాలను చికిత్సకు ముందే తీసి, భవిష్యత్తులో సంతానభాగ్యం పొందడానికి భద్రపరిచే సౌకర్యాలు ఉన్నాయి. ఒవేరియన్ క్యాన్సర్ లక్షణాలు: ఈ క్యాన్సర్ లక్షణాలు అంత త్వరగా బయటపడవు. అంతేకాకుండా అవి అజీర్తి, యూరినరీ ఇన్ఫెక్షఅ న్స్లా అనిపించవచ్చు. మొదట్లో లక్షణాలు అంత తీవ్రంగా లేకపోవడం వల్ల తొలిదశలో ఈ క్యాన్సర్‌ను గుర్తించడం కష్టం కావచ్చు. ►పొత్తికడుపు ఉబ్బినట్లుగా ఉండి, నొప్పిగా ఉండటం. ►అజీర్తి, వికారం, తేన్పులు లాంటి జీర్ణ సంబంధ సమస్యల్లాంటి లక్షణాలు. ►యోని స్రావాలు అసాధారణంగా ఉండటం. ∙మూత్రం ఎక్కువగా లేదా త్వరగా రావడం. ►అలసట, జ్వరం ∙ఎక్కువగా లేదా ఇంతకుముందులా తినలేకపోవడం. కొంచెం తినగానే పొట్ట నిండినట్లుగా ఉండటం. ►ఊపిరి కష్టంగా ఉండటం. ∙కలయిక కష్టంగా ఉండటం. ►వెన్నునొప్పి లేదా నడుమునొప్పిగా అనిపించడం. ►అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం. ►ఈ క్యాన్సర్‌లో పై లక్షణాలలో కొన్ని కనిపించవచ్చు. -
జాన్సన్ బేబీ పౌడర్ ఇక దొరకదు
న్యూజెర్సీ: చిన్నారుల నాజూకైన చర్మం కోసం మరింత మృదువైన పౌడర్, సౌమ్యతలోని అద్భుతం అంటూ కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారుల్ని ఆకర్షించిన అమెరికా ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి బేబీ టాల్కమ్ పౌడర్ అమ్మకాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. అమెరికా, కెనడాలో 2020 నుంచి ఈ పౌడర్ విక్రయాలను నిలిపివేసిన జాన్సన్ కంపెనీ 2023 నుంచి ప్రపంచ వ్యాప్తంగా విక్రయాలను ఆపేస్తున్నట్టు స్పష్టం చేసింది. బేబీ టాల్కమ్ పౌడర్లు కేన్సర్‌కు దారి తీస్తున్నాయన్న ఆందోళనలతో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీపై కోర్టులో 40 వేలకు పైగా పిటిషన్లు పడ్డాయి. ఈ వివాదం నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. టాల్కమ్ పౌడర్లలో ఉండే అస్బెస్టాస్ అనే పదార్థం వల్ల కేన్సర్ సోకుతోందంటూ ఎందరో వినియోగదారులు కోర్టులకెక్కారు. దీంతో జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కమ్ పౌడర్ స్థానంలో కార్న్ స్టార్చ్ (మొక్కజొన్న పిండి)తో తయారు చేసిన పౌడర్‌ను విక్రయించనుంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఈ కార్న్ స్టార్చ్ పౌడర్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ కేన్సర్ వస్తోందంటూ న్యాయస్థానంలో పిటిషన్లు ఆగడం లేదు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ విక్రయాలను నిలిపివేయాలని ఆ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల ఆందోళనల్ని దృష్టిలో ఉంచుకునే టాల్కమ్ పౌడర్ అమ్మకాలనే నిలిపివేస్తున్నామే తప్ప తమ పౌడర్‌లో ఎలాంటి కేన్సర్ కారకాలు లేవని వాదిస్తోంది. వివాదం ఎలా వెలుగులోకొచ్చింది ? జాన్సన్ బేబీ పౌడర్‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ పౌడర్ పూస్తే తమ బిడ్డల చర్మం మరింత మృదువుగా, పొడిగా ఉంటుందని ఎందరో తల్లులు కొన్ని దశాబ్దాలుగా వాడుతున్నారు. డైపర్లు వాడినçప్పుడు ఏర్పడే ర్యాష్‌ని కూడా ఈ పౌడర్ నిరోధించడంతో ఎంతోమంది తల్లుల మనసు దోచుకుంది. తాజాదనం కోసం పిల్లలే కాదు పెద్దలు కూడా ఈ పౌడర్ని వాడుతూ వస్తున్నారు. అందుకే కొన్ని దశాబ్దాలు ఈ పౌడర్ ఏకఛత్రాధిపత్యం కొనసాగింది. 2017లో అమెరికాలోని లాస్‌ఏంజెలిస్‌కి చెందిన మహిళ తాను సుదీర్ఘకాలం జాన్సన్ బేబీ పౌడర్ వాడడంతో ఒవేరియన్ కేన్సర్ బారిన పడ్డానంటూ కోర్టుకెక్కారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు పౌడర్‌లో కేన్సర్ కారకాలు ఉన్నాయని తేలిందని స్పష్టం చేస్తూ కంపెనీకి 7 కోట్ల డాలర్లు నష్టపరిహారం కింద చెల్లించాలని తీర్పు చెప్పింది. దశాబ్దాలుగా కేన్సర్ కారకాలున్న పౌడర్ని అమ్ముతున్నందుకు మరో 34.7 కోట్ల డాలర్లను జరిమానాగా విధించింది. పౌడర్‌లో ఉండే అస్బెస్టాస్‌తో దీర్ఘకాలంలో ఊపిరితిత్తులు, అండాశయ ముఖద్వార కేన్సర్ వచ్చే అవకాశాలున్నాయని పరిశోధనలు కూడా తేల్చాయి. వాస్తవానికి 1957లో జాన్సన్ బేబీ పౌడర్‌లో అస్బెస్టాస్ ఉందని తేలింది. కానీ దీర్ఘకాలం వాడాకే దుష్ప్రభావాలు బయటపడ్డాయి. -
‘ఇప్పుడే అసలు యుద్ధం మొదలైంది’
‘మూడో కీమోథెరపీ పూర్తయింది. ఇప్పుడే అసలైన యుద్ధం మొదలైంది. తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేను త్వరగా కోలుకోవాలంటూ ఇంతమంది కోరుకోవడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీ మాటలే నాకు ధైర్యాన్ని, బతుకతాననే ఆశను బలంగా రేకెత్తిస్తాయి’ అంటూ బెంగాల్ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నఫీసా అలీ(61) ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టు ఆమె అభిమానులను ఉద్వేగానికి గురిచేస్తోంది. తాను ఒవేరియన్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నానే విషయాన్ని నఫీసా అలీ గతేడాది నవంబరులో అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీతో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన ఆమె... ‘ నా విలువైన స్నేహితురాలిని కలుసుకున్నాను. స్టేజ్ 3 క్యాన్సర్‌తో బాధపడుతున్న నేను త్వరగా కోలుకోవాలని ఆమె ఆశించారు’ అంటూ క్యాప్షన్ జతచేశారు. కాగా బెంగాల్లో జన్మించిన నఫీసా ప్రముఖ నటిగా గుర్తింపు పొందారు. ఆమె తాతయ్య వాజిద్ అలీ ప్రముఖ రచయిత. ఇక ఆమె మేనత్త జైబ్-ఉన్నీసా- హమీదుల్లా స్త్రీవాదిగా గుర్తింపు పొందారు. View this post on Instagram Done my 3rd Chemotherapy 10th January ‘19 and now the battle begins ... I am praying to get well .I am so deeply touched by all your wishes and feel blessed reading messages from around the world. Gives me hope and courage.💕🥰 A post shared by nafisa ali sodhi (@nafisaalisodhi) on Jan 10, 2019 at 11:12am PST View this post on Instagram A post shared by nafisa ali sodhi (@nafisaalisodhi) on Nov 17, 2018 at 4:53am PST -
రసాయనాల్లేని రక్షణ
తన్వీ ఉత్పత్తి చేస్తున్న బయోడీగ్రేడబుల్ నాప్కిన్స్ విరివిగా అందుబాటులోకి వస్తే.. గర్భాశయ ఇన్ఫెక్షన్ల నుంచి మహిళ ఆరోగ్యాన్ని, పర్యావరణ కాలుష్యం నుంచి భూమాతను కూడా రక్షించినట్లవుతుంది. ‘పరిశుభ్రత ఒక అలవాటుగా మారాలి’ అంటుంటాం. దేహ పరిశుభ్రత గురించి అందరి ముందు మాట్లాడగలుగుతాం. నోటి పరిశుభ్రత గురించి దంత వైద్యులు ఒక సమావేశం ఏర్పాటు చేస్తే పక్కవారిని కూడా పిలుచుకుని మరీ వెళ్తాం. అయితే రుతుక్రమం సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత గురించి అవగాహన కోసం మాట్లాడటానికి ఎవరైనా వస్తే మనలో ఎంతమందిమి హాజరు అవుతాం? అలాగని రుతుక్రమ పరిశుభ్రత గురించి సమాజంలో సంపూర్ణ అవగాహన ఉందా అంటే.. అదీ ఇరవై శాతానికి మించదు. భారతదేశంలో ఈ అంశం ఇంకా ఒక కళంకిత భావనగానే ఉంది. ఆ భావన తొలగిపోయే వరకు రుతుక్రమ పరిశుభ్రత క్యాంపెయిన్ల అవసరం కాదనలేనిది అంటున్నారు తన్వీ జోరీ. అనడమే కాదు, తనే శానిటరీ నేప్కిన్లను తయారు చేస్తూ, క్యాంపెయిన్‌ను నడుపుతున్నారు. ఇళ్లకే నేరుగా డెలివరీ తన్వీ జోరీకి స్వయంగా ఎదురైన ఇబ్బందుల నుంచి ఈ ఆలోచన వచ్చింది. బయోడీగ్రేడబుల్ నాప్కిన్ల అవసరాన్ని గుర్తించి, వాటి వాడకాన్ని మహిళలకు అలవాటు చేయాలనుకుంది. తనే వాటిని తయారు చేసింది. ఇక ఇప్పుడు వాటి వాడకం ఎంత అవసరమో తెలియచేసే ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. తన్వీ జోరీ న్యూఢిల్లీలో బిజినెస్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ చేసింది. మార్కెట్లో దొరికే శానిటరీ నాప్కిన్స్ వల్ల ఆమెకు స్కిన్ ర్యాష్ వస్తుండేది. దీని నుంచి బయటపడే మార్గం ఏమిటని ఆలోచించి తానే సొంతంగా 2016లో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పెట్టింది. మొక్కజొన్న పిండి, వెదురు పీచులను కలిపి నాప్కిన్లను తయారు చేసే టెక్నాలజీని కనుక్కుంది. ఇప్పుడు ఆమె ప్రారంభించిన ‘కార్మెసీ’ కంపెనీకి ఐదువేల మంది వినియోగదారులున్నారు. నేరుగా వాళ్ల ఇళ్లకే నేప్కిన్లు నెలనెలా డెలివరీ అవుతుంటాయి. ఈ ఉత్పత్తుల కోసం వెబ్సైట్ ద్వారా లాగిన్ అవుతున్నారు మహిళలు. తన్వీ వినియోగదారుల్లో 24–36 ఏళ్ల మధ్య వారే ఎక్కువ. నగరాల్లో నేచర్ బాస్కెట్ వంటి సహజమైన ఉత్పత్తులను విక్రయించే అవుట్లెట్లను ఇందుకోసం తన్వీ ఎంచుకుంది. ‘‘నెల నెలకూ 30 శాతం వ్యాపారం పెరుగుతోంది’’ అంటోంది తన్వి. ధైర్యమివ్వడమే ధ్యేయం కంపెనీ స్థాపనలో తన ఉద్దేశం అమ్మకాలు– కొనుగోళ్ల ఆధారంగా జరిగే వ్యాపారం కాదని, ఆధునిక మహిళలను కూడా వదలని సామాజిక కళంక భావనను సమూలంగా తుడిచేయడమేననీ ఆమె అంటోంది. రుతుక్రమం సమయంలో వాడి పారవేసే వ్యర్థాలు ఏటా మనదేశంలో లక్షా పదమూడు వేల టన్నులుగా ఉంటున్నాయి. రసాయనాలు, జెల్స్, సింథటిక్ ఫైబర్‌తో తయారైన నాప్కిన్లకు బదులుగా సహజపద్ధతుల్లో నేలలో కలిసి పోయే (బయోడీగ్రేడబుల్) నాప్కిన్ల వాడకం గురించి అవగాహన పెరగాలని ఆమె కోరుకుంటోంది. అంతకంటే ముందుగా తన అవసరాన్ని ధైర్యంగా చెప్పగలిగేటట్లు మహిళల్లో చైతన్యం తీసుకురావాలనేదే.. ఈ యూనిట్‌ను ప్రారంభించడంలో ఆమె ముఖ్యోద్దేశం. ఉన్నవాటికంటే మంచివి రెండు మూడు తరాలకు ముందు మహిళలు ఇంట్లో చేసుకుని వాడిన శానిటరీ నాప్కిన్స్ స్థానాన్ని ఇప్పుడు అధునాతన నాప్కిన్స్ భర్తీ చేస్తున్నాయి. మార్కెట్లో ఉన్న రసాయనాల ప్రభావంతో కూడిన నాప్కిన్స్ వాడకం మీద కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ ప్రస్తుతానికైతే అంతకంటే మరో మార్గం లేదు. అందువల్లనే ప్రభుత్వాలు కూడా పరిశుభ్రత లేని, అనారోగ్యకరమైన సంప్రదాయ పద్ధతుల నుంచి బయటకు వచ్చి మార్కెట్లో దొరికే స్టెరిలైజ్డ్ నాప్కిన్లను వాడమని సూచిస్తున్నాయి. ఇప్పటికి అందుబాటు ఉన్నవాటిలో అవే కొంత ఆరోగ్యకరం కాబట్టి! అయితే తన్వీ ఉత్పత్తి చేస్తున్న బయోడీగ్రేడబుల్ నాప్కిన్స్ విరివిగా అందుబాటులోకి వస్తే.. గర్భాశయ ఇన్ఫెక్షన్ల నుంచి మహిళ ఆరోగ్యాన్ని, పర్యావరణ కాలుష్యం నుంచి భూమాతను కూడా రక్షించినట్లవుతుంది. మహిళలకు ఎదురయ్యే ఆ కష్టం ఎవరికీ అర్థం కాదు.. అలాంటి సమస్యనే ఎదుర్కొన్న మరో మహిళకు తప్ప. నేను పడిన ఇబ్బందిని మాటల్లో చెప్పలేను. సంపన్న మహిళ అయినా, సాధారణ మహిళ అయినా ఇందులో అంతా సమానమే. అధునాతనమైన పరిశుభ్రమైన జీవనశైలిలో కూడా ఆ కష్టం తప్పలేదంటే, సాధారణ జీవితంలో ఇంకెలా ఉంటుందో అనుకునేదాన్ని. స్త్రీలకు ఆరోగ్యక రమైన జీవితాన్నివ్వడానికి నేను ఎంచుకున్న మార్గం ఇది. – తన్వీ జోరీ, కార్మెసీ ఫౌండర్ – మంజీర -
జాన్సన్ & జాన్సన్ కి మరో ఎదురు దెబ్బ
న్యూయార్క్: ప్రముఖ బహుళ జాతి సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి మరోసారి ఎదురు దెబ్బ తప్పలేదు. ఈ సంస్థ ఉత్పత్తులు బేబీ టాల్క్ పౌడర్, షవర్ టు షవర్ లను కొద్ది దశాబ్దాల పాటు వాడడం మూలంగా మహిళలకు అండాశయ క్యాన్సర్ సోకుతోందంటూ వచ్చిన ఆరోపణలో అమెరికా కోర్టు తీర్పు మరోసారి సంస్థకు భారీ షాకిచ్చింది. మిస్సౌరీ అండ్ న్యూ జెర్సీ కోర్టు తీర్పు తరహాలోనే మరో తీర్పు వెలువరించింది. బాధితురాలు గ్లోరియా రిస్తెంసుంద్ కి అనుకూలంగా అమెరికా జ్యూరీ తీర్పునిచ్చింది. సుమారు 365కోట్ల రూపాయల జరిమానా (55 మిలియన్ డాలర్లు) చెల్లించాలని సోమవారం అమెరికా జ్యూరీ ఆదేశించింది. బాధితురాలికి జరిగిన అసలు నష్టానికి గాను 5 మిలియన్ డాలర్లు, శిక్షాత్మక నష్టాలకు గాను 50 మిలియన్ డాలర్లు మొత్తం 55 మిలియన్ డాలర్లు చెల్లించాలని తీర్పు చెప్పింది. అలబామాకు చెందిన గ్లోరియా రిస్తెంసుంద్ ఒవేరియన్ క్యాన్సర్ తో బాధపడుతూ జాన్సన్ అండ్ జాన్సన్ పై ఫిర్యాదుచేశారు. బేబీ పౌడర్, షవర్ టు షవర్ లను దశాబ్దాల తరబడి వాడడం మూలంగా అండాశయ క్యాన్సర్ కు గురయిన్నట్టు ఆమె వాదించారు. ఈ తీర్పు తప్పట్ తమ క్లయింట్ సంతోషం వ్యక్తం చేశారని, హిస్టెరెక్టమీ లాంటి ఎన్నో ఆపరేషన్ల తర్వాత ప్రస్తుతం ఆమె వ్యాధి కొంచెం ఉపశమించినట్టు ఆమె తరపు న్యాయవాదులు తెలిపారు. అమెరికాలో నమోదైన అన్ని కేసులను సత్వరమే పరిష్కరించాలని కోరారు. అయితే దీనిపై మరోసారి అప్పీలు కు వెడతామని సంస్థ ప్రతినిది కరోల్ గూడ్ రిచ్ తెలిపారు. 30 యేళ్ల తమ సర్వీసులకు ఈ తీర్పు చెప్ప పెట్టులాంటిదన్నారు. తమ పోరాటం కొనసాగుతుందనీ, తమ నిజాయితీ నిరూపించుకుంటామన్నారు. క్యాన్సర్ సోకడానికి అనేక కారణాలు దోహదం చేస్తాయని, ఆమె కుటుంబంలో క్యాన్సర్ హిస్టరీ ఉందని వాదించారు. అటు వరుస ఎదురుదెబ్బల నేపథ్యంలో కంపెనీ షేరు భారీ నష్టాల్లో ట్రేడవుతోంది. కాగా బర్మింగ్ హామ్ కు చెందిన ఫాక్స్ అనే మహిళ కేసులో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తమ అమ్మకాలను పెంచుకోవడం కోసం టాల్క్ ఆధారిత పౌడర్ లు క్యాన్సర్ కు దారితీయ వచ్చని దశాబ్దాలుగా హెచ్చరించడం లేదని గతంలో అమెరికా కోర్టు భావించింది. ఈ వ్యవహారంలో సంస్థపై ఇప్పటికే అమెరికాలో సుమారు 1200 వరకు కేసులు నమోదయ్యాయి. గత విచారణలో ఆ కంపెనీ మోసం, నిర్లక్ష్యం, కుట్ర లకు పాల్పడిన్నట్లు ఆమె కుటుంబ న్యాయవాదులు ఆరోపించారు. వీటిని వాడటం వల్లన కలిగే నష్టాల అవకాశాల గురించి ఆ కంపెనీ కి 1980 ప్రాంతంలోనే తెలుసని, అయినా ప్రజలను, నియంత్రణ సంస్థలను మోసం చేస్తూ వచ్చారని వారు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలోనే ఆమ కుటుంబానికి 72 బిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని అమెరికా లోని మిస్సోరి స్టేట్ కోర్టు జ్యూరీ ఉత్తర్వు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
పౌడర్‌తో కేన్సర్ వచ్చిందని.. రూ. 493 కోట్ల పరిహారం
జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి అతి పెద్ద షాక్ తగిలింది. ఈ కంపెనీ తయారుచేసిన బేబీ పౌడర్, ప్రిక్లీ హీట్ పౌడర్లను కొన్ని దశాబ్దాల పాటు వాడిన ఓ మహిళ అండాశయ ముఖద్వార కేన్సర్‌తో మరణించడంతో.. ఆమె కుటుంబానికి సుమారు రూ. 493 కోట్ల పరిహారం చెల్లించాలని అమెరికా కోర్టు తీర్పు చెప్పింది. మిస్సౌరీ రాష్ట్ర జ్యూరీలోని 60 మంది సభ్యులుగల సెయింట్ లూయిస్ సర్క్యూట్ కోర్ట్ ఈ సంచలన తీర్పును ప్రకటించింది. దీంతో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఉత్పత్తుల నాణ్యత ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జాకీ ఫాక్స్ (62) ఒవేరియన్ కాన్సర్‌తో 2013లో మరణించారు. దీంతో ఆమె కొడుకు మార్విన్ స్కాల్టర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ల టాల్కం పౌడర్‌ను దీర్ఘకాలం పాటు వాడడం వల్లే తన తల్లి అనారోగ్యానికి గురయ్యారని ఆరోపించారు. టాల్క్ బేస్డ్ ఉత్పత్తుల వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్న విషయాన్ని జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటించలేదని చెబుతున్నారు. ఇదే అంశంపై మిస్సోరి కోర్టులో వెయ్యి కేసులు, న్యూజెర్సీ కోర్టులో మరో 200 కేసులు కూడా నమోదయ్యాయి. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ మోసం చేసిందని, నిర్లక్ష్యం వహించిందని, కుట్రపూరితంగా వ్యవహరించిందని జ్యూరీ తేల్చినట్లు ఫాక్స్ కుటుంబ న్యాయవాదులు తెలిపారు. తమ ఉత్పత్తులతో ఈ ప్రమాదం ఉందన్న విషయం ఆ కంపెనీకి 1980ల నుంచే తెలుసుని ఓ న్యాయవాది ఆరోపించారు. అయితే ఈ తీర్పుతో కంపెనీ ప్రతినిధి కరోల్ బ్రిక్స్ విభేదించారు. బాధిత కుటుంబం పట్ల తమకు సానుభూతి ఉందని.. ఆమె క్యాన్సర్‌కు తమ ఉత్పత్తుతలకు సంబంధం లేదని, ఈ తీర్పును సవాల్ చేయనున్నామని తెలిపారు. జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కం పౌడర్‌లో మెగ్నీషియం, సిలికాన్ లు చర్మాన్ని పొడిగా ఉంచడానికి, చెమట పొక్కులు దద్దుర్లు నివారించడానికి సహాయ పడతాయన్నారు. -
వెండితెరపై మనీషా జీవితం?
జీవితంలో ఎంతో క్లిష్టమైన సమస్యలను సైతం ధైర్యంగా ఎదుర్కొన్నవాళ్లెవరైనా ఇతరులకు ఆదర్శమే. ఆ విధంగా చూస్తే మనీషా కొయిరాలా చాలామందికి ఆదర్శం. రెండేళ్ల క్రితం ఈ నేపాలీ బ్యూటీ జీవితం ఊహించని ఓ మలుపు తీసుకున్న విషయం తెలిసిందే. ‘ఒవేరియన్ కేన్సర్’ సోకడంతో షాకయ్యారామె. కానీ, డీలా పడిపోలేదు. చికిత్స నిమిత్తం మనీషా న్యూయార్క్ వెళ్లారు. తన ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు చికిత్సకు సంబంధించిన వివరాలను పేర్కొన్నారు మనీషా. సంపూర్ణ ఆరోగ్యంతో న్యూయార్క్ నుంచి ముంబయ్ వచ్చిన మనీషా కొన్నాళ్లు విరామం తీసుకున్నారు. ఆ తర్వత కేన్సర్ వ్యాధి గురించి అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా మారుమూల గ్రామాలకు సైతం వెళ్లి, ‘కేన్సర్ అనేది భయపడాల్సి విషయం కాదు. చికిత్స చేయించుకుంటే నయమవుతుంది’ అని ధైర్యం నూరిపోస్తున్నారు. ఇది ఎంతోమందిలో కొత్త ఆశలు కల్పిస్తున్నారు. అదే ఆమె జీవితాన్ని సినిమాగా తీస్తే, ఎక్కువమంది స్ఫూర్తి పొందడానికి వీలుంటుంది కదా అని ఓ బాలీవుడ్ ఫిలిం మేకర్‌కి ఆలోచన వచ్చింది. మనీషా అనుమతి తీసుకుని ఈ సినిమా చేయాలనుకుంటున్నారట. కథ, స్క్రీన్‌ప్లే విషయాల్లో మనీషా జోక్యం ఉంటుందని సమాచారం. మరి.. ఈ సినిమాలో మనీషా నటిస్తారా? లేదా అనేది కాలమే చెప్పాలి.