న్యూఢిల్లీ: జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు యువతులపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన ఈశాన్య ఢిల్లీ పరిధిలోని భజన్‌పురా ఏరియాలో జరిగింది. ఈ మేరకు బాధితురాళ్లు ఫిర్యాదు చేసినట్లు శనివారం పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. జార్ఖండ్ చెందిన ఇద్దరు మహిళలు (21,24) గుర్గావ్‌లో తమ డిగ్రీని పూర్తిచేశారు. కొన్ని సర్టిఫికెట్ల కోసం వారు జూన్ రెండో తేదీన నగరానికి వచ్చారు. వారు ఐదో తేదీన తిరిగి వెళ్లాల్సి ఉండగా ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. అయితే వారి బెర్త్‌లు ఖరారు కాలేదు. ఆ సమయంలో వారికి బెర్త్‌లు ఖరారు చేయిస్తానని ఒక వ్యక్తి నమ్మబలికి, దాని కోసం పాతఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వెళ్లాలని చెప్పాడు.
వారు ముగ్గురూ ఆటోలో బయలుదేరగా మార్గమధ్యంలో సదరు వ్యక్తి యువతులిద్దరికీ కూల్ డ్రింక్ ఇచ్చాడు. దాన్ని తాగిన వారు స్పృహతప్పి పడిపోయారు. మళ్లీ స్పృహలోకి వచ్చిన తర్వాత చూడగా తాము భజన్‌పురా ప్రాంతంలో ఉన్నట్లు గ్రహించారు. స్థానికుల సాయంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి, యువతులను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. వైద్యపరీక్షల్లో వారిపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.
ఇద్దరు జార్ఖండ్ యువతులపై అత్యాచారం
Published Sun, Jun 8 2014 9:55 PM | Last Updated on Sat, Jul 28 2018 8:44 PM
Advertisement
Advertisement