రావులపెంట (వేములపల్లి) :నాగార్జునసాగర్ ఎడమ ప్రధానకాల్వలో టాటాఏస్ (ట్రాలీఆటో) బోల్తాకొట్టడంతో మగ్గురు జలసమాధి అయ్యారు. మండలంలోని రావులపెంట గ్రామ శివారులో చోటు చేసుకున్న ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. మృతుల బంధువులు, పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పాములపహడ్ గ్రామానికి చెందిన చింతకాయల నాగయ్య (38), చింతకాయల లింగ య్య (35) ఇద్దరు వరుసకు సోదరులు. వీరు గొర్రెలు, మేకల కొనుగోలు, అమ్మకం వ్యా పారం నిర్వహిస్తుంటారు. శనివారం తెల్లవారుజామున నేరేడుచర్ల మండలం రాంపురం గ్రా మంలో కొనుగోలు చేసిన గొర్రెలను తీసుకొచ్చేందుకు పాములపహడ్ నుంచి ద్విచక్ర వాహనంపై రావులపెంటకు వచ్చారు. గ్రామం లో ట్రాలీఆటోను అద్దెకు మాట్లాడుకుని ద్విచక్రవాహనాన్ని అక్కడే పెట్టి డ్రైవర్ గోలి నాగరాజు(23)తో పాటు లింగయ్య, నాగయ్యలు ఆటోలో ఉదయం నాలుగున్నర గంటలకు బయలుదేరారు. గ్రామానికి కిలోమీటరు దూర ంలో ఉన్న నాగార్జునసాగర్ ఎడమకాల్వ వం తెన మలుపువద్దకు రాగానే కాలువ వంతెన వద్ద రక్షణ లేకపోవడంతో ఆటోకాల్వలో పడిపోయింది. తెల్లవారుజామున కావడంతో ప్రమాదం గురించి ఎవరికీ తెలియలేదు.
వెలుగులోకి ఇలా..
లింగయ్య, నాగయ్య ఫోన్లు శనివారం రాత్రి వరకు కూడా పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో ఆది వారం ఉదయం మృతుల కుటుంబ సభ్యు లు, బంధువులు సాగర్ ఎడమకాల్వకట్ట వెంట గాలింపు జరిపారు. ఈక్రమంలో ఆటోకు సంబంధించిన కొన్ని పరికరాలు బ్రిడ్జి వద్ద కాల్వకట్టపై కనిపించాయి. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపారు. సంఘటన స్థలానికి మిర్యాలగూడ రూరల్ సీఐ నర్సింహారెడ్డి, ఎస్‌ఐలు సర్ధార్‌నాయక్, సతీష్‌కుమార్‌లు చేరుకున్నారు. వారి పర్యవేక్షణలో కాల్వలో గాలించి ఆటోను గుర్తించారు. సుమారు 3 గంటల పాటు శ్రమించి తాళ్లసహాయంతో ట్రాలీ ఆటోను వెలికితీశారు.
మిన్నంటిన బంధువుల రోదనలు..
సాగర్ కాలువలో నుంచి మధ్యాహ్నం మూడు మృతదేహాలను వెలికి తీశారు. తమ వారు ఇక లేరు అని తెలియడంతో, కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కాలువలో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న రావులపెంటతో పాటు సమీప గ్రామాలైన పాములపహాడ్, కామేపల్లి గ్రామాల నుంచి వందలాది మంది ప్రజలు ఘటనస్థలికి తరలివచ్చారు.
ఎమ్మెల్యే పరామర్శ..
విషయం తెలుసుకుని సంఘటన స్థలం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే భాస్కర్‌రావు మృతుల బంధువులను పరామర్శించారు. ఆయనతో పాటు వివిధ పార్టీల నాయకులు కరుణాకర్‌రెడ్డి, అరుణమమ్మ, సైదులు, తమ్మడబోయిన అర్జున్, దొం తిరెడ్డి వెంకట్‌రెడ్డి, మోసిన్‌అలీ, శ్రీనివాస్, ఎలియాస్, ఇంద్రారెడ్డి మృ తుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.
క్యాబిన్‌లోనే మృతదేహాలు..
టాటాఏస్ కాల్వలో పడిన ఘటనలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరి మృతదేహాలు కూడా ఆటో క్యాబిన్‌లోనే ఉన్నాయి. ఉద యం చలితీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు కూడా అద్దాలు పెట్టుకుని డోర్‌లు లాక్ చేసుకున్నారు.కాలువలో పడిన తర్వాత బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. మృ తుడు నాగయ్యకు కుమారుడు,కూతురు, భార్య ఉన్నారు. లింగయ్యకు ఇద్దరు కూతు ళ్లు, కుమారుడు, భార్య, ఆటోడ్రైవర్ నాగరాజుకు వివాహం కాలేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ముగ్గురి జలసమాధి
Published Mon, Dec 29 2014 2:43 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
Advertisement