Ravulapenta
-
జిల్లాలో ముగ్గురు రైతుల ఆత్మహత్య
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ముగ్గురు రైతులు అప్పుల బాధలకు తాళలేక ఊసురు తీసుకున్నారు. వీరిలో ఒకరు కౌలు రైతు ఉన్నారు. వేసిన పంటలకు చేసిన అప్పులు తీర్చలేక.. గత సీజన్లో అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండడంతో ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రావులపెంట (వేములపల్లి) : మండల పరిధిలోని రావులపెంట గ్రామానికి చెందిన రైతు అప్పులబాధ తాళలేక తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మృతుడి భార్య భారతి తెలిపిన వివరాల ప్రకారం.. మూడేకరాల పొలంలో పత్తి పంట సాగు చేశామని, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. గత సీజన్లో రెండు లక్షల అప్పు ఉండగా ఈయేడు మరో లక్ష రూపాయలు అప్పుచేసి పంట సాగుచేశామన్నారు. ఈ పంట కూడా చేతికి వస్తుందో, రాదో అన్న ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ జాఫర్ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హాలియాలో.. హాలియా : కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మల్గిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన కొమెర శేఖర్(34) గురువారం సాయంత్రం తమ ఇంట్లో ఉరేసుకుని ఆ్మహత్యకు పాల్పడ్డాడు. భార్యను రాఖీ కోసం పంపించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు తనకున్న రెండు 2ఎకరాల వ్యవసాయభూమిలో గత నాలుగు సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాడు. వర్షాలు లేక బావిలో నీరు ఎండిపోయిందని, దీంతో చేసిన రూ.4లక్షలు తీర్చలేనని మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హాలియా ఎస్ఐ వెంకట్ తెలిపారు. కౌలు రైతు.. హాలియ : అనుముల గ్రామానికి చెందిన బూడిద స్వామిదాస్(38) అనే కౌలు రైతు అప్పుల బాధతో గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు గత రెండు సంవత్సరాలుగా 5 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వర్షాభావ పరిస్థితుల కారణంగా చేసిన రూ.3లక్షల అప్పు తీర్చలేనని మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు హాలియా ఎస్ఐ వెంకట్ తెలిపారు. అప్పుల బాధతో ఆటో డ్రైవర్... బొమ్మలరామారం: మండలంలోని కాండ్లకుంట తండాకు చెందిన‡లావుడ్యా శీను(30) గత కొంత కాలంగా హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఆటో నడిపిస్తు జీవనం సాగిస్తున్నాడు. తన సోదరి పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేనని మనస్థాపానికి గురైయ్యాడు. శుక్రవారం కాండ్లకుంట తండాలోని తన ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య,‡ ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. తండ్రి యాదా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైనీ ఎస్ఐ సురేష్ తెలిపారు.ll -
ముగ్గురి జలసమాధి
రావులపెంట (వేములపల్లి) :నాగార్జునసాగర్ ఎడమ ప్రధానకాల్వలో టాటాఏస్ (ట్రాలీఆటో) బోల్తాకొట్టడంతో మగ్గురు జలసమాధి అయ్యారు. మండలంలోని రావులపెంట గ్రామ శివారులో చోటు చేసుకున్న ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. మృతుల బంధువులు, పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పాములపహడ్ గ్రామానికి చెందిన చింతకాయల నాగయ్య (38), చింతకాయల లింగ య్య (35) ఇద్దరు వరుసకు సోదరులు. వీరు గొర్రెలు, మేకల కొనుగోలు, అమ్మకం వ్యా పారం నిర్వహిస్తుంటారు. శనివారం తెల్లవారుజామున నేరేడుచర్ల మండలం రాంపురం గ్రా మంలో కొనుగోలు చేసిన గొర్రెలను తీసుకొచ్చేందుకు పాములపహడ్ నుంచి ద్విచక్ర వాహనంపై రావులపెంటకు వచ్చారు. గ్రామం లో ట్రాలీఆటోను అద్దెకు మాట్లాడుకుని ద్విచక్రవాహనాన్ని అక్కడే పెట్టి డ్రైవర్ గోలి నాగరాజు(23)తో పాటు లింగయ్య, నాగయ్యలు ఆటోలో ఉదయం నాలుగున్నర గంటలకు బయలుదేరారు. గ్రామానికి కిలోమీటరు దూర ంలో ఉన్న నాగార్జునసాగర్ ఎడమకాల్వ వం తెన మలుపువద్దకు రాగానే కాలువ వంతెన వద్ద రక్షణ లేకపోవడంతో ఆటోకాల్వలో పడిపోయింది. తెల్లవారుజామున కావడంతో ప్రమాదం గురించి ఎవరికీ తెలియలేదు. వెలుగులోకి ఇలా.. లింగయ్య, నాగయ్య ఫోన్లు శనివారం రాత్రి వరకు కూడా పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో ఆది వారం ఉదయం మృతుల కుటుంబ సభ్యు లు, బంధువులు సాగర్ ఎడమకాల్వకట్ట వెంట గాలింపు జరిపారు. ఈక్రమంలో ఆటోకు సంబంధించిన కొన్ని పరికరాలు బ్రిడ్జి వద్ద కాల్వకట్టపై కనిపించాయి. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపారు. సంఘటన స్థలానికి మిర్యాలగూడ రూరల్ సీఐ నర్సింహారెడ్డి, ఎస్ఐలు సర్ధార్‌నాయక్, సతీష్‌కుమార్‌లు చేరుకున్నారు. వారి పర్యవేక్షణలో కాల్వలో గాలించి ఆటోను గుర్తించారు. సుమారు 3 గంటల పాటు శ్రమించి తాళ్లసహాయంతో ట్రాలీ ఆటోను వెలికితీశారు. మిన్నంటిన బంధువుల రోదనలు.. సాగర్ కాలువలో నుంచి మధ్యాహ్నం మూడు మృతదేహాలను వెలికి తీశారు. తమ వారు ఇక లేరు అని తెలియడంతో, కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కాలువలో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న రావులపెంటతో పాటు సమీప గ్రామాలైన పాములపహాడ్, కామేపల్లి గ్రామాల నుంచి వందలాది మంది ప్రజలు ఘటనస్థలికి తరలివచ్చారు. ఎమ్మెల్యే పరామర్శ.. విషయం తెలుసుకుని సంఘటన స్థలం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే భాస్కర్‌రావు మృతుల బంధువులను పరామర్శించారు. ఆయనతో పాటు వివిధ పార్టీల నాయకులు కరుణాకర్‌రెడ్డి, అరుణమమ్మ, సైదులు, తమ్మడబోయిన అర్జున్, దొం తిరెడ్డి వెంకట్‌రెడ్డి, మోసిన్‌అలీ, శ్రీనివాస్, ఎలియాస్, ఇంద్రారెడ్డి మృ తుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. క్యాబిన్‌లోనే మృతదేహాలు.. టాటాఏస్ కాల్వలో పడిన ఘటనలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరి మృతదేహాలు కూడా ఆటో క్యాబిన్‌లోనే ఉన్నాయి. ఉద యం చలితీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు కూడా అద్దాలు పెట్టుకుని డోర్లు లాక్ చేసుకున్నారు.కాలువలో పడిన తర్వాత బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. మృ తుడు నాగయ్యకు కుమారుడు,కూతురు, భార్య ఉన్నారు. లింగయ్యకు ఇద్దరు కూతు ళ్లు, కుమారుడు, భార్య, ఆటోడ్రైవర్ నాగరాజుకు వివాహం కాలేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి
రావులపెంట(వేములపల్లి), న్యూస్‌లైన్ :మండలంలోని రావులపెంటలో ఓ యువకుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. గ్రామస్తుల కథనం మేరకు.. రావులపెంటకు చెందిన తరి నాగయ్య(26) గ్రామ సమీపంలో గల శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో పూ జారిగా ఉంటున్నాడు. బుధవారం గుడిపై ఉన్న విగ్రహాలను శుభ్రం చేసేందుకు ఎక్కాడు. విగ్రహాలను శుభ్రం చేస్తుండగా గుడి మీదుగా వెళ్లిన 33 కేవీ విద్యుత్ తీగలు తగలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నా రు. నాగయ్య మృతదేహాన్ని ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సందర్శించి సంతాపం తెలిపారు. బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారిలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మాలి పురుషోత్తంరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, సర్పంచ్ శీలం సైదమ్మశ్రీనివాస్ తదితరులు ఉన్నారు. చౌటుప్పల్‌లో ఒడిషా వాసి... చౌటుప్పల్: మండలంలోని లింగోజిగూడెం శివారులోని సూ ర్యోదయ స్పిన్నింగ్ మిల్లులో ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృ తి చెందాడు. ఒడిషాలోని బలిమెర గ్రామానికి చెందిన అన్నదమ్ములు సంతోష్కుమార్నాయక్(26), బ్రహ్మానందనాయక్లు రెండేళ్ల కిత్రం ఉపాధి నిమిత్తం చౌటుప్పల్ పట్టణానికి వచ్చా రు. ఇక్కడ సూర్యోదయ స్పిన్నింగ్ మిల్లులో పని చేస్తూ కంపెనీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. క్వార్టర్స్ పైకప్పు సిమెంట్ రేకులు కావడంతో పగిలిపోయి వర్షానికి కురుస్తున్నాయి. సంతోష్కుమార్నాయక్ మరో కార్మికుడు వీరయ్యతో కలిసి రేకులకు ప్యాచ్ వర్క్ చేసేందుకు క్వార్టర్స్ పెకైక్కారు. సంతోష్‌కుమార్ ప్రమాదవశాత్తు క్వార్టర్స్ మీదుగా ఉన్న కరెంట్ తీగలకు తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రెయినేజీలో పడి బాలుడు... మిర్యాలగూడ క్రైం: ప్రమాదవశాత్తు ఓ బాలుడు డ్రెయినేజీలో పడి మృతి చెందిన సంఘటన పట్టణంలోని సుందర్‌నగర్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు.. పట్టణానికి చెందిన కొ మ్మినేని సైదులు సుందర్‌నగర్‌లోని శాంతినికేతన్ డిగ్రీ కళాశాలలో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి కళాశాలలోనే ఓ గదిలో నివాసం ఉంటున్నాడు. బుధవారం సైదులు తన కుమారుడు మోక్షిత్(3)ను తీసుకొని బజారుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి కుమారున్ని వదిలి పని ఉందని చె ప్పి మళ్లీ బయటకు వెళ్లాడు. తల్లి ఇంట్లో వంట చేస్తుండగా బాలుడు కళాశాల బయట ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అక్క డే ఉన్న డ్రెయినేజీలో పడిపోయాడు. కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఇంటి పరిసరాల్లో వెతికారు. అయినా ఆచూకీ తెలి యకపోవడంతో డ్రెయినేజీలో చూడగా ఓ చెట్టుకు చిక్కుకొని కనిపించాడు. వెంటనే బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆర్డీఓ, ఎమ్మెల్యే, కమిషనర్ల పరామర్శ బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే రంగారెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ క మిషనర్ సురేందర్‌లు పరామర్శించారు. బాలుని మృతికి గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పురుగు మందు తాగి... బీబిగూడెం(చివ్వెంల):మండలంలోని బీబిగూడెం ఆవాసం జామ్లాతండా చెంది న ధరావత్ శంకర్(40) ఇంట్లో గత మూడు రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రా త్రి కూడా భార్యాభర్తలు ఘర్షణ పడ్డారు. దీంతో శంకర్ మనస్థాపం చెంది పొలం కోసం తెచ్చిన పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న శంకర్‌ను కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు గమనించి చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం తీసుకెళ్లారు. అక్కడ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక... మర్రిగూడ: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ మహిళా సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని మేటిచందాపురంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుర్ర మంగమ్మ (36) ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్‌గా గెలుపొందింది. కుటుం బంలో ఆర్థిక సమస్యలు అధికం కావడంతో మానసికంగా కుంగిపోయి బుధవారం ఉదయం ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాలిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి జంగిటి జంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై దీవంతరావు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మంగమ్మ భర్త బుర్ర అంజయ్య సీపీఐ మండల కార్యదర్శిగా ఉన్నారు. మృతదేహాన్ని మునుగోడు ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, మాజీ ఎమ్మెల్యే పల్ల వెంకట్‌రెడ్డి తదితరులు సందర్శించి నివాళులర్పించారు.