లింగా రీ షూట్ చేయం | Lingua movie not a re shoot | Sakshi
Sakshi News home page

లింగా రీ షూట్ చేయం

Published Sun, Nov 9 2014 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM

లింగా రీ షూట్ చేయం

లింగా రీ షూట్ చేయం

సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఝలక్ ఇచ్చిన ఇళయదళపతి విజయ్. ఇది సోషల్ నెట్‌వర్కులో హల్‌చల్ చేస్తున్న ప్రచారం. విషయమేమిటంటే విజయ్ నటించిన కత్తి, రజనీకాంత్ నటించిన లింగా చిత్రాల్లో కొన్ని సన్నివేశాలు ఒకేలా ఉన్నాయనే ప్రచారం ఇంటర్‌నెట్‌లో హోరెత్తుతోంది. విజయ్, సమంత జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన కత్తి చిత్రం ఇటీవల విడుదలై  ఘన విజయం సాధించింది. కొన్ని కార్పొరేట్ సంస్థలు గ్రామాల్లో నీటి సమస్య సృష్టిస్తూ అక్కడ వ్యవసాయదారుల భూములను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తారుు. వారి దురాక్రమాలను ఒక యువకుడు ఎలా ఎదిరించి గ్రామ ప్రజల కోసం పోరాడి గెలిచాడన్నది కొత్త చిత్ర కథ.
 
 ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలకు రజనీకాంత్ తాజా చిత్రం లింగా చిత్రంలోని సన్నివేశాలకు పోలికలున్నట్లు తేలింది. దీంతో లింగా చిత్రంలోని ఆ సన్నివేశాలను రీ షూట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే విధంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ ముందుగా అనుకున్నట్లుగా ఆదివారం జరగాల్సి ఉంది. అయితే అదిప్పుడు వారుుదా పడింది. రజనీకాంత్ పుట్టిన రోజు డిసెంబర్ 12న లింగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర యూని ట్  గతంలో ప్రకటించింది. ఇప్పుడు చిత్ర విడుదల కూడా వాయిదా పడుతుందన్న ప్రచారం మొదలైంది.
 
 దీనిపై లింగా చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ స్పందిస్తూ ఇది అసత్య ప్రచారం అని ఆరోపించారు. వాస్తవానికి లింగా చిత్ర కథకు, కత్తి చిత్ర కథకు ఎలాంటి పోలికలు ఉండవన్నారు. అందువలన తమ చిత్రంలోని సన్నివేశాలను మార్చాల్సిన అవసరం, రీషూట్ చేయాల్సి న పని లేదని స్పష్టం చేశారు. లింగా చిత్ర షూటింగ్ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేసినట్లు తెలిపారు. ప్రస్తుతం చిత్ర నేపథ్య సంగీతం సమకూర్చే పని జరుగుతోందని లింగా చిత్రాన్ని ఖచ్చితంగా డిసెంబర్ 12న విడుదల చేయనున్నట్లు నిర్మాత వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement