జిల్లాలో ముగ్గురు రైతుల ఆత్మహత్య
జిల్లాలో ముగ్గురు రైతుల ఆత్మహత్య
Published Fri, Aug 19 2016 9:45 PM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ముగ్గురు రైతులు అప్పుల బాధలకు తాళలేక ఊసురు తీసుకున్నారు. వీరిలో ఒకరు కౌలు రైతు ఉన్నారు. వేసిన పంటలకు చేసిన అప్పులు తీర్చలేక.. గత సీజన్‌లో అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండడంతో ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
రావులపెంట (వేములపల్లి) : మండల పరిధిలోని రావులపెంట గ్రామానికి చెందిన రైతు అప్పులబాధ తాళలేక తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మృతుడి భార్య భారతి తెలిపిన వివరాల ప్రకారం.. మూడేకరాల పొలంలో పత్తి పంట సాగు చేశామని, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. గత సీజన్‌లో రెండు లక్షల అప్పు ఉండగా ఈయేడు మరో లక్ష రూపాయలు అప్పుచేసి పంట సాగుచేశామన్నారు. ఈ పంట కూడా చేతికి వస్తుందో, రాదో అన్న ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ జాఫర్ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
హాలియాలో..
హాలియా : కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మల్గిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన కొమెర శేఖర్(34) గురువారం సాయంత్రం తమ ఇంట్లో ఉరేసుకుని ఆ్మహత్యకు పాల్పడ్డాడు. భార్యను రాఖీ కోసం పంపించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు తనకున్న రెండు 2ఎకరాల వ్యవసాయభూమిలో గత నాలుగు సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాడు. వర్షాలు లేక బావిలో నీరు ఎండిపోయిందని, దీంతో చేసిన రూ.4లక్షలు తీర్చలేనని మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హాలియా ఎస్‌ఐ వెంకట్ తెలిపారు.
కౌలు రైతు..
హాలియ : అనుముల గ్రామానికి చెందిన బూడిద స్వామిదాస్(38) అనే కౌలు రైతు అప్పుల బాధతో గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు గత రెండు సంవత్సరాలుగా 5 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వర్షాభావ పరిస్థితుల కారణంగా చేసిన రూ.3లక్షల అప్పు తీర్చలేనని మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు హాలియా ఎస్‌ఐ వెంకట్ తెలిపారు.
అప్పుల బాధతో ఆటో డ్రైవర్...
బొమ్మలరామారం: మండలంలోని కాండ్లకుంట తండాకు చెందిన‡లావుడ్యా శీను(30) గత కొంత కాలంగా హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఆటో నడిపిస్తు జీవనం సాగిస్తున్నాడు. తన సోదరి పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేనని మనస్థాపానికి గురైయ్యాడు. శుక్రవారం కాండ్లకుంట తండాలోని తన ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య,‡ ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. తండ్రి యాదా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైనీ ఎస్‌ఐ సురేష్ తెలిపారు.ll
Advertisement