ప్రతి ఒక్కరూ తమ చిన్నతనంలో ఏదో ఒక సందర్భంలో ఉయ్యాల ఊగే ఉంటారు. ఇంట్లో, పొలాల వద్ద, చెట్టుకు తాడు కట్టుకొని ఉయ్యాల ఊగూతుంటే మహా సరాదాగా ఉండేంది. ఒక్కసారి ఉయ్యాలపై కూర్చొని ఊగుతుంటే వయసుని మర్చిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే అదే ఉయ్యాల సరదా తాజాగా ఇద్దరు యువతుల ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఉయ్యాలపై జాలీగా గడిపేందుకు వచ్చిన ఇద్దరు యువతులు మృత్యువు అంచుల దాకా వెళ్లొచ్చారు.
కొండ అంచు శిఖరం మీద ఏర్పాటు చేసిన ఉయ్యాలను ఊగితే చాలా థ్రిల్‌గా ఉంటుందని భావించారు ఇద్దరు యువతులు. కానీ చివరికి వాళ్లు ఊహించని విధంగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన రష్యాలోని డగేస్టన్‌లో చోటుచేసుకుంది. సులాక్ కాన్యాన్ ప్రాంతంలో పర్యాటకుల కోసం కొండ అంచున ఒక ఉయ్యాలను అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో పర్యాటకులు ఉయ్యాలలో కూర్చొని సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. అయితే ఉయ్యాల వద్ద భద్రత సరిగా లేదని అక్కడి ప్రభుత్వం హెచ్చరించిన అధికారులు పట్టించుకోలేదు.
ఇదే క్రమంలో తాజాగా ఓ ఇద్దరు యువతులు ఉయ్యాల ఎక్కి చక్కగా ఊగుతున్న సమయంలో లోతును చూసి ఒక్కసారిగా భయపడ్డారు. దీంతో ఉయ్యాల కదులుతుండగానే దాని నుంచి హడావిడిగా దిగేందుకు ప్రయత్నించారు. ఇంకేముంది సరాసరి ఉయ్యాల పక్కన ఉన్న 6300 అడుగుల లోయలోకి పడిపోయారు. అయితే, వారు కొండ అంచున ఏర్పాటు చేసిన డెక్కింగ్ ప్లాట్‌ఫాం మీద పడటంతో ప్రాణాలు దక్కాయి.
ఆ ఉయ్యాల ఇంకాస్త వేగంగా ఊగి ఉంటే ఖచ్చితంగా వాళ్లు నేరుగా లోయలో పడిపోయేవారు. కాగా ఈ ప్రమాదంలో వారికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను చూస్తే మీరు కూడా హడలిపోతారు. ఇక ఈ ఘటన అనంతరం ఇద్దరు యువుతులు ఇక తమ జీవితంలో ఉయ్యాల ఎక్కేందుకు సాహసించరేమో..
Moment two women fell off a 6000-Ft cliff swing over the Sulak Canyon in Dagestan, Russia.
— UncleRandom (@Random_Uncle_UK) July 14, 2021
Both women landed on a narrow decking platform under the edge of the cliff & miraculously survived with minor scratches.
Police have launched an investigation. pic.twitter.com/oIO9Cfk0Bx
Comments
Please login to add a commentAdd a comment