two women
-
అల లండను పురములో.. పుట్టగానే తారుమారు.. ఐదు దశాబ్దాల తర్వాత వెలుగులోకి!
సగం జీవితం అయిపోయాక.. పెరిగిన ఇల్లే గాక పెంచిన తల్లిదండ్రులు.. తోబుట్టువులు.. ఎవరూ తనవారు కారని తెలిస్తే? ఇప్పటిదాకా ఏర్పరుచుకున్న బంధాలన్నీ అబద్ధమేనని అర్థమైతే? ఊహించడానికే కష్టంగా ఉంది కదూ! లండన్‌లో ఇద్దరు మహిళలకు అచ్చం ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎందుకంటే వారిద్దరూ పసికందులుగా ఉన్నప్పుడే తారుమారయ్యారు. అల వైకుంఠపురం సినిమాను తలపించే ఈ ఉదంతం లండన్‌లో టాకాఫ్ ద టౌన్‌గా మారిందిప్పుడు. డీఎన్ఏ కిట్‌తో... 2021 క్రిస్మస్. లండన్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్‌కు చెందిన టోనీకి మిత్రులు డీఎన్ఏ హోమ్ టెస్టింగ్ కిట్ కానుకగా ఇచ్చారు. దాంతో పనేముంది లెమ్మని పక్కకు పడేశాడు. రెండు నెలల తర్వాత ఫిబ్రవరిలో కిట్ కంటపడింది. సెలవు రోజు కావడంతో టైం పాస్ కోసం తన శాంపిల్‌ను డీఎన్ఏ టెస్ట్‌కు పంపాడు. తర్వాతి ఆదివారం సాయంత్రం తల్లి జోన్‌తో ఫోన్లో మాట్లాడుతుండగా రిజల్ట్ మెయిల్ వచి్చంది. తన తల్లి కుటుంబం ఐర్లాండ్‌లో ఎక్కడి నుంచి వచి్చందో దాని ఆధాంరగా గుర్తించగలిగాడు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ తన చెల్లెలి పేరు చూసి షాకయ్యాడు. తన చెల్లెలు జెస్సికాకు బదులు క్లెయిర్ అనే పేరును సోదరిగా పేర్కొన్నారు. తామిద్దరి డీఎన్ఏలు పూర్తిగా సరిపోలడమే అందుకు కారణం. జెస్సికా తమకు ముగ్గురు అన్నదమ్ముళ్ల తర్వాత పుట్టిన ఏకైక అమ్మాయి. అలాంటిది తను అసలైన చెల్లె కాదని డీఎన్ఏ టెస్టు పేర్కొనడం టోనీని కలవరపరిచింది. ఏమైనా 80 ఏళ్ల తల్లికి ఈ విషయం చెప్పి ఆందోళనకు గురి చేయొద్దనుకున్నాడు. మర్నాడే క్లెయిర్‌ను సంప్రదించాడు. డీఎన్ఏ పరీక్ష రిజల్టు గురించి వివరించాడు. ‘‘అది పొరపాటని అనుకుంటున్నా. నువ్వేమైనా తెలుసుకోగలవా?’ అంటూ మెసేజ్ చేశాడు. దాంతో తను కూడా షాకైంది. ఎందుకంటే క్లెయిర్‌కు రెండేళ్ల క్రితమే ఆమె కొడుకు డీఎన్ఏ కిట్‌ను బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చాడు. పరీక్ష చేయించుకుంటే తల్లిదండ్రులతో తన డీఎన్ఏ అస్సలు పోలలేదు. ఈ వివరాలన్నీ టోనీతో పంచుకుందామె. ఆ క్రమంలో, జెస్సికా పుట్టిన ఆస్పత్రిలోనే క్లెయిర్ కూడా పుట్టిందని తేలింది. ఏం జరిగిందంటే... జోన్ 1967లో నాలుగో కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచి్చంది. నవజాత శిశువును ఆమె కాసేపు ముద్దులాడాక సిబ్బంది పిల్లల గదిలోకి తీసుకెళ్లారు. అర్థరాత్రి దాటాక మరో మహిళకు పుట్టిన పాపను కూడా పిల్లల వార్డుకు తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరూ తారుమారయ్యారు. జోన్‌కు పుట్టిన క్లెయిర్ మరో మహిళ పొత్తిళ్లలోకి, ఆమెకు పుట్టిన జెస్సికా జోన్ చెంతకు చేరారు. పాపాయి జుత్తు రంగు నల్లగా ఉండటంతో అనుమానించినా, ముగ్గురు కొడుకుల తరువాత పుట్టిన కూతురు కావడంతో ఆ సంతోషంలో పెద్దగా పట్టించుకోలేదు. ఇద్దరూ నా కూతుళ్లే ఆస్పత్రిలో తనకు తెలిసిన ఈ నిజాలను క్లెయిర్‌తో పంచుకున్నాడు టోనీ. ఆమె మర్నాడే వెళ్లి తన అసలు తల్లి జోన్‌ను, కుటుంబాన్ని కలిసింది. క్లెయిర్ రోజూ ఆ ప్రాంతం మీదుగానే ఆఫీసుకు వెళ్తుంటుంది. ఇన్నేళ్లుగా తన అసలు తల్లి అదే రూట్లో తనకు తెలియకుండా ఉంటోందని తెలుసుకుని భావోద్వేగానికి గురైంది. తన క్లెయిర్ భర్తకు, పిల్లలకు విషయం చెప్పింది. క్లెయిర్, జెస్సికా ఇద్దరూ తన కూతుళ్లేనని జోన్ చెప్పుకొచి్చంది. జెస్సికా అసలు ఏడాది ముందే మరణించింది. న్యాయపరమైన చిక్కులు.. తారుమారు కారణంగా క్లెయిర్, జెస్సికా పుట్టిన రోజులు మారిపోయాయి. దాంతో బర్త్ సరి్టఫికెట్ మొదలుకుని పాస్‌పోర్ట్ దాకా అన్నీ మార్చాల్సిన అవసరం వచి్చంది. ఈ నిర్వాకంపై జాతీయ ఆరోగ్య ట్రస్టు (ఎన్హెచ్ఎస్)కు టోనీ ఘాటుగా లేఖ రాశాడు. తప్పు ఒప్పుకున్న ట్రస్టు, వారిద్దరికీ పరిహారం ఇస్తామని ప్రకటించింది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసిన పోలీసులు.. ఛేజ్ చేసి పట్టుకున్న అమ్మాయిలు
-
ఏవండీ.. ఆవిడొచ్చింది! అంటే చెల్లుతుందా?
సినిమా వేరు.. నిజ జీవితం వేరు. సినిమాల్లో మాదిరి చేద్దామనుకుంటే చట్టాలు తొక్కిపడేస్తాయి. కాదని ముందుకు వెళ్తే.. కఠిన చర్యలకు, శిక్షలకు దారి తీస్తాయి. అలా చట్టాన్ని పట్టించుకోకుండా ముందుకు అడుగేసిన ఇద్దరు భార్యల ముద్దుల మొగుడి వాస్తవ గాథే ఇది. ఈవీవీ డైరెక్షన్లో వచ్చిన ఏవండి.. ఆవిడవచ్చింది చిత్రం గుర్తుందా? అందులో ఇద్దరు పెళ్లాల ముద్దుల భర్తగా సోగ్గాడు శోభన్‌బాబు, భార్యలుగా వాణిశ్రీ, శారదలు ప్రేక్షకులను అలరించారు. వారంలో చెరో మూడు రోజులు భార్యల దగ్గర.. మరో రోజు ప్రశాంతంగా తల్లిదండ్రుల దగ్గర గడిపే వెసులుబాటు ఉంటుంది ఆ సినిమాలో హీరోకి. కానీ, రియల్ లైఫ్‌లో అలా చేస్తామంటే కుదురుతుందా? అలాంటి పరస్పర ఒప్పందాలు చట్టప్రకారం చెల్లుతాయా? గురుగ్రామ్‌కు చెందిన ఓ ఇంజినీర్.. 2018లో గ్వాలియర్‌కు చెందిన ఓ మహిళను పెళ్లాడాడు. రెండేళ్లు కాపురం చేశారు వాళ్లు. అయితే.. కరోనా టైంలో(2020లో) వైరస్ భయానికి ఆమెను పుట్టింటికి పంపాడు. అయితే వైరస్ ఉధృతి తగ్గాక మళ్లీ ఈమెను తీసుకెళ్లేందుకు పోనేపోలేదు ఆ వ్యక్తి. రెండేళ్లపాటు రకరకాల సాకులు చెబుతున్న భర్త తీరుపై ఆమెకు అనుమానం కలిగింది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉన్నపళంగా ఒక్కతే గురుగ్రామ్‌కు వెళ్లింది. అలా వెళ్లిన ఆమెకు పెద్ద షాకే తగిలింది. కరోనా టైంలోనే ఆఫీస్‌లో ఓ కొలీగ్ అమ్మాయిని ప్రేమించి-పెళ్లి చేసుకోవడమే కాదు.. ఏకంగా ఆ టైంలో ఆమె ద్వారా ఓ బిడ్డను కూడా కనేశాడు ఆ ప్రబుద్దుడు. దీంతో ఆమె ఆఫీస్ వద్దే నిరసనకు దిగింది. ఆపై తనకు న్యాయం కావాలంటూ గ్వాలియర్‌లోని ఫ్యామిలీ కోర్టుకు ఆశ్రయించింది. దీంతో సమన్లు జారీ చేసిన ఫ్యామిలీ కోర్టు.. అతనికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు యత్నించింది. అయినా కూడా రెండో భార్యను విడిచిపెట్టేందుకు అతను ససేమీరా అన్నాడు. దీంతో.. ఈసారి ఆ ఇద్దరు భార్యలను కూర్చోపెట్టి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ, వాళ్లు కూడా పరిస్థితిని అర్థం చేసుకోలేదు. చివరికి.. ఆ ముగ్గురు ఓ అండర్‌స్టాండింగ్‌కు వచ్చారు. వారంలో మూడు రోజులు ఒకరి దగ్గర, మూడు రోజులు మరొకరి దగ్గర గడపడం.. మిగిలిన ఆదివారం ఒక్కరోజును ఆ భర్త ఛాయిస్‌కు వదిలేశారు. ఇక ఒప్పందంలో భాగంగా.. ఇద్దరికీ ఉండేందుకు చెరో ఫ్లాట్‌ను ఇవ్వడంతో పాటు జీతం చెరిసమానంగా పంచాలని నిర్ణయించుకున్నాడు. అయితే.. ఈ ఒప్పందం చట్టప్రకారం చెల్లుబాటు కాదంటున్నారు వాళ్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన న్యాయవాది హరీష్ దివాన్. ఇది పరస్పర అంగీకారంతో ముగ్గురు చేసుకున్న ఒప్పందం. ఇందులో కోర్టు పాత్రగానీ, కౌన్సిలర్ ప్రమేయంగానీ ఏమీ లేదు. ఈ ముగ్గురు హిందువులు. హిందూ చట్టాల ప్రకారం.. ఇలాంటి ఒప్పందం చెల్లదు. చట్టం ప్రకారం.. ఒక హిందువు ఒక భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాతే మరోకావిడను వివాహం చేసుకుంటేనే చెల్లుతుంది. కానీ, వీళ్లు తమ మానానా తాము ఒప్పందం చేసుకున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాళ్ల మీద చర్యలు ఉండొచ్చు అని చెప్పారు. -
ఒకేరోజు జననం.. ఒకేరోజు మరణం
సాక్షి, ఉమ్మడి వరంగల్: వారిద్దరూ ఒకే రోజు జన్మించారు. బంధుత్వంలో ఆప్యాయంగా మెలిగారు. అయితే వారి మరణం కూడా ఒకేరోజు జరగడం విధి విచిత్రం. మహబూబాబాద్ జిల్లాలో కొన్ని గంటల వ్యవధిలోనే వియ్యపురాళ్లు ఒకరి వెంట, మరొకరు మృతి చెందారు. కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని గంగిరెద్దుల బజారుకు చెందిన జానపాటి మల్లమ్మ (85) కుమార్తె అచ్చమ్మను, ఇదే గ్రామానికి చెందిన పంకు యాకమ్మ (85) కుమారుడైన యాకయ్యకు ఇచ్చి వివాహం చేశారు. మల్లమ్మ, యాకమ్మ ఇద్దరి ఇళ్లూ పక్కపక్కనే ఉండడం విశేషం. బంధుత్వంలో వారిద్దరూ అప్యాయంగా ఉండేవారు. శనివారం తెల్లవారుజామున మల్లమ్మ గుండెపోటుతో మృతి చెందింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన యాకమ్మ, మల్లమ్మ మృతదేహం వద్ద విలపించింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన ఆమె కూడా గుండెపోటుతో మృతి చెందింది. గంటల వ్యవధిలోనే వియ్యపురాళ్లు ఇద్దరూ మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఇదిలా ఉండగా మల్లమ్మ, యాకమ్మలు కొన్ని గంటల వ్యవధిలోనే ఒకే రోజు జన్మించినట్లు స్థానికులు తెలిపారు. చదవండి: ప్రేమ పేరుతో మోసం తిరుపతిలో నిందితుడి అరెస్టు -
షాకింగ్ లవ్‌స్టోరీ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న 'ఇద్దరమ్మాయిలు'
చెన్నై: తమిళనాడులోని చెన్నైలో ఇద్దరు యువతులు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో తమిళ బ్రాహ్మణ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా వీరి వివాహ వేడుక జరిగింది. ఇద్దరు తమ తండ్రుల ఒడిలో కూర్చుని పూలదండలు మార్చుకున్నారు. పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతుల్లో ఒకరు తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుబిక్ష సుబ్రమణి కాగా.. మరొకరు బంగ్లాదేశ్‌కు చెందిన టీనా దాస్. ఈ వివాహానికి తమ కుటుంబసభ్యులు ఒప్పుకుంటారని కలలో కూడా ఊహించలేదని సుబిక్ష ఆనంద పరవశంలో మునిగిపోయారు. ఈమె తల్లిదండ్రులు కెనడాలోని కల్గేరీలో సెటిల్ అయ్యారు. సుబిక్ష భార్య టీనా దాస్ బంగ్లాదేశ్‌లోని కన్జర్వేటివ్ హిందూ కుటుంబానికి చెందినవారు. ఈమె కూడా కల్గేరీలోనే నివసిస్తున్నారు. ఆరేళ్లుగా తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, పెద్దలను ఒప్పించడానికి ఇంత సమయం పట్టిందని సుబిక్ష చెప్పారు. బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో తమ పెళ్లి జరగడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. చార్టెట్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న సుబిక్ష.. తాను బైసెక్సువల్ అని నిర్మొహమాటంగా చెప్పింది. 19 ఏళ్ల వయసులోనే తన ప్రేమ విషయాన్ని తల్లిదండ్రలకు తెలిపింది. మాకు అప్పటిదాకా తెలియదు.. సుబిక్ష తల్లి పూర్ణపుష్కల కల్గేరీలో ప్లే స్కూల్‌ను నడుపుతున్నారు. తాను మదురైలో పెరిగానని, తర్వాత ఖతార్‌లో కొన్నాళ్లు నివసించినట్లు ఆమె వెల్లడించారు. కెనడా వెళ్లిన తర్వాతే తమకు ఎల్జీబీటీ కమ్యూనిటీ గురించి తెలిసిందని వివరించారు. సుబిక్ష ప్రేమ విషయం తెలిస్తే బంధువులు, స్నేహితులు తమను ఎక్కడ దూరం పెడతారో అని భయం వేసిందని చెప్పారు. ఎల్జీబీటీ కమ్యూనిటీ గురించి తెలియక తల్లిందడ్రులు తనను అర్థం చేసుకోలేకపోయారని టీనా దాస్ వెల్లడించారు. తనకు ఏదో వ్యాధి ఉందనుకున్నారని పేర్కొన్నారు. పెళ్లయితే అన్నీ సర్ధుకుంటాయని భావించి 19 ఏళ్ల వయసులో తనకు ఓ వ్యక్తితో పెళ్లి చేశారని వెల్లడించారు. ఆ తర్వాత నాలుగేళ్లకు విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. సుబిక్షను కల్గేరీలోనే కలిసినట్లు వివరించారు. చదవండి: జయలలిత మరణం.. కొడనాడులో ఎన్నో రహస్యాలు..! -
సరదా తీర్చిన ఉయ్యాల.. పట్టు తప్పి 6300 అడుగుల లోయలో!
ప్రతి ఒక్కరూ తమ చిన్నతనంలో ఏదో ఒక సందర్భంలో ఉయ్యాల ఊగే ఉంటారు. ఇంట్లో, పొలాల వద్ద, చెట్టుకు తాడు కట్టుకొని ఉయ్యాల ఊగూతుంటే మహా సరాదాగా ఉండేంది. ఒక్కసారి ఉయ్యాలపై కూర్చొని ఊగుతుంటే వయసుని మర్చిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే అదే ఉయ్యాల సరదా తాజాగా ఇద్దరు యువతుల ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఉయ్యాలపై జాలీగా గడిపేందుకు వచ్చిన ఇద్దరు యువతులు మృత్యువు అంచుల దాకా వెళ్లొచ్చారు. కొండ అంచు శిఖరం మీద ఏర్పాటు చేసిన ఉయ్యాలను ఊగితే చాలా థ్రిల్‌గా ఉంటుందని భావించారు ఇద్దరు యువతులు. కానీ చివరికి వాళ్లు ఊహించని విధంగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన రష్యాలోని డగేస్టన్‌లో చోటుచేసుకుంది. సులాక్ కాన్యాన్ ప్రాంతంలో పర్యాటకుల కోసం కొండ అంచున ఒక ఉయ్యాలను అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో పర్యాటకులు ఉయ్యాలలో కూర్చొని సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. అయితే ఉయ్యాల వద్ద భద్రత సరిగా లేదని అక్కడి ప్రభుత్వం హెచ్చరించిన అధికారులు పట్టించుకోలేదు. ఇదే క్రమంలో తాజాగా ఓ ఇద్దరు యువతులు ఉయ్యాల ఎక్కి చక్కగా ఊగుతున్న సమయంలో లోతును చూసి ఒక్కసారిగా భయపడ్డారు. దీంతో ఉయ్యాల కదులుతుండగానే దాని నుంచి హడావిడిగా దిగేందుకు ప్రయత్నించారు. ఇంకేముంది సరాసరి ఉయ్యాల పక్కన ఉన్న 6300 అడుగుల లోయలోకి పడిపోయారు. అయితే, వారు కొండ అంచున ఏర్పాటు చేసిన డెక్కింగ్ ప్లాట్‌ఫాం మీద పడటంతో ప్రాణాలు దక్కాయి. ఆ ఉయ్యాల ఇంకాస్త వేగంగా ఊగి ఉంటే ఖచ్చితంగా వాళ్లు నేరుగా లోయలో పడిపోయేవారు. కాగా ఈ ప్రమాదంలో వారికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను చూస్తే మీరు కూడా హడలిపోతారు. ఇక ఈ ఘటన అనంతరం ఇద్దరు యువుతులు ఇక తమ జీవితంలో ఉయ్యాల ఎక్కేందుకు సాహసించరేమో.. Moment two women fell off a 6000-Ft cliff swing over the Sulak Canyon in Dagestan, Russia. Both women landed on a narrow decking platform under the edge of the cliff & miraculously survived with minor scratches. Police have launched an investigation. pic.twitter.com/oIO9Cfk0Bx — UncleRandom (@Random_Uncle_UK) July 14, 2021 -
ఒకే మండపంలో ఇద్దర్ని పెళ్లి చేసుకున్న యువకుడు
-
పెద్దల్ని ఎదురించి ఒక్కటైన అమ్మాయిలు
జార్ఖండ్ : ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న ఇద్దరు అమ్మాయిలు పెద్దలను ఎదురించి, ఇంటి నుంచి పారిపోయి ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్, కొదెర్మ జిల్లాకు చెందిన ఇద్దరు అమ్మాయిలు గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంట్లో వారికి ఈ విషయం చెబితే ఒప్పుకోరని భావించారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ ఇంటినుంచి బయటకు వచ్చేశారు. నవంబర్ 8వ తేదీన గుడిలో పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం వారి ఇళ్లకు ఆరు కిలోమీటర్ల దూరంలోని చంద్రచౌక్ ప్రాంతంలో ఇళ్లు అద్దెకు తీసుకుని కాపురం మొదలుపెట్టారు. ( కోవిడ్ సెంటర్లో పెళ్లి.. వీడియో వైరల్ ) వీరు చంద్రచౌక్‌లో ఉంటున్నారని తెలుసుకున్న ఇరు కుటుంబాల వారు అక్కడికి చేరుకుని గొడవ చేశారు. ఇద్దరు అమ్మాయిలు మేజర్లు కావటంతో పోలీసులు జోక్యం చేసుకోమని చెప్పి వెళ్లిపోయారు. దీనిపై ఆ అమ్మాయిలు మాట్లాడుతూ.. ‘‘ దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని మమ్మల్ని మా కుటుంబాలు బెదిరిస్తున్నాయి. మేం దాన్ని లెక్క చేయం. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న మేము గుడిలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యాం. త్వరలో మా పెళ్లిని కోర్టు ద్వారా చట్టబద్దం చేయటానికి ప్రయత్నిస్తామ’’ని చెప్పారు. -
భర్తలకు విడాకులు ఇచ్చి ఏకమైన వివాహితలు
లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో అందరూ విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. వివాహితులైన ఇద్దరు యువతులు ఏకంగా తమ భర్తలకు విడాకులిచ్చి జంటగా మారారు. ఆ ఇద్దరు యువతులు గతంలో కళాశాలలో చదువుకునే సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆరేళ్ల తర్వాత శనివారం ఓ ఆలయంలో స్నేహితులు, తమ న్యాయవాది ఎదుట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా, వీరి వివాహాన్ని ధ్రువీకరించేందుకు రిజిస్ట్రార్ నిరాకరించారు. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ, వారి వివాహాన్ని ఏ చట్టం కిందా గుర్తించలేమని ఆయన అన్నారు. హమీర్‌పూర్‌కు చెందిన ఇద్దరు యువతులు ఆరేళ్ల క్రితం కళాశాలలో మొదటిసారి కలుసుకుని తొలిపరిచయంలోనే ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమ గురించి యువతుల ఇళ్లలో తెలియడంతో అర్ధంతరంగా చదువుకు స్వస్తిపలికీ, ఇద్దరికీ వేర్వేరుగా వివాహాలు జరిపించారు. వారు విడిపోయి ఆరేళ్లు గడిచినా ఒకరిని విడిచి ఒకరు ఉండలేమంటూ వారు తమ భర్తల నుంచి విడాకులు తీసుకుని ఏకంగా వివాహం చేసుకున్నారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో వీరి వివాహాన్ని గుర్తించాలని కోరుతూ తాము న్యాయపోరాటం చేస్తామని యువతుల తరపు న్యాయవాది పేర్కొన్నారు. తాము కట్టుకున్న భర్తల నుంచీ భరణం కూడా ఆశించడం లేదని, ప్రేమను నిలబెట్టుకునేందుకు తాము ఒక్కటయ్యామని ఆ యువతులు చెబుతున్నారు. -
గొంతులు కోసి.. మహిళల దారుణహత్య..
సాక్షి, బెంగళూరు: ఉద్యాన నగరిలో హంతకులు చెలరేగిపోయారు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని గొంతుకలు కోసి రక్తపుటేరులు పారించారు. బ్యాటరాయనపుర, సుద్దగుంటేపాళ్య పోలీస్స్టేషన్ల పరిధిలో ఇద్దరు మహిళలు దారుణహత్యకు గురయ్యారు. బ్యాటరాయనపుర పరిధిలోని కస్తూరిబానగర 5 వక్రాస్ 6 వ మెయిన్‌రోడ్డులో శివరామ్, కవితా(26) దంపతులు నివాసం ఉంటున్నారు. శివరామ్ నాయండహళ్లి ప్లైవుడ్ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఇతను గురువారం ఉదయం దుకాణం విదులకు వెళ్లగా 9 గంటల సమయంలో కవితా తన ఇద్దరు పిల్లలైన లిఖిత్, హర్షిత్ లను పాఠశాలలో వదిలిపెట్టి ఇంటికి చేరుకుంది. ఈ సమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు చాకుతో గొంతుకోసి ఆమెను హత్యచేశారు. బీరువాలో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. 9.50 సమయంలో కవిత తండ్రి ఇంటికి రాగా ఈ ఉదంతం వెలుగు చూసింది. బ్యాటరాయనపుర పోలీసులు డాగ్‌స్క్వాడ్, వేలిముద్రనిపుణులతో చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. అదనపు పోలీస్‌కమిషనర్ బీకే.సింగ్, డీసీపీ అనుచేత్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఇంటిని ఖాళీ చేయనందుకు మహిళ గొంతుకోసిన యజమాని ఇంటిని ఖాళీ చేయలేదని అద్దెకు ఉంటున్న మహిళను గొంతుకోసి హత్యచేసిన యజమాని ఉదంతం సుద్దగుంటెపాళ్య పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కమలమ్మ అనే మహిళ ప్రైవేటు కంపెనీలో స్వీపర్‌గా పనిచేస్తోంది. సుద్దగుంటెపాళ్య గుండుతోపులో జగదీశ్ అనే వ్యక్తి ఇంటిని అద్దెకు తీసుకొని తన ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటుంది. ఇంటి లీజు అవధి ముగియడంతో ఖాళీ చేయాలని యజమాని జగదీశ్ సూచించాడు. అయితే అడ్వాన్స్ వెనక్కి ఇవ్వాలని, అంతవరకు ఖాళీ చేసే ప్రసక్తే లేదని కమలమ్మ స్పష్టం చేసింది. ఈక్రమంలో జగదీశ్ స్నేహితులైన సంతోష్, కేశవ్‌తో కలిసి బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో కమలమ్మ ఇంటికి వెళ్లారు. ఇంట్లోనుంచి ఇద్దరు పిల్లలను బయటికి పంపించి కమలమ్మతో గొడవపడ్డారు. ఓ దశలో జగదీశ్, మిగతా ఇద్దరూ కలిసి కమలమ్మ గొంతు కోసి ఉడాయించారు. రక్తపుమడుగులో పడి ఉన్న తల్లిని పిల్లలు ఇరుగుపొరుగు వారి సాయంతో బౌరింగ్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. సుద్దగుంటెపాళ్య పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి సంతోష్, కేశవ్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న జగదీశ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. -
రోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు మహిళలు
-
విద్యుత్ షాక్‌తో ఇద్దరు మహిళలు మృతి
-
భార్యాభర్తల్లా ఉంటాం ప్లీజ్.. పోలీసులు అవాక్కు
మధుర: ఉత్తరప్రదేశ్‌లోని మధుర పోలీసులకు ఒక వింత సమస్య ఎదురైంది. తామిద్దరం ఒకరిని విడిచి ఒకరం ఉండలేమని దంపతుల్లాగా కలిసుంటామని అందుకు తమకు సహాయం చేయాలంటూ ఒక పెళ్లై భర్తతో విడిపోయిన యువతి, మరో విద్యార్థిని పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తమ కోరిక నెరవేర్చకుంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. దీంతో అప్పటికే వారిద్దరి విన్నపానికి ససేమిరా అంటూ చివాట్లు పెడుతున్న తల్లిదండ్రులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. మధురలోని రెండు పక్కపక్క గ్రామాలకు చెందిన వీరు ఒకే కులానికి చెందినవారు. తాము చాలా రోజులగా ప్రేమించుకుంటున్నామని, ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసి తనను బాగా కొడుతున్నారని మీరా(పేరు మార్చాం) అనే ఆమె చెప్పింది. ఎలాగైనా తాము పెళ్లి చేసుకుంటామని, అందుకు తమకు సహాయం చేయాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. తల్లిదండ్రులు మాత్రం అందుకు నిరాకరించారు. దీంతో ఈ విషయంపై ఎలా ముందుకు వెళ్లాలని ఆ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. -
ఇద్దరి మహిళల ఆత్మహత్యాయత్నం
శెట్టిపాలెం (వేములపల్లి) : వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళలు ఆత్మహత్యకు యత్నించారు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి విజయగిరి వరమ్మ (30) కూతురు స్వప్నతో ఘర్షణ పడి మనస్తాపానికి గురైంది. ఎవరూ చూడని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు. భర్త తాగుడు భరించలేక.. చౌదర్పల్లి(బొమ్మలరామారం) : మండలంలోని చౌదర్పల్లి గ్రామానికి చెందిన నాముండ్ల నర్సింహకు కీసర మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నవీనతో ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.కొంత కాలం సజావుగా సాగిన వీరి కాపురంలో మద్యం మహమ్మారి చిచ్చు పెట్టింది.మూడేళ్లుగా భర్త నర్సింహ మద్యానికి బానిసై భార్య నవీనను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో నవీన భర్త తాగుడు భరించలేక మనస్తాపానికి గురై శుక్రవారం ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇరుగు పొరుగు వారు గమనించి చికిత్స నిమిత్త గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి తండ్రి నర్సింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. -
కలిసుంటామని కోర్టుకెళ్లారు
కేకే.నగర్: సహజీవనానికి అనుమతివ్వాలని కోరుతూ బెంగళూరుకు చెందిన ఇద్దరు యువతులు మంగళవారం తమిళనాడులోని మదురై జిల్లా కోర్టును ఆశ్రయించారు. బెంగళూరు వివేక్నగర్కు చెందిన వరుణ్ అలియాస్ వినోనికా(22), ఇదే ప్రాంతానికి చెందిన మాలిని (19) ఇద్దరూ అదే ప్రాంతంలోని ఒక షాపింగ్ మాల్లో పనిచేస్తున్నారు. వినోనికా చిన్నతనం నుంచి తనను పురుషుడిగా భావించుకుని పెరిగింది. గత ఏడాది వినోనికా, మాలిని మధ్య స్నేహం ఏర్పడి అది ప్రేమగా మారింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల సభ్యులు, బంధువులు వ్యతిరేకత తెలిపారు. దీంతో ఇద్దరూ నాలుగు నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయారు. వేలాంకన్నికి చేరిన ఈ ఇరువురు గది తీసుకుని సహజీవనం చేశారు. ఇది తెలుసుకున్న వారి తల్లిదండ్రులు బెంగళూరు నుంచి వచ్చి వారిని ఇళ్లకు తీసుకోని వెళ్లారు. ఈ క్రమంలో ఒక రోజు అకస్మాతుగా బెంగళూరు రైల్వేస్టేషన్ లో ఇటీవల కలుసుకున్నారు. ఆ సమయంలో ఎలాంటి సమస్య ఎదురైనా తాము చివరి వరకు కలిసి ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అక్కడి నుంచి చెన్నైకు వచ్చారు. చెన్నైలో తాము కలసి జీవించడానికి తగిన సౌకర్యాలు లేవని అనుకున్న ఇద్దరూ మధురైకు చేరుకున్నారు. మధురైలోని హిజ్రా భారతి కన్నమ్మ గురించి తెలుసుకుని ఆమెను ఆశ్రయించారు. తాము ఇద్దరూ సహజీవనం సాగించడానికి సహాయం చేయమని భారతి కన్నమ్మను కోరారు. ఆమె మంగళవారం మధురై జిల్లా న్యాయమూర్తి వద్దకు సమస్యను తీసుకొచ్చారు. -
షాపింగ్‌కు వెళ్లొస్తుండగా షాకింగ్ ఘటన
అహ్మదాబాద్: కూతురును, మనవరాలిని చూసేందుకు వచ్చిన ఓ పెద్దావిడ మృత్యువాత పడింది. మనవరాలితో కలిసి రోడ్డు దాటుతున్న ఆమెను వాయువేగంతో వచ్చిన ఓ కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలుకోల్పోయింది. మనవరాలు మాత్రం గాయపడింది. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శనివారం చోటుచేసుకోగా సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 63 ఏళ్ల జైనీత్ థామస్ అనే వృద్ధురాలు ముంబయి నుంచి తన కూతురును చూసేందుకు అహ్మదాబాద్ వచ్చింది. శనివారం మద్యాహ్నం తన మనవరాలు ప్రిషా(15)తో కలిసి షాపింగ్ కు వెళ్లింది. అనంతరం రద్దీగా ఉన్న జాతీయ రహదారిని దాటుతుండగా ఒక్కసారిగా మితిమీరిన వేగంతో వచ్చిన హ్యుందాయ్ ఐ20 కారు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో వృద్థురాలు థామస్ చనిపోగా మనవరాలు మాత్రం గాయాలతో బయటపడింది. అయితే, ఢీకొట్టిన కారు, డ్రైవర్ వివరాలు ఇంకా తెలియరాలేదు. -
ఇద్దరు మహిళల ఆత్మహత్యాయత్నం
యాడికి: మండలకేంద్రం యాడికిలో గీత(40) అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మండల కేంద్రం కోట వీధిలో నివాసముండే గీత ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన బంధువులు ఆమెను 108 వాహనంలో తాడిపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురానికి తరలించినట్లు బంధువులు తెలిపారు. అలాగే మండలంలోని కత్తిమానుపల్లిలో ఎల్లమ్మ(30) అనే మహిళ విష ద్రావకం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామానికి చెందిన బాలక్రిష్ణ భార్య ఎల్లమ్మ కుటుంబ కలహాలతో విష ద్రావకం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, గమనించిన బంధువులు ఆమెను యాడికి ప్రభుత్వ వైద్యశాలకు,అక్కడి నుంచి తాడిపత్రికి తరలించారు. -
కల్లు తాగించి చోరీలు చేస్తున్న కి‘లేడీ’లు
► ఇద్దరిని రిమాండ్‌కు తరలించిన ఆర్జీఐఏ పోలీసులు ► ఐదు తులాల బంగారం స్వాధీనం శంషాబాద్(రంగారెడ్డి జిల్లా): ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలకు కల్లు తాగించి వారు మత్తులోకి జారుకున్న తర్వాత బంగారం చోరీ చేస్తున్న ఇద్దరు మహిళలను ఆర్జీఐఏ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆర్జీఐఏ క్రైమ్ డీఐ జావిద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని హుమాయున్‌నగర్ ప్రాంతానికి చెందిన అరుణాబాయి(50) రేఖాబాయి(50) నిత్యం శంషాబాద్ పట్టణంలోని కంపౌండ్‌లో కల్లు తాగడానికి వస్తుంటారు. కంపౌండ్‌లో ఒంటరిగా కల్లు తాగుతున్న వృద్ధులైన మహిళలను ఎంచుకుంటారు. వారితో మాటలు కలిపి బాగా కల్లు తాగించి స్పృహ కోల్పోయేలా చేస్తారు. ఆ తర్వాత వారి ఒంటిపై ఉన్న బంగారు, వెండి నగలను తీసుకుని పరారవుతుంటారు. రెండు నెలలుగా శంషాబాద్ పట్టణంలో జరిగిన రెండు సంఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం కల్లు కంపౌండ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా కనిపించిన అరుణాబాయి, రేఖాబాయిని అదుపులోకి తీసుకుని విచారించగా తాము చేసిన నేరాలను అంగీకరించారు. వీరి నుంచి ఐదు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. రెండేళ్ల కిందట కూడా వీరు ఇదే కల్లుకంపౌండ్లో చేసిన నేరాలకు జైలుకు వెళ్లి వచ్చారు. అయినా తీరు మారలేదు. విలేకరుల సమావేశంలో క్రైమ్ ఎస్ఐ వెంకటేశ్వర్లు తదితరులున్నారు. -
ఎండ తీవ్రతకు ఇద్దరు కూలీలు మృతి
కృష్ణా జిల్లా : ఎండ తీవ్రతకు మనుషులు పిట్టల్లా రాలుతున్నారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలో మిర్చి కోతకు వెళ్లిన ఓ మహిళ ఎండ తీవ్రతకు తాళలేక చనిపోయింది. గ్రామానికి చెందిన మరియమ్మ(35) శనివారం స్థానిక రైతు చేనులో మిర్చి కోతకు వెళ్లింది. ఎండ తీవ్రతకు తాళలేక ఆమె మధ్యాహ్నంకల్లా నీరసించి అక్కడికక్కడే పడిపోయింది. ప్రథమ చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు విడిచింది. అలాగే శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం దూగనపుటుగ గ్రామానికి చెందిన రాజులమ్మ(60) శనివారం జీడి పిక్కలు తీసే పనికి వెళ్లింది. ఎండలో మధ్యాహ్నం వరకు పనిచేసిన ఆమె తీవ్ర నీరసం కారణంగా ఇంటికి చేరుకుంది. పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ప్రాథమిక చికిత్సకు తరలించారు. వైద్యం చేస్తుండగానే పరిస్థితి విషమించి రాజులమ్మ చనిపోయింది. -
సెల్ఫీ పిచ్చితో ఇద్దరు అమ్మాయిలు..
పనాజీ: సెల్ఫీ పిచ్చితో కొందరు ప్రాణాలు తీసుకోగా.. మరికొందరు కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్నారు. గోవాకు విహారయాత్రకు వెళ్లిన ఇద్దరు అమ్మాయిలు సెల్ఫీ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇద్దరూ తీవ్రంగా గాయపడి పక్షవాతానికి గురయ్యారు. గోవా తీర ప్రాంతం అంజునా సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు అమ్మాయిలు స్కఫోల్డింగ్పై కూర్చునే సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే స్కఫోల్డింగ్ కూలిపోవడంతో ఇద్దరూ చాలా ఎత్తుపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అమ్మాయిలు ఇద్దరికీ వెన్నెముకకు తీవ్రగాయమైంది. నడుము కింది భాగాలు పక్షవాతానికి గురయ్యాయి. తీవ్రంగా గాయపడినా ఇద్దరూ బతికేఉన్నారని వైద్యులు చెప్పారు. వారి వివరాలను వెల్లడించలేదు. -
ముస్లిం మహిళను బస్సులోంచి తోసేశారు!
లండన్: ఇస్లామోఫోబియాతో లండన్‌లో విద్వేష నేరాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలికాలంలో యూరప్‌లో ముస్లింలపై దాడులు జరుగుతున్న ఘటనలు పెరుగుతున్నట్టు కనిపిస్తున్నది. లండన్‌లో ఓ ముస్లిం మహిళపై సాటి మహిళలే దాడి చేసి బస్సులోంచి గెంటేశారు. తలచుట్టూ సంప్రదాయబద్ధమైన రుమాలు ధరించిన 40 ఏళ్ల ముస్లిం మహిళ బస్సులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న 20 ఏళ్ల ఇద్దరు యువతులు ఆమెపై దాడి చేశారు. ముఖంపై పిడిగుద్దులు కురిపిస్తూ ఆమెను బస్సు నుంచి బయటకు తోసేశారు. నిస్సహాయంగా పేవ్మెంట్ మీద పడిపోయిన బాధితురాలిపై జ్యాత్యాంహకార వ్యాఖ్యలు చేస్తూ దుర్భాషలాడారు. దక్షిణ లండన్‌లో అక్టోబర్ 28న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితురాళ్లను పోలీసులు తాజాగా గుర్తించారు. సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను ఇద్దరిని పోలీసులు గుర్తించారు. పరారీలో ఇద్దరు నిందితురాళ్లను పట్టుకునేందుకు లండన్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. -
20 కిలోల గంజాయి స్వాధీనం
తిరుపతి: చిత్తూరు జిల్లా రేణిగుంట చెక్‌పోస్టు వద్ద ఇద్దరు మహిళల నుంచి 20 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పట్టుబడిన ఇద్దరు మహిళలను తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. -
ట్రాక్టరు బోల్తాపడి ఇద్దరు మహిళలు మృతి
-
ఇద్దరు మహిళలను రక్షించిన లేక్ పోలీసులు...
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్ సిటీ): వివిధ కారణాలతో ఇద్దరు మహిళలు హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నిస్తుండగా లేక్ పోలీసులు రక్షించారు. ఇన్స్పెక్టర్ శ్రీదేవి కథనం ప్రకారం... ఉప్పుగూడ అరుంధతి కాలనీకి చెందిన యువతి (23) ఎంబీఏ చదువుతోంది. తండ్రి వదిలి వేయడంతో తల్లితో కలిసి తాత ఇంట్లో ఉంటోంది. కాగా, కొద్ది రోజులుగా ఆమె నడుం నొప్పితో బాధపడుతోంది. బోన్ క్యాన్సర్ కావచ్చనే అనుమానంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్న ఆ యువతి గురువారం ట్యాంక్‌బండ్‌కు వచ్చి హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు యత్నిస్తుండగా లేక్ పోలీసులు అడ్డుకున్నారు. మరో ఘటనలో...రాజేంద్రనగర్ అత్తాపూర్‌కు చెందిన సీహెచ్ శివరాణి(50) ప్రైవేటు ఆస్పత్రిలో అటెండర్. ఈమె భర్త జీహెచ్ఎంసీలో పనిచేస్తూ 15 ఏళ్ల క్రితం మరణించగా పెద్ద కుమారుడికి అతని ఉద్యోగం ఇచ్చారు. చిన్న కుమారుడు ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. పెద్ద కుమారుడు తనను పట్టించుకోకపోవడంతో శివరాణి చిన్న కుమారుడి దగ్గర ఉంటోంది. అతడి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దీనికి తోడు చిన్నకోడలితో ఆమె చిన్నచిన్న విషయాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనోవేదనకు గురవుతున్న శివరాణి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నిస్తుండగా లేక్ పోలీసులు రక్షించారు. అనంతరం ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరికీ పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. -
'నకిలీ బంగారం అమ్మి పోలీసుల కస్టడీకి'
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ కడప జిల్లా కేంద్రంలో నకిలీబంగారం కేసులో ఓ మహిళ, మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు చింత కొమ్మదిన్నె సీఐ యుగంధర్ తెలిపారు. బంగారు నగలు అంటూ పలువురికి నకిలీ నగలు అంటగట్టారు. వీరి దగ్గర నుంచి నగలు కొన్న పలువురు అవి నకిలీవి అని ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.95 వేల నగదు, 4 నకిలీ బంగారపు గాజులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
పెళ్లయిన ఆరు నెలలకే..
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మహిళల ఆత్మహత్య కొన్నె(బచ్చన్నపేట) : పెళ్లయిన ఆర్నెల్ల్లకే ఇద్దరు మహిళలు తనువు చాలించారు. బచ్చన్నపేట మండలం కొన్నెలో ఒకరు.. ములుగు మండలంలోని చిన్నగుంటూరుపల్లిలో మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకా రం.. దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన వసంత(20)కు కొన్నెకు చెందిన చీర వేణుతో ఆర్నెళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో వసంత బుధవారం ఉదయం వ్యవసాయ బావి వద్దకు పత్తి సేకరించేందుకు వెళ్లింది. అక్కడే పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందింది. వసంత ఆత్మహత్యకుగల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా మృతురాలి అత్త, మామ, భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఎస్సై షాదుల్లాబాబా జనగామ ఏరియా ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. చిన్నగుంటూరుపల్లిలో.. ములుగు : నెల్లూరు జిల్లాకు చెందిన అజ్మీరా దేవి(22) మండలంలోని చిన్నగుంటూరుపల్లి గ్రామానికి చెందిన అజ్మీరా అఖిల్‌ను 6 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. తరచూ గొడవలు జరగడంతో దేవి బుధవారం పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా చికిత్సపొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. -
ఇద్దరు జార్ఖండ్ యువతులపై అత్యాచారం
న్యూఢిల్లీ: జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు యువతులపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన ఈశాన్య ఢిల్లీ పరిధిలోని భజన్‌పురా ఏరియాలో జరిగింది. ఈ మేరకు బాధితురాళ్లు ఫిర్యాదు చేసినట్లు శనివారం పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. జార్ఖండ్ చెందిన ఇద్దరు మహిళలు (21,24) గుర్గావ్లో తమ డిగ్రీని పూర్తిచేశారు. కొన్ని సర్టిఫికెట్ల కోసం వారు జూన్ రెండో తేదీన నగరానికి వచ్చారు. వారు ఐదో తేదీన తిరిగి వెళ్లాల్సి ఉండగా ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. అయితే వారి బెర్త్‌లు ఖరారు కాలేదు. ఆ సమయంలో వారికి బెర్త్‌లు ఖరారు చేయిస్తానని ఒక వ్యక్తి నమ్మబలికి, దాని కోసం పాతఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వెళ్లాలని చెప్పాడు. వారు ముగ్గురూ ఆటోలో బయలుదేరగా మార్గమధ్యంలో సదరు వ్యక్తి యువతులిద్దరికీ కూల్ డ్రింక్ ఇచ్చాడు. దాన్ని తాగిన వారు స్పృహతప్పి పడిపోయారు. మళ్లీ స్పృహలోకి వచ్చిన తర్వాత చూడగా తాము భజన్‌పురా ప్రాంతంలో ఉన్నట్లు గ్రహించారు. స్థానికుల సాయంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి, యువతులను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. వైద్యపరీక్షల్లో వారిపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. -
కస్టమర్లా వచ్చారు... కళ్ళు గప్పి మాయం చేశారు