వెండితెరపై మనీషా జీవితం? | Manisha s life history on silver screen | Sakshi
Sakshi News home page

వెండితెరపై మనీషా జీవితం?

Published Wed, Apr 9 2014 11:10 PM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

వెండితెరపై మనీషా జీవితం? - Sakshi

వెండితెరపై మనీషా జీవితం?

జీవితంలో ఎంతో క్లిష్టమైన సమస్యలను సైతం ధైర్యంగా ఎదుర్కొన్నవాళ్లెవరైనా ఇతరులకు ఆదర్శమే. ఆ విధంగా చూస్తే మనీషా కొయిరాలా చాలామందికి ఆదర్శం. రెండేళ్ల క్రితం ఈ నేపాలీ బ్యూటీ జీవితం ఊహించని ఓ మలుపు తీసుకున్న విషయం తెలిసిందే. ‘ఒవేరియన్ కేన్సర్’ సోకడంతో షాకయ్యారామె. కానీ, డీలా పడిపోలేదు. చికిత్స నిమిత్తం మనీషా న్యూయార్క్ వెళ్లారు. తన ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు చికిత్సకు సంబంధించిన వివరాలను పేర్కొన్నారు మనీషా. సంపూర్ణ ఆరోగ్యంతో న్యూయార్క్ నుంచి ముంబయ్ వచ్చిన మనీషా కొన్నాళ్లు విరామం తీసుకున్నారు.
 
ఆ తర్వత కేన్సర్ వ్యాధి గురించి అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా మారుమూల గ్రామాలకు సైతం వెళ్లి, ‘కేన్సర్ అనేది భయపడాల్సి విషయం కాదు. చికిత్స చేయించుకుంటే నయమవుతుంది’ అని ధైర్యం నూరిపోస్తున్నారు. ఇది ఎంతోమందిలో కొత్త ఆశలు కల్పిస్తున్నారు. అదే ఆమె జీవితాన్ని సినిమాగా తీస్తే, ఎక్కువమంది స్ఫూర్తి పొందడానికి వీలుంటుంది కదా అని ఓ బాలీవుడ్ ఫిలిం మేకర్‌కి ఆలోచన వచ్చింది. మనీషా అనుమతి తీసుకుని ఈ సినిమా చేయాలనుకుంటున్నారట. కథ, స్క్రీన్‌ప్లే విషయాల్లో మనీషా జోక్యం ఉంటుందని సమాచారం. మరి.. ఈ సినిమాలో మనీషా నటిస్తారా? లేదా అనేది కాలమే చెప్పాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement