ఆయన సూపర్ చెఫ్ | Actor Ajit Super Chef says shruti hassan | Sakshi
Sakshi News home page

ఆయన సూపర్ చెఫ్

Published Mon, May 25 2015 2:10 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

ఆయన సూపర్ చెఫ్ - Sakshi

ఆయన సూపర్ చెఫ్

 నటుడు అజిత్ సూపర్ చెఫ్ అట. ఇది చెప్పింది ఎవరో కాదు క్రేజీ హీరోయిన్ శ్రుతిహాసన్. ఇంతకుముందు టాలీవుడ్‌లో ఎంత బిజీ నటిగా వెలుగొందారో అంతకంటే యమబిజీగా ఈ బ్యూటీ కోలీవుడ్‌లో విరాజిల్లుతున్నారు. శ్రుతి, ఇళయదళపతి విజయ్ సరసన నటిస్తున్న పులి చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఆమె మరో టాప్ స్టార్ అజిత్‌తో రొమాన్స్ చేస్తున్నారు. ఎన్నై అరిందాల్ తరువాత అజిత్ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ మొదలైంది. ఇంతకుముందు అజిత్‌తో వీరం చిత్రాన్ని తెరకెక్కించిన శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఏఎం రత్నం నిర్మిస్తున్న మరో భారీ చిత్రం ఇది.
 
  శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అజిత్‌కు చెల్లెలిగా నటి లక్ష్మీమీనన్ నటిస్తున్నారు. చిత్ర షూటింగ్‌లో ఘుమఘుమలాడే బిరియానీ చేసి యూనిట్ సభ్యులకు విందునివ్వడం అజిత్‌కు ఆనవాయితి. ఈ చిత్ర షూటింగ్‌లోనూ అజిత్ తన చేతివాటం చూపించారట. ఆయన చేసిన బిరియానీ తిన్న శ్రుతిహాసన్ ఆహా ఏమి రుచి అనరా మైమరచి అంటూ అజిత్‌కు పొగడ్తలతో ముంచెత్తేశారు. దీని గురించి ఈ బబ్లీ గర్ల్ తెలుపుతూ అజిత్ మంచి వ్యక్తిత్వం గల మనిషి మాత్రమే కాదు. ఆయనలో మంచి పాక శాస్త్ర నైపుణ్యుడు ఉన్నారని కితాబిచ్చారు. ఆయన సరసన నటిం చడం తీయని అనుభవంగా పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement