పదేళ్ల తర్వాత మొదటి హీరోతో... | Kajal Aggarwal To Romance With Hero Kalyan Ram Again | Sakshi
Sakshi News home page

పదేళ్ల తర్వాత మొదటి హీరోతో...

Published Mon, May 15 2017 11:54 PM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM

పదేళ్ల తర్వాత మొదటి హీరోతో...

పదేళ్ల తర్వాత మొదటి హీరోతో...

తెలుగులో కాజల్‌ అగర్వాల్‌ తొలి హీరో కల్యాణ్‌ రామ్‌. ఈ నందమూరి హీరో నటించిన ‘లక్ష్మీ కల్యాణం’ ద్వారా ఆమె కథానాయికగా పరిచయమైన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత ఆమె మళ్లీ కల్యాణ్‌రామ్‌ సరసన హీరోయిన్‌గా నటించనున్నారని టాక్‌. ఉపేంద్ర మాధవ్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ తెరకెక్కనున్న ఈ చిత్రం ఇటీవల ప్రారంభమైంది.

 ఈ చిత్రానికి ‘ఎమ్మెల్యే’ (మంచి లక్షణాలున్న అబ్బాయి) అనే టైటిల్‌ పరిశీలనలో ఉందట. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో కల్యాణ్‌ రామ్‌కు జోడీగా కాజల్‌ను ఎంపిక చేశారట. ఇదిలా ఉంటే.. తొలి చిత్రదర్శకుడు తేజ దర్శకత్వంలో ప్రస్తుతం ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో కాజల్‌ నటిస్తున్నారు. ఇప్పుడు కల్యాణ్‌ రామ్‌ సినిమాలో నటించనున్నది నిజమే అయితే.. తొలి దర్శకుణ్ణే కాదు.. హీరోనూ రిపీట్‌ చేసినట్లవుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement