నా జీవితంలో పెళ్లి లేదు | no marriage in my Life says shruti hassan | Sakshi
Sakshi News home page

నా జీవితంలో పెళ్లి లేదు

Published Fri, Jul 10 2015 2:43 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM

నా జీవితంలో పెళ్లి లేదు

నా జీవితంలో పెళ్లి లేదు

 నా జీవితంలో పెళ్లి అనే పదానికి తావే లేదని నటి శ్రుతిహాసన్ ఖరాఖండిగా వెల్లడించారు. ఈమె విడిపోయిన ఇద్దరు నట ప్రముఖుల వారసురాలన్న విషయం తెలిసిందే. ఈ సంచలన నటి ప్రస్తుతం ఇళయదళపతి విజయ్ సరసన పులి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. తాజాగా అజిత్‌కు జంటగా కొత్త చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి సూర్యతో సింగం-3 చిత్రంలోనూ నటించనున్నారు. ఇలా వరుసగా ప్రముఖ హీరోలతో నటిస్తున్న శ్రుతిహాసన్ ఇటీవల ఒక పత్రికకు భేటీ ఇస్తూ తన తండ్రి కమలహాసన్‌తో కలసి నటించాలనే అభిలాషను వ్యక్తం చేశారు.
 
 అయితే అలాంటి అవకాశం ఇంతకుముందు రెండుసార్లు వచ్చినా సద్వినియోగం చేసుకోలేదామె. కారణం కాల్‌షీట్స్ సర్దుబాటు కాకపోవడమే నని వివరించారు. కాగా వివాహం ఎప్పుడన్న ప్రశ్నకు శ్రుతి బదులిస్తూ ఈ విషయమై ఇప్పటికే ఒకసారి బదులిచ్చానని అయినా మళ్లీ చెప్పడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని పెళ్ళి గురించి తానెప్పుడూ ఆలోచించలేదని స్పష్టం చేశారు. ఇష్టాలు, ఆశల్లో భేదాభిప్రాయాలు ఉన్న దంపతులు సంసార జీవితం ప్రశాంతంగా సాగదన్నారు. ఈ కారణం గానే విడిపోతుంటారని వ్యాఖ్యానించారు.
 
 అందుకే తాను వివాహమే చేసుకోరాదన్న నిర్ణయాన్ని తీసుకున్నానన్నారు. శ్రుతి నిర్ణయం విస్మయాన్ని కలిగించినా ఆమె పెరిగిన వాతావరణం శ్రుతిపై అలాంటి ప్రభావానికి కారణం అని భావించాల్సి ఉంటుంది. శృతి తల్లిదండ్రులు కమలహాసన్, సారిక విడివిడిగా జీవిస్తున్నారు. శృతి కూడా ముంబయిలో ఒంటరిగానే నివసిస్తున్నారు. తల్లిదండ్రులను కలవాలపించినప్పడు వెళ్లి చూసి వస్తున్నారు. తల్లిదండ్రులు విడిపోవడం అన్నది ఎంత బాధాకరమే శ్రుతి చెప్పక పోయి నా స్పష్టంగా తెలిసిపోతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement