ఎక్కడైన నదిలో నీళ్లు తెల్లగానే ఉంటాయి. కానీ ఇక్కడ నదిలో నీళ్లు మాత్రం ఎర్రటి నెత్తురులా మారిపోయాయి. చెప్పాలంటే రక్తంలా ప్రవహిస్తున్నాయి నీళ్‌లు. ఇలా ఎందుకు జరిగిందో అని స్థానికలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన దక్షిణ రష్యాలో చోటు చేసుకుంది. ఇలా జరగడానకి కారణం ఏంటన్నది అక్కడి అధికారులకు అంతు చిక్కని మిస్టరీలా ఉంది.
వివరాల్లోకెళ్తే..దక్షిణ రష్యాలోని కెమెరోవోలోని ఇస్కిటిమ్కా నది సడెన్‌గా ఎరుపు రంగులో ప్రవహిస్తోంది. ఒకప్పుడూ చక్కగా ప్రవహించే నది ఇలా రక్తపు నదిలా ఎలా మారిందనేది తెలియక స్థానికులు ఒకింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడూ ఈ ఘటనే సర్వత్రా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా ఈ ఘటన నీటి కాలుష్యం గురించి తక్షణమే తీసుకోవాల్సిన చర్యల ఆవశక్యతను తెలియజేసింది. అంతేగాదు బాతులు వంటి చిన్న జంతువులు ఏవీ ఆ నీటిలోకి వెళ్లేందుకు ఇష్టపడలేదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.
ఈ ఘటనపై పర్యావరణ అధికారులు సైతం భయాందోళనలు వ్యక్తం చేశారు. కాలుష్యం కారణంగానే ఇలా జరిగిందేమో! అని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. అయితే ఆ నగర డిప్యూటీ గవర్నర్ ఆండ్రీ పనోవ్ డ్రైనేజీ లీక్ కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే అక్కడ నది ఇలా సడెన్‌గా రంగు మారడానికి కచ్చితమై కారణం ఏంటన్నది రసాయన పరీక్ష ద్వారా తెలియాల్సి ఉంది. కాగా, ఇలాంటి ఘటనే సరిగ్గా జూన్ 2020లో ఉత్తర సైబీరియాలో నోరిల్స్క్ సమీపంలోని పవర్ స్టేషన్‌లో డీజిల్ రిజర్వాయర్ కూలిపోవడంతో ఇలాంటి ఘటన జరిగింది.
దీని కారణంగా అనేక ఆర్కిటిక్ నదులన్నీ ఎర్రగా మారి ఇలాంటి దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన కారణంగా దాదాపు 15 వేల టన్నుల ఇంధనం నదిలోకి పోగా, ఆరు వేల టన్నులు మట్టిలోకి ఇంకిపోయింది. ఆ టైంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అత్యవసర పరిస్థితిని కూడాప్రకటించారు. మళ్లీ ఇదే తరహాలో రష్యాలోని మరో నగరంలో చోటు చేసుకోవడం గమనార్హం. ఇలాంటి ఘటనలు పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడం, జలవనరులను కాలుష్య కోరల నుంచి కాపాడు కోవాల్సిన ప్రాముఖ్యతలను గూర్చి నొక్కి చెబుతున్నాయని అంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. మానవ తప్పిదాలు, పారిశ్రామిక కార్యకలాపాలు పర్యావరణానికి ఎలా నష్టం కలిగిస్తున్నాయో ఇప్పటికైనా గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందేనని, లేదంటే మానవళికి ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.
(చదవండి: తినే గమ్(గోండ్) గురించి తెలుసా? బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు..)
Comments
Please login to add a commentAdd a comment