సమంత బాటలో శృతిహాసన్‌? | Actress Shruti Haasan has stepped away from two projects. | Sakshi
Sakshi News home page

సమంత బాటలో శృతిహాసన్‌?

Published Sun, Oct 27 2024 6:30 AM | Last Updated on Sun, Oct 27 2024 9:46 AM

Actress Shruti Haasan has stepped away from two projects.

సినిమా రంగంలో అనుకున్నవన్నీ జరగవు. కొన్నిసార్లు ఊహించనవీ జరుగుతాయి. అలా టాప్‌ హీరోయిన్‌గా వెలిగిపోతున్న నటి సమంత కెరీర్‌ ఒక్కసారిగా సమస్యల్లోకి నెట్టబడింది. భర్త నాగచైతన్య నుంచి విడిపోవడం, అదే సమయంలో మయోసైటీస్‌ అనే అరుదైన వ్యాధికి గురయ్యారు. దీంతో సినిమాలకు దూరం అయ్యారు. ఆ వ్యాధి నుంచి బయట పడటానికి చాలా ప్రయత్నాలు చేశారు. పలు రకాల వైద్యం, యోగాలు, ధ్యానాలు చేశారు. మొత్తం మీద వ్యాధి నుంచి బయట పడ్డారు. అయితే ఇంకా నటనకు సిద్ధం కాలేదు. కారణం వచ్చిన చిత్రాలు వెనక్కి పోవడమేనని సమాచారం. 

మలయాళంలో మమ్ముట్టికి జంటగా నటించే అవకాశం వచ్చిందన్నారు. సొంతంగా చిత్ర నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. వీటిలో ఏవీ జరగలేదు. అలాగే చైన్నె లవ్‌స్టోరీ అనే ఆంగ్ల చిత్రంలో నటించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కారణాలేమైనా ఆ చిత్రం కూడా చేజారిపోయింది. అయితే ఆ చిత్రంలో నటించే అవకాశాన్ని నటి శృతిహాసన్‌ చేజిక్కించుకున్నారనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈమె కూడా ఆ చిత్రం నుంచి వైదొలగినట్లు సమాచారం. శృతిహాసన్‌ అంగీకరించి, వైదొలగడం అనేది ఇది రెండోసారి. ఈమె ఇప్పటికే తెలుగు చిత్రం డెకాయిట్‌ లవ్‌స్టోరీ అనే చిత్రం నుంచి వైదొలగారు. 

టాలీవుడ్‌ నటుడు అడవి శేషు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నటి శృతిహాసన్‌ నటించడానికి అంగీకరించారు. ఈ చిత్ర టీజర్‌ కూడా విడుదలై మంచి ఆదరణ పొందింది. అలాంటి సమయంలో కారణాలేమైన శృతిహాసన్‌ ఆ చిత్రం నుంచి వైదొలిగారు. తాజాగా ఆంగ్ల చిత్రం చైన్నె లవ్‌స్టోరీ నుంచి వైదొలిగినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. వీటన్నింటికీ కారణం ఆమె  నటిస్తున్న కూలీ చిత్రమేనా? అంటే అవుననే సమాధానమే కోలీవుడ్‌ వర్గాల నుంచి వస్తోంది. రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కూలీ. లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తి చేసుకుంది. 

ఆ తరువాత రజనీకాంత్‌ అస్వస్థతకు గురి కావడంతో షూటింగ్‌ వాయిదా పడింది. కాగా ఈ చిత్రంలో నటి శృతిహాసన్‌ రజనీకాంత్‌కు కూతురిగా నటిస్తున్నట్లు సమాచారం. కాగా కాల్‌షీట్స్‌ సమస్య కారణంగానే ఆమె చైన్నె లవ్‌స్టోరీ చిత్రం నుంచి వైదొలగినట్లు ప్రచారం జరుగుతోంది. అలా శృతిహాసన్‌ కూడా నటి సమంత బాటలోనే పయనిస్తున్నారు అనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement