మిల్కీబ్యూటీని కంటతడి పెట్టించిన స్కెచ్‌ | Vikram Romance with Tamanna | Sakshi
Sakshi News home page

మిల్కీబ్యూటీని కంటతడి పెట్టించిన స్కెచ్‌

Published Thu, Feb 16 2017 10:15 PM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM

మిల్కీబ్యూటీని కంటతడి పెట్టించిన స్కెచ్‌

మిల్కీబ్యూటీని కంటతడి పెట్టించిన స్కెచ్‌

కొన్ని సినిమా కథలు ఆర్టిఫిషియల్‌ అనిపిస్తే మరి కొన్ని హార్ట్‌ఫుల్‌గా ఉంటాయి. ఈ రెండవ కోవకు చెందిన కథలో తాను నటిస్తున్నానంటున్నారు మిల్కీబ్యూటీ తమన్నా. బాహుబలి చిత్రంతో బ్రహ్మాండమైన పాపులారిటీని పెంచుకున్న ఈ భామ ఆ తరువాత ఆ స్థాయి పాత్రల్లో నటించలేదు. తాజాగా విక్రమ్‌తో రొమాన్స్‌ చేస్తున్నారు. విజయ్‌చందర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి స్కెచ్‌ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో విక్రమ్‌ సంఘ విద్రోహుల్ని స్కెచ్‌ వేసి అంతం చేస్తారట.

మదురై నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కాయి. తాజాగా ఉత్తరచెన్నై నేపథ్యంలో వరుసగా చిత్రాలు రూపొందుతున్నాయి. ధనుష్‌ హీరోగా వడచెన్నై, కృష్ణ నటిస్తున్న వీరా, శుశీంద్రన్‌ దర్శకత్వంలో శత్రు చిత్రాలు ఉత్తర చెన్నై నేపథ్యంలో రూపొందుతున్న చిత్రాలే. విక్రమ్, తమన్నాల చిత్రానికి ఇదే నేపథ్యం అట. ఇంతకు ముందు గ్లామర్‌కు ప్రాముఖ్యతనిస్తూ నటించిన తమన్నా ఈ చిత్రంలో స్లమ్‌ ఏరియా యువతిగా చాలా సహజత్వంతో కూడిన పాత్రను పోషిస్తున్నారట. ఈ కథ విన్నప్పుడే అమ్మడు కళ్లు చమర్చాయట. బాహుబలి చిత్రం తరువాత అంతగా నటనకు అవకాశం ఉన్న పాత్రను ఈ స్కెచ్‌ చిత్రంలో చేస్తున్నారట.

విక్రమ్‌కు జంటగా నటించడమే చాలా ఎగ్జైట్‌గా ఫీలైన ఈ మిల్కీబ్యూటీ ఇప్పుడు ఇంత మంచి పాత్రలో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉందని తెగ మురిసిపోతుందట. ఇక సంచలన నటుడు శింబుతో నటిస్తున్న అన్బానవన్‌ అసరాదవన్‌ అడంగాదన్‌ చిత్రం షూటింగ్‌ తుదిదశకు చేరుకుందట.అలాగే బాహుబలి–2 ఏప్రిల్‌ 28న తెరపైకి రావడానికి బ్రహ్మాండంగా  ముస్తాబవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement