విక్రమ్‌కు హ్యాండిచ్చిన కాజల్ | kajal agarwal leave it to vikram movie | Sakshi
Sakshi News home page

విక్రమ్‌కు హ్యాండిచ్చిన కాజల్

Published Mon, Aug 1 2016 2:58 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

విక్రమ్‌కు   హ్యాండిచ్చిన కాజల్ - Sakshi

విక్రమ్‌కు హ్యాండిచ్చిన కాజల్

స్టార్ హీరోయిన్లు నటించిన చిత్రాలు ఒకటి రెండు వరుసగా ఫ్లాప్ అయితే ఇక ఆ హీరోయిన్ల పనైపోయింది, మూట ముల్లు సర్దుకోవలసిందే అనే ప్రచారం జరుగుతుంటుంది. వాస్తవానికి అలా జరగదు. ఇందుకు తాజా ఉదాహరణ నటి తమన్నా, కాజల్‌ల కెరీర్‌ను తీసుకోవచ్చు. తమన్నా విషయానికొస్తే బాహుబలి చిత్రానికి ముందు ఆమె పరిస్థితి చాలా బ్యాడ్ అనే చెప్పాలి. తమన్నాకు సినిమా టాటా చెప్పేసినట్లే అన్న వాళ్లు లేకపోలేదు. లారెన్స్‌తో నటించే అవకాశాన్ని మిస్ అయ్యారు. అదే విధంగా నటుడు విక్రమ్ ఇరుముగన్ చిత్రంలో కాజల్ నటించాల్సింది. అదీ చేజారిపోయింది. ఆయన నటించే మరో చిత్రం గరుడాలో నటించే అవకాశం కాజల్‌కు వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఆ చిత్రం ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో అవకాశాలకు దూరం అవుతున్న కాజల్ అనే ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడామె చేతి నిండా చిత్రాలున్నాయి. ముఖ్యంగా తమిళంలో మంచి రైజింగ్‌లో ఉన్నారు. అదే విధంగా నటి కాజల్‌అగర్వాల్‌కు ఇటీవల టాలీవుడ్‌లో వరుసగా అపజయాలు ఎదురయ్యాయి.దీంతో కాజల్ పనైపోయింది అనేశారు.

అది నిజం కాదని తనూ నిరూపించారు. కాజల్‌కిప్పుడు వద్దంటే అవకాశాలు. టాలీవుడ్‌లో మెగాస్టార్ 150వ చిత్రంలో నటించే అనూహ్య అవకాశం ఈ బ్యూటీని వరించింది. ఇక తమిళంలో మూడు నాలుగు చిత్రాలతో యమ బిజీగా ఉన్నారు. ఎంతగా అంటే విక్రమ్ చిత్రాన్ని అంగీకరించలేనంతగా. గరుడా చిత్రంలో నటించడం లేదని కాజల్ స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తను జీవాకు జంటగా కవలైవేండామ్ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా అజిత్ 57వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అదే విధంగా రానాకు జంటగా మరో తెలుగు చిత్రంలో నటించనున్నారు. మరో విశేషం ఏమిటంటే తెలుగు చిత్రం జనతాగ్యారేజ్‌లో జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రత్యేక గీతంలో స్టెప్స్ వేయనున్నారు. ఇందులో సమంత, నిత్యామేనన్‌లు నాయికలు. ఇలా వరుసగా టాప్ హీరోలతో జతకడుతూ కాజల్ తమిళం,తెలుగు భాషలలో మరో రౌండ్‌కు సిద్ధం అవుతున్నారన్న మాట.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement