వెల్లమిల్లి (ఉంగుటూరు), న్యూస్‌లైన్: ఉంగుటూరు మండలం వెల్లమిల్లి వద్ద జాతీయరహదారిపై ఆర్టీసీ బస్ మినీ వ్యాన్‌ను ఢీకొంది. ఈ ఘటనలో బస్ డ్రైవర్ వీకేఎన్ స్వామి గాయపడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు నుంచి తూర్పుగోదావరి జిల్లా కొమ్మర వెళుతున్న మినీ వ్యాన్‌ను విజయవాడ నుంచి తణుకు వెళుతున్న బైపాస్ ఎక్స్‌ప్రెస్ వెల్లమిల్లి వద్ద వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్ ముందు భాగం దెబ్బతింది. ఆ సమయంలో బస్‌లో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. వారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. బస్సు మినీ వ్యాన్ సమీపంలోకి వచ్చేసరికి రోడ్డుపై భారీ గోతులు ఉండడంతో వాటిలో పడిందని, పక్కకు తిప్పేందుకు ఆస్కారం లేకపోవడంతో ఢీ కొట్టినట్లు ప్రయాణికులు, స్థానికులు తెలిపారు. చేబ్రోలు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.