vemulapalli
-
వేములపల్లిలో వింత కల్లు..
-
ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణం
వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ వద్ద ఆదివారం జరిగిన ట్రాక్టర్ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ఆలూరి వెంకటనారాయణను బుధవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలను ఇంచార్జ్ డీసీపీ నాగరాజు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలానికి చెందిన ఆలూరి వెంకటేశ్వర్లు కుమారుడు వెంకటనారాయణ పదేళ్లుగా వలిగొండ మండలంలో భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే క్రమంలో వేములకొండ శివారులోని అక్కెనపల్లి నర్సయ్య భూమిని నాలుగేళ్ల కౌలుకు తీసుకున్నాడు. వర్షం కరువడంతో పత్తి విత్తనాలు నాటడానికి ఈ నెల 24వ తేదీన 33 మంది వ్యవసాయ కూలీలను తీసుకుని దూదిపాల్ల నాగేశ్వర్రావుకు చెందిన ట్రాక్టర్‌పై ఎక్కించుకుని తీసుకెళ్తున్నాడు. నిర్లక్ష్యంగా నడుపుతుండడంతో కొద్ది దూరం వెళ్లగానే ట్రాక్టర్ అదుపు తప్పింది. కంట్రోల్ చేయలేకపోవడంతో పక్కనే ఉన్న మూసీ కాల్వలోకి పల్టీ కొట్టింది. దీంతో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న 15 మంది మృతి చెందగా మరో 16 మంది క్షతగాత్రులయ్యారు. ఇద్దరు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌తోపాటు ట్రాక్టర్ యజమాని దూదిపాల నాగేశ్వర్‌పై 304(పార్ట్–2), ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు. వెంకట్నారాయణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్చార్జ్ డీసీసీ నాగరాజు తెలిపారు. విలేకరుల సమావేశంలో చౌటుప్పల్ ఏసీపీ రామోజు రమేష్, వలిగొండ ఎస్ఐ ఇద్రిస్‌అలీ ఉన్నారు. -
విషాద ప్రయాణం
వేములపల్లి (మిర్యాలగూడ) : ప్రైవేట్ ట్రావెల్ బస్సు పల్టీ కొట్టిన ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు దుర్మరణం చెందగా మరో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి శివారులోని నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన లక్ష్మీగాయత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (ఏపీ 04వై 7181)లో 28 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్‌తో సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా చీరాలకు బయలుదేరింది. తెల్లవారుజామున 3.30 గంటలకు బస్సు నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రం శివారు ప్రాంతానికి చేరుకునే సరికి డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న రక్షణ దిమ్మెలను ఢీకొట్టి రహదారి పక్కన ఉన్న వ్యవసాయ భూమిలోకి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన యలమల సుబ్బరావమ్మ(55), అదేజిల్లాకు చెందిన మార్టూరు మండలం బొబ్బాయిపల్లి గ్రామానికి చెందిన బిల్లి నాగేశ్వర్రావు(31) అక్కడికక్కడే మృతిచెందాడు. సుబ్బరావమ్మ హైదరాబాద్‌లోని తన అన్న ఇంటికి వెళ్లి తిరిగి తన స్వగ్రామానికి వెళ్తోంది. నాగేశ్వరరావు హైదరాబాద్‌లో తాపీ మేస్త్రీగా పనిచేస్తూ.. తన స్వగ్రామానికి వెళ్తున్నాడు. ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన దగ్గుపాటి శ్రీనివాసప్రసాద్, చంద్రవాణి దంపతులు, నర్సరావుపేటకు చెందిన రాగ విజయలక్ష్మీతో పాటు ఆమె కుమారుడు మనీష్‌కార్తీక్‌రెడ్డి, తల్లి గుంటా సుబ్బమ్మకు స్వల్పగాయాలయ్యాయి. ఏరియా ఆస్పత్రిలో బాధితులు.. బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎస్ఐ గుత్తా వెంకట్‌రెడ్డి, మాడ్గులపల్లి ఎస్ఐ విజయ్‌కుమార్, మిర్యాలగూడ టూటౌన్ ఎస్ఐ శేఖర్ పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన ఐదుగురిని 108లో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సుబ్బరావమ్మ, నాగేశ్వర్రావు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాస్, వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి సంఘటన స్థలానికి చేరుకని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రయాణికుడు శ్రీహర్షారెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్ఐ గుత్తా వెంకట్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్వగ్రామానికి వస్తూ మృత్యువాత మార్టూరు: మండలంలోని బబ్బేపల్లికి చెందిన బిల్లి నాగేశ్వరరావు (32) బేల్దారు పని చేస్తూ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో సోమవారం రాత్రి నాగేశ్వరరావు స్వగ్రామం బయలుదేరాడు. నల్లగొండ జిల్లాలో బస్సు బోల్తాపడిన ఘటనలో నాగేశ్వరరావు అక్కడికక్కడే మరణించాడు. శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం స్వగ్రామం బబ్బేపల్లి తరలించారు. నాగేశ్వరరావుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కారంచేడు: మండలంలోని స్వర్ణ గ్రామానికి గ్రామానికి చెందిన యలవల సుబ్బరావమ్మ (53) రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో నివాసముంటున్న తమ్ముడు వద్దకు తన తల్లిని వదిలి వచ్చేందుకు వెళ్లిందని కుటుంబసబ్యులు తెలిపారు. సోమవారం రాత్రి హైదరాబాద్ లో ప్రైవేటు ట్రావెల్స్ బస్ ఎక్కింది. నల్లగొండ జిల్లా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. సమాచారం అందుకున్న ఆమె భర్త సాంబయ్య హుటాహుటిన ప్రమాద స్థలానికి బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ నుంచి తమ్ముడు కూడా సంఘటనా స్థలానికి వచ్చాడు. మృతదేహాన్ని స్వర్ణకు తరలిస్తున్నారు. నిద్రమత్తులో ఉండగా పెద్ద శబ్దం వచ్చింది.. నేను హైదరాబాద్ నుంచి స్వగ్రామం చీరాలకు లక్ష్మీగాయత్రి ట్రావెల్స్ బస్సులో బయలుదేరాను. ప్రయాణికులందరూ నిద్రమత్తులో ఉన్నారు. తెల్లవారుజాము 3.30 గంటల సమయంలో ఒక్కసారిగా బస్సు పెద్ద శబ్దంతో రెండు పల్టీలు కొట్టింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడుతూ చెల్లాచెదురయ్యారు. బస్సు ముందు వరుసలో కూర్చున్న మహిళ బస్సులో ఇరుక్కుని మృతిచెందింది. వెనుక భాగంలో ఉన్న మరో ప్రయాణికుడు కూడా మృతిచెందాడు. మిగతావాళ్లం స్వల్పగాయాలతో బయటపడ్డాం. – వారి శ్రీహర్షారెడ్డి, బస్సు ప్రయాణికుడు, చీరాల -
రోడ్డు ప్రమాదంలో లైన్‌మన్ మృతి
వేమనపల్లి(బెల్లంపల్లి) : పొరుగున ఉన్న మహారాష్ట్రలోని సిరోంచ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నీల్వాయికి చెందిన లైన్‌మన్ వెమునూరి రమేశ్‌రెడ్డి(44) మృత్యువాతపడ్డాడు. చెన్నూర్‌లో ఉంటూ విద్యుత్‌శాఖలో లైన్మెన్గా మంచిర్యాల సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. ఆదివారం మహారాష్ట్రలోని రామాంజపురంలో శుభకార్యానికి భార్య శారదతో కలిసి వెళ్లాడు. విందు పూర్తయినా తర్వాత బైక్‌పై చెన్నూర్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు. సిరోంచ పెట్రోల్‌బంక్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. అతని భార్యకు తీవ్రగాయాలు కాగా అపస్మారక స్థితిలోకి వెళ్లింది. హుటాహుటిన హన్మకొండ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాయక్క, లచ్చిరెడ్డి, తమ్ముడు మహేశ్ కుటుంబ సభ్యులు, మిత్రులు సిరోంచకు వెళ్లారు. సిరోంచ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహానికి సిరోంచ ప్రాంతీయ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. మృతుడికి కుమారుడు లడ్డు, కూతురు ఉన్నారు. రమేశ్‌రెడ్డి మృతితో నీల్వాయిలో విషాదఛాయలు అలుముకున్నాయి. రమేశ్‌రెడ్డి(ఫైల్), రమేశ్‌రెడ్డి మృతదేహం -
ఇద్దరి మహిళల ఆత్మహత్యాయత్నం
శెట్టిపాలెం (వేములపల్లి) : వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళలు ఆత్మహత్యకు యత్నించారు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి విజయగిరి వరమ్మ (30) కూతురు స్వప్నతో ఘర్షణ పడి మనస్తాపానికి గురైంది. ఎవరూ చూడని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు. భర్త తాగుడు భరించలేక.. చౌదర్పల్లి(బొమ్మలరామారం) : మండలంలోని చౌదర్పల్లి గ్రామానికి చెందిన నాముండ్ల నర్సింహకు కీసర మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నవీనతో ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.కొంత కాలం సజావుగా సాగిన వీరి కాపురంలో మద్యం మహమ్మారి చిచ్చు పెట్టింది.మూడేళ్లుగా భర్త నర్సింహ మద్యానికి బానిసై భార్య నవీనను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో నవీన భర్త తాగుడు భరించలేక మనస్తాపానికి గురై శుక్రవారం ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇరుగు పొరుగు వారు గమనించి చికిత్స నిమిత్త గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి తండ్రి నర్సింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. -
మత్స్యకారుల అభివృద్ధికి ప్రణాళికలు
వేములపల్లి : మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందించిందని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు తెలిపారు. బుధవారం వేములపల్లి చిన్నచెరువు, పెద్ద చెరువులో చేప పిల్లలను విడిచిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. దళారులు, కాంట్రాక్టర్ల ఆదిపత్యం వల్ల సొసైటీ సభ్యులు ఆర్థికంగా ఎదగలేకపోతున్నారనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచితంగా చేప పిల్లలను సరఫరా చేయాలని నిర్ణయించారని పేర్కొన్నారు. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 485 చెరువులను ఎంపిక చేసి 5కోట్ల 85 లక్షల చేప పిల్లలను సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. ఆయా చెరువుల్లో వదలడానికి చేప పిల్లలను సంబంధిత సొసైటీ సభ్యులకు అందజేస్తున్నట్లు తెలిపారు. మత్స్యకార సొసైటీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నామిరెడ్డి రవీణా కరుణాకర్ రెడ్డి, జెడ్పీటీసీ ఇరుగుదిండ్ల పద్మ, రావుయల్లారెడ్డి, సర్పంచ్ జడరాములు యాదవ్, ఎంపీటీసీ పుట్టల సత్యవతి భాస్కర్, సొసైటీ అధ్యక్షుడు పందిరి శ్రీనివాస్, మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాధా రోహిణి, ఎఫ్డీఓ అంజయ్య, నాయకులు చిర్రమల్లయ్య యాదవ్, పాలుట్ల బాబయ్య, పందిరి ప్రతాప్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టుల కోసమే పార్టీ మారారు
వేములపల్లి : అధికార పార్టీ నేతల ప్రలోభాలకు లొంగిన కొందరు నాయకులు కాంట్రాక్టుల కోసమే పార్టీ మారి కన్నతల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచారని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. నాయకులు పార్టీ వీడినంత మాత్రాన కార్యకర్తలు అధైర్యపడవద్దన్నారు. కాంగ్రెస్‌పార్టీకి కార్యకర్తలే నైతిక బలమని, 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టడం తథ్యమన్నారు. వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 20వేల చొప్పున నష్టపరిహారాన్ని అందించాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నార్కట్‌పల్లి జెడ్పీటీసీ సత్తయ్య యాదవ్, డీసీసీ ఉపాధ్యక్షుడు పందిరి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం వేణుగోపాల్ రెడ్డి, గుమ్మల మోహన్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దామిడి గోపాల్‌రెడ్డి, పుట్టల శ్రీనివాస్, కల్లు శ్రీను, ఇరుగు వెంకటయ్య, ఎండీ.ఆరీఫ్, సత్తయ్యగౌడ్, బొంగర్ల గిరి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గ్నొరు. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
అన్నపురెడ్డిగూడెం (వేములపల్లి) గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని అన్నపురెడ్డి గూడెం క్రాస్ రోడ్డు వద్ద శనివారం చోటు చేసుకుంది. వేములపల్లి ఎస్సై విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అనుముల మండలం రంగూండ్ల గ్రామానికి చెందిన ధరావత్ రమేష్ (28) లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు వస్తూ శెట్టిపాలెం క్రాస్ రోడ్డు వద్ద ఉన్న పెట్రోల్ బంక్‌లో డీజిల్ పోయించుకున్నాడు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో తలకు తీవ్ర గాయాలడంతో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కార్పొరేట్లకు మద్దతిస్తున్న బీజేపీ
వేములపల్లి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతతత్వ, కార్పొరేట్ శక్తులకు ఊతమిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి అన్నారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. లౌకిక, ప్రజాస్వామ్య దేశంలో మతతత్త్వ శక్తులను ప్రేరేపిస్తూ మనుధర్మ శాస్త్రం ప్రకారం పాలన కొనసాగించాలనే ఆర్ఎస్ఎస్ లక్ష్యానికి అనుగుణంగానే మోదీ ముందుకు సాగుతున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు రూ.80లక్షల కోట్లు అప్పులు తీసుకున్న కార్పొరేట్ శక్తులకు రుణమాఫీ చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని.. సామాన్య ప్రజానీకాన్ని పట్టించుకోవడం లేదని∙పేర్కొన్నారు. బీజేపీ సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 17న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించే సాయుధ పోరాట యోధుల విజయోత్సవ సభను విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి జిల్లా యాదగిరి, వి.లెనిన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎల్–14 ఎత్తిపోతలకు గండి
వేములపల్లి : మండల కేంద్రంలోని ఎడమకాల్వపై ఉన్న ఎల్–14 ఎత్తిపోతలకు కొందరు గండికొట్టి స్థానిక చిన్నచెరువుకు అక్రమంగా నీటి తరలించారు. దీంతో ఆగ్రహించిన లిఫ్టు పరిధిలోని రైతులు శనివారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఇప్పటికే వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని, వచ్చే కొద్దిపాటి నీటిని కూడా కొందరు వ్యక్తులు లిఫ్టుకు గండికొట్టి తరలించకపోవడం బాధాకరమన్నారు. ఈ విషయాన్ని ఎన్ఎస్పీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. లిఫ్టు పరిధిలో సుమారు 2వేలపై చిలుకు ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నట్లు తెలిపారు. చెరువులోకి నీటిని తరలించేందుకు ఫీడర్ ఛానల్ ఉన్నప్పటికీ ఎత్తిపోతల ప్రహరీ పగులగొట్టి నీటిని తరలించడం సరికాదన్నారు. అధికారులు స్పందించి గండిని పూడ్చడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గున్రెడ్డి గోపాల్‌రెడ్డి, శ్యాంసుందర్, అనిల్, అనంతరెడ్డి, లక్ష్మయ్య, యాకూబ్‌తో పాటు పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
జిల్లాలో ముగ్గురు రైతుల ఆత్మహత్య
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ముగ్గురు రైతులు అప్పుల బాధలకు తాళలేక ఊసురు తీసుకున్నారు. వీరిలో ఒకరు కౌలు రైతు ఉన్నారు. వేసిన పంటలకు చేసిన అప్పులు తీర్చలేక.. గత సీజన్లో అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండడంతో ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రావులపెంట (వేములపల్లి) : మండల పరిధిలోని రావులపెంట గ్రామానికి చెందిన రైతు అప్పులబాధ తాళలేక తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మృతుడి భార్య భారతి తెలిపిన వివరాల ప్రకారం.. మూడేకరాల పొలంలో పత్తి పంట సాగు చేశామని, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. గత సీజన్లో రెండు లక్షల అప్పు ఉండగా ఈయేడు మరో లక్ష రూపాయలు అప్పుచేసి పంట సాగుచేశామన్నారు. ఈ పంట కూడా చేతికి వస్తుందో, రాదో అన్న ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ జాఫర్ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హాలియాలో.. హాలియా : కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మల్గిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన కొమెర శేఖర్(34) గురువారం సాయంత్రం తమ ఇంట్లో ఉరేసుకుని ఆ్మహత్యకు పాల్పడ్డాడు. భార్యను రాఖీ కోసం పంపించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు తనకున్న రెండు 2ఎకరాల వ్యవసాయభూమిలో గత నాలుగు సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాడు. వర్షాలు లేక బావిలో నీరు ఎండిపోయిందని, దీంతో చేసిన రూ.4లక్షలు తీర్చలేనని మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హాలియా ఎస్ఐ వెంకట్ తెలిపారు. కౌలు రైతు.. హాలియ : అనుముల గ్రామానికి చెందిన బూడిద స్వామిదాస్(38) అనే కౌలు రైతు అప్పుల బాధతో గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు గత రెండు సంవత్సరాలుగా 5 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వర్షాభావ పరిస్థితుల కారణంగా చేసిన రూ.3లక్షల అప్పు తీర్చలేనని మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు హాలియా ఎస్ఐ వెంకట్ తెలిపారు. అప్పుల బాధతో ఆటో డ్రైవర్... బొమ్మలరామారం: మండలంలోని కాండ్లకుంట తండాకు చెందిన‡లావుడ్యా శీను(30) గత కొంత కాలంగా హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఆటో నడిపిస్తు జీవనం సాగిస్తున్నాడు. తన సోదరి పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేనని మనస్థాపానికి గురైయ్యాడు. శుక్రవారం కాండ్లకుంట తండాలోని తన ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య,‡ ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. తండ్రి యాదా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైనీ ఎస్ఐ సురేష్ తెలిపారు.ll -
లారీ, హార్వెస్టర్ ఢీ.. ఒకరు మృతి
శెట్టిపాలెం (వేములపల్లి) : లారీ, హార్వెస్టర్ ఢీకొన్న సంఘటన మండల పరిధిలోని శెట్టిపాలెం గ్రామ సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడు నుంచి ఖమ్మం వెళ్తున్న హార్వెస్టర్ శెట్టిపాలెం మూలమలుపులో హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న లారీ ఢీకొంది. దీంతో హార్వెస్టర్ డ్రైవర్ సెల్వకుమార్ కిందపడి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్ సన్‌రైజ్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. అదే హార్వెస్టర్‌లో ఉన్న అనిల్, మర్రికంటి మైకెల్, ధర్మదురాయ్లు స్వల్పగాయాలతో బయటపడ్డారని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ జాఫర్ తెలిపారు. -
చిన్న వయసులో పెద్ద కష్టం
తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులు తల్లిదండ్రుల ఆలనాపాలనలో పెరగాల్సిన ఆ చిన్నారులు అనాథలయ్యారు. అందరిలా ఆడిపాడాల్సిన వయస్సులో అమ్మానాన్నను కోల్పోయి ఒంటరిగా మిగిలారు. నాలుగేళ్ల క్రితం తండ్రి, రెండు రోజుల క్రితం తల్లి మరణించడంతో వారు దిక్కులేని వారయ్యారు. నా అనేవారు లేని ఆ పసివాళ్ల దీనగాథ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. మొల్కపట్నం (వేములపల్లి) : మండలంలోని మొల్కపట్నం గ్రామానికి చెందిన బొమ్మగాని సైదులు, సైదమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కాగా పెద్దకుమార్తె శిరీష రావులపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి, చిన్నకుమార్తె శ్రావణి మొల్కపట్నంలోని ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నారు. గత నాలుగు సంవత్సరాల క్రితం పిల్లల తండ్రి సైదులు అనారోగ్యంతో మృతి చెందాడు. నాటి నుంచి తల్లి సైదమ్మ కూలినాలికెళ్తూ పిల్లల బరువు బాధ్యతలను చూసుకుంటూ వారిని చదివిస్తోంది. ఏం జరిగిందంటే... సైదమ్మ రోజు మాదిరిగానే మంగళవారం కూలీ పనులకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి తిరిగివచ్చిన అనంతరం రాత్రి ఇద్దరు పిల్లతో కలిసి భోజనం చేసింది. అనంతరం నిద్రకు ఉపక్రమించారు. పాఠశాలకు సమయం కావడంతో పిల్లలు తల్లిని లేపగా ఉలుపలుకు లేదు. ఆందోళనకు గురైన పిల్లలు వెంటనే బయటకు పరిగెత్తి కన్నీతి పర్యంతమవుతుండగా చుట్టుపక్కల వారు వచ్చి చూశారు. అప్పటికే సైదమ్మ మృతి చెందింది. తల్లి మృతదేహం వద్ద చిన్నారులు రోదిస్తున్న తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. అసలే పేదరికం.. ఆపై పసిప్రాయంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన శిరీష, శ్రావణిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఇస్త్రీ చేస్తుండగా కరెంట్ షాక్
వేములపల్లి (నల్లగొండ) : బట్టలు ఇస్త్రీ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన గణేష్(37) ఊరికి వెళ్లడానికి బట్టలు ఇస్త్రీ చేసుకుంటుండగా.. ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వేములపల్లిలో మూడేళ్ల బాలిక హత్య
కృష్ణా (కంచికచర్ల) : కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లిలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. వేములపల్లి గ్రామానికి చెందిన ఉప్పెల్లి నాగేశ్వరరావు మూడవ కుమార్తె కోటేశ్వరి(3)ని.. గ్రామ పరిసర పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. సంఘటనాస్థలంలో మద్యం సీసాలు కనుగొన్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
విద్యార్థులకు సంకెళ్లు:మదర్సా నిర్వాహకుల నిర్వాకం!
నల్గొండ: చిన్నారులకు స్వేచ్ఛ కరువైపోయింది. వారి జీవితాలతో ఇటు తల్లిదండ్రులు, అటు ఉపాధ్యాయులు ఆడుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా వారిని వేధిస్తున్నారు. వారి స్వేచ్ఛని హరిస్తున్నారు. వారు ఏం కోరుకుంటున్నారో ఆలోచించడంలేదు. వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించడంలేదు. చదువు పేరుతో వారిని నానా హింసలకు గురి చేస్తున్నారు. వారిపట్ల కొందరు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో వేములపల్లి గ్రామంలో మదర్సా నిర్వాహకులు విద్యార్థులకు ఏకంగా సంకెల్లువేసి బంధించారు. ముగ్గురు విద్యార్థుల కాళ్లను ఇనుప గొలుసులతో కట్టివేసి, తాళాలు వేసి బంధించారు. ఈ బాధ భరించలేక విద్యార్థులు ఇమ్రాన్, జమాల్, ఇంఫాల్ ముగ్గురూ మదర్సా నుంచి శనివారం రాత్రి పారిపోయారు. మిర్యాలగూడెం సమీపంలో ఒక పొలంలో ఉన్న రేకుల షెడ్డులో తలదాచుకున్నారు. తెల్లవారుజామున పొలానికి వెళ్లిన రైతు వారిని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే అక్కడకు వెళ్లి, వారిని తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. చివరకు ఆ తల్లిదండ్రలు చెప్పింది ఏమిటంటే, తమ పిల్లు పారిపోకుండా తామే నిర్బంధించమన్నట్లు తెలిపారు. ** -
ఇసుక అక్రమ వ్యాపారంపై కొరడా
వేములపల్లి, న్యూస్‌లైన్: ఇసుక అక్రమ వ్యాపారంపై రెవెన్యూ అధికారులు కొరడా ఝలిపించారు. అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన ఏడు ఇసుక డంపులను సీజ్ చేశారు. ‘డంప్‌లు.. డబ్బులు’ శీర్షికన ఆది వారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. వేములపల్లి మండలంలోని పాలేరువాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలించేందుకు సిద్ధం చేసిన ఏడు ఇసుక డంపులను తహసీల్దార్ షేక్ అహ్మద్ ఆధ్వర్యంలో ఆదివారం సీజ్ చేశారు. మండలంలోని సల్కునూరు, బొమ్మకల్, రావులపెంట గ్రామాలలో అధికారులు పర్యటించారు. సల్కునూరులో ఆరుచోట్ల, రావుల పెంట పరిధిలో ఒక ఇసుకడంప్ను సీజ్ చేశారు. రెండు గ్రామాలలో సుమారు 60 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. సల్కునూరు పరిధిలో 40ట్రాక్టర్లు, రావులపెంట పరిధిలో 20ట్రాక్టర్ల ఇసుక చుట్టూ ముగ్గు పోసి సీజ్ చేశారు. లారీలను పట్టించిన గ్రామస్తులు మండలంలోని సల్కునూరు, కామేపల్లి, రావులపెంట గ్రామాల నుంచి హైదరాబాద్‌కు ఇసుక అక్రమంగా తరలిస్తున్న 13లారీలను మండలంలోని కుక్కడం గ్రామస్తులు ఆది వారం తెల్లవారుజామున అడ్డుకున్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు స్థానిక పోలీసులకు సమాచారం అందించినా పట్టించుకోలేదు. దీంతో గ్రామస్తులు మిర్యాలగూడ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఆదేశాల మేరకు ఉదయం 8గంటలకు అక్కడికి చేరుకున్న పోలీసులకు గ్రామస్తులు 13లారీలను అప్పగించారు. కాగా పోలీసులు మాత్రం అందులో ఏడు లారీలకు వే బిల్లులు ఉన్నాయని వదిలేశారు. మండలంలోని పాలేరువాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నప్పటికీ దామరచర్ల మండలం వాడపల్లి నుంచి వే బిల్లులను తెచ్చి లారీలను తీసుకెళ్లినట్లు సమాచారం. లారీలను పట్టుకొని పోలీసులకు అప్పగించినా ప్రయోజనం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా ఆరు లారీలపై కేసు నమోదు చేసి తహసీల్దార్ షేక్ అహ్మద్‌కు అప్పగిస్తున్నట్లు ఎస్ఐ యాదగిరి తెలిపారు. -
ప్రాథమిక పాఠశాలల్లో గ్రంథాలయాలు
వేములపల్లి, న్యూస్‌లైన్: ప్రాథమిక పాఠశాలల్లో గ్రంథాల యాలను ఏర్పాటుచేయాలని ప్రాథమిక విద్యాశాఖ నిర్ణయించింది. గ్రంథాల య సంస్థ, ప్రాథమిక విద్యాశాఖ సంయుక్తంగా ఏర్పాట్లకు సిద్ధపడింది. ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో మేధాశక్తి, పుస్తక పఠనం, దేశభక్తి పెంపొందించేందు కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బాలల ది నోత్సవం సందర్భంగా గురువారం నుంచి ప్రాథమిక పాఠశాలల్లో గ్రంథాలయాలను ప్రారంభించనున్నా రు. ప్రాథమిక విద్యాశాఖ ఆదేశాల ప్రకారం 200 మంది విద్యార్థులున్న ప్రతి ప్రాథమిక పాఠశాలను గ్రం థాలయం ఏర్పాటుకు ఎంపిక చేయాల్సి ఉంది. అలా విద్యార్థులు లేకుంటే జిల్లాకు 50 ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేయా ల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో మొదటి విడతగా 23 పాఠశాలలను ఎంపిక చేశా రు. మిగిలిన పాఠశాలలను దశల వారీగా ఎంపిక చేయనున్నారు. గ్రంథాలయాల్లో పిల్లలకు ఉపయోగపడే దేశభక్తి, మహానీ యుల చరిత్ర, వ్యక్తిత్వ వికాసం, చరిత్ర, బాలల సాహిత్యం, నీతి కథలు, సంప్రదాయాలు, సంస్కృతికి సంబంధించిన పుస్తకాలతోపాటు ప్రముఖ దినపత్రికలను ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక పిరియడ్ విద్యార్థుల్లో మేధాశక్తిని పెంచేందుకు గ్రంథాలయాల్లో పుస్తక పఠనానికి ప్రత్యేక పిరియడ్‌ను కేటాయిస్తారు. ఈ పిరియడ్‌కు ప్రత్యేక ఉపాధ్యాయుడిని నియమిస్తారు. గ్రంథాలయ ఉపాధ్యాయుడు సమీప గ్రంథాలయం నుంచి 15 రోజులకొకసారి 100 నుంచి 200 రకాల పుస్తకాలను తీసుకొచ్చి విద్యార్థులతో చదివించాల్సి ఉంటుంది. జిల్లాలో ఎంపికైన పాఠశాలలు జిల్లాలో మొదటి విడతగా 23 ప్రాథమిక పాఠశాలలను గ్రంథాలయాల ఏర్పాటుకు ఎంపిక చేశారు. అనుముల మండలం అనుముల, చందంపేట మండలం పెద్దమునిగల్, కంబాలపల్లి, చండూరు మండలం బోడంగిపర్తి, చివ్వెంల మండలం కుడకుడ, చందుపట్ల, దేవరకొండ మండలం తాటికోలు, డిండి మండలం తవక్లాపూర్, అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడెం, తిమ్మాపురం, కట్టంగూర్ మండలం చెర్వుఅన్నా రం, మర్రిగూడ మండలం శివన్నగూడెం, మఠంపల్లి మండలం వరదాపురం, పెదవీడు, మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి, ఆలగడప, పీఏపల్లి మండలం వడ్డిపట్ల, పెద్దవూర మండలం పులిచర్ల, రామన్నపేట మండలం వెల్లంకి, సూర్యాపేట మండలం బాలెంల, టేకుమట్ల, త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి, తుంగతుర్తి మండలం గొట్టిపల్లి ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశారు.