ఇద్దరి మహిళల ఆత్మహత్యాయత్నం
Published Sun, Nov 27 2016 3:10 AM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM
శెట్టిపాలెం (వేములపల్లి) : వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళలు ఆత్మహత్యకు యత్నించారు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి విజయగిరి వరమ్మ (30) కూతురు స్వప్నతో ఘర్షణ పడి మనస్తాపానికి గురైంది. ఎవరూ చూడని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్‌సై విజయ్‌కుమార్ తెలిపారు.
భర్త తాగుడు భరించలేక..
చౌదర్‌పల్లి(బొమ్మలరామారం) : మండలంలోని చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన నాముండ్ల నర్సింహకు కీసర మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నవీనతో ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.కొంత కాలం సజావుగా సాగిన వీరి కాపురంలో మద్యం మహమ్మారి చిచ్చు పెట్టింది.మూడేళ్లుగా భర్త నర్సింహ మద్యానికి బానిసై భార్య నవీనను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో నవీన భర్త తాగుడు భరించలేక మనస్తాపానికి గురై శుక్రవారం ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇరుగు పొరుగు వారు గమనించి చికిత్స నిమిత్త గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి తండ్రి నర్సింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు.
Advertisement
Advertisement