swing
-
క్విక్ విస్తరణ!
క్విక్ కామర్స్ కంపెనీలకు దండిగా నిధులు లభిస్తుండటంతో విస్తరణ జోరు పెంచాయి. నగరాల్లో ఈ మోడల్ మంచి సక్సెస్ సాధించడంతో జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్ తదితర సంస్థలు డార్క్ స్టోర్ల సంఖ్యను భారీగా పెంచడంపై దృష్టి పెడుతున్నాయి. కిరాణాతో మొదలు పెట్టిన కంపెనీలు ఇప్పుడు నెమ్మదిగా ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, మేకప్, టాయ్స్ వంటి ఇతర ప్రొడక్టులను కూడా కార్ట్‌లోకి చేర్చుతున్నాయి. అయితే, బడా నగరాల్లో ఈ మైక్రో వేర్‌హౌస్‌ల కోసం స్థలాల వేట కష్టతరంగా మారుతోందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.సమీపంలోని ప్రాంతాలకు 30 నిమిషాల్లోపే ఆర్డర్లను డెలివరీ చేయడానికి వీలుగా ఏర్పాటు చేసే చిన్న స్థాయి గోడౌన్లను డార్క్ స్టోర్లుగా పేర్కొంటారు. కిక్కిరిసిన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలంటే భారీ ఖర్చుతో కూడిన వ్యవహరం. అయినప్పటికీ కంపెనీలు తగ్గేదేలే అంటున్నాయి. మరోపక్క, రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, క్విక్ డెలివరీ విషయంలో లోటుపాట్లు లేకుండా చూసేందుకు భారీ స్థాయిలో సిబ్బంది నియామకాలతో ఈ రంగంలో హైరింగ్ కళకళలాడుతోంది. చిన్న నగరాల్లో స్పీడ్... నగరాల్లోని కిక్కిరిసిన ప్రాంతాల్లో డార్క్ స్టోర్ల ఏర్పాటు సవాలుగా మారుతోందని జెప్టో సీఈఓ ఆదిత్ పలీచా చెబుతున్నారు. గత రెండు నెలల్లోనే బిలియన్ డాలర్లను (దాదాపు రూ.8,400 కోట్లు) సమీకరించడంతో కంపెనీ విలువ 5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కాగా, చండీగఢ్, భువనేశ్వర్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో వేగంగా స్థలాలు దొరుకుతుండటంతో అక్కడ విస్తరణ స్పీడ్ పెంచుతున్నామని పలీచా పేర్కొన్నారు. ‘ఈ రంగంలోకి నిధులు పుష్కలంగా వస్తున్నాయని పసిగట్టిన స్థిరాస్తి యజమానులు అద్దెలు భారీగా పెంచేస్తున్నారు.కొన్నిచోట్ల పోటీ కారణంగా బిడ్డింగ్‌లో పాల్గొనాల్సి వస్తోంది’ అని పలీచా వివరించారు. జొమాటో బ్లింకిట్ సైతం భటిండా, హరిద్వార్, విజయవాడ వంటి నగరాల్లో అడుగుపెట్టింది. కస్టమర్లకు వేగంగా సేవలదించేలా డార్క్ స్టోర్ల సైజును కంపెనీలు పెంచుతున్నాయి. గతంలో సగటున 2,500 చదరపు అడుగులున్న ఈ స్టోర్ సైజు 4,000–5,000 చ.అ.కు పెరిగింది. కొన్నిచోట్ల 10,000 చ.అ., మరికొన్ని చోట్ల ఏకంగా 25,000 చ.అ. డార్క్ స్టోర్లు కూడా ఏర్పాటవుతుండటం ఈ రంగంలో జోరుకు నిదర్శనం.‘అమ్మతోడు అరగంటలోపే డెలివరీ చేసేస్తాం’ క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టో స్లోగన్ ఇది! ఇందుకు తగ్గట్టుగానే శరవేగంగా దూసుకెళ్తున్న క్విక్ కామర్స్ రంగంలో కంపెనీలు నువ్వానేనా అనేలా తలపడుతున్నాయి. బంపర్ వేల్యుయేషన్లతో ఈ రంగంలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతుండటంతో సేవలను ‘క్విక్’గా విస్తరించేందుకు పోటీ పడుతున్నాయి. సిబ్బంది నియామకాలతో పాటు డార్క్ స్టోర్ల సంఖ్య, సైజును కూడా భారీగా పెంచుకుంటున్నాయి. దీంతో కస్టమర్లకు మరిన్ని ఉత్పత్తులు లభించడంతో పాటు మరింత వేగంగా సేవలు లభించేందుకు దోహదం చేస్తోంది.రూ. 300-500 : సగటు ఆర్డర్ విలువ (గతంలో ఇది 200–250గా ఉండేది)4,000 చ. అ. : డార్క్ స్టోర్ ప్రస్తుత సగటు సైజు (అంతక్రితం 2,500 స్థాయిలో ఉండేది). కొన్ని ఏరియాల్లో 10,000 చ. అ. స్టోర్లు కూడా ఉన్నాయి.హైరింగ్.. ఫుల్ స్వింగ్ ‘క్విక్’ విస్తరణ నేపథ్యంలో సిబ్బంది డిమాండ్ తారస్థాయికి చేరుకుంది. ‘ఈ రంగంలో అన్ని విభాగాల్లోనూ హైరింగ్ ఫుల్ స్వింగ్‌లో నడుస్తోంది. ఐదు ప్రధాన కంపెనీలు అగ్ర స్థానం కోసం పోటీ పడుతుండటమే దీనికి ప్రధాన కారణం. ప్రధానంగా లాజిస్టిక్స్ ఇక్కడ అత్యంత కీలక పాత్ర పోషిస్తుండటంతో ఇతర కంపెనీల్లోని నిపుణులైన ఉద్యోగులకు గాలం వేస్తున్నాయి’ అని ఒక క్విక్ కామర్స్ సంస్థ చీఫ్ వెల్లడించారు. ‘మినిట్స్’ పేరుతో లేటుగా ఈ విభాగంలోకి అడుగుపెట్టిన ఫ్లిప్‌కార్ట్ కార్యకలాపాల వేగం పెంచేందుకు బిగ్‌బాస్కెట్ వంటి ఇతర కంపెనీల నుంచి చాలా విభాగాల్లో సిబ్బందిని భర్తీ చేసుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క, బిగ్‌బాస్కెట్ సైతం పూర్తి స్థాయి క్విక్ కామర్స్ మోడల్లోకి మారే ప్రయత్నాల్లో ఉండటం విశేషం. ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమితేశ్ ఝా ఇటీవలే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సీఈఓగా చేరారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో పాటు మధ్య స్థాయి మేనేజర్లకు డిమాండ్ నెలకొంది. క్యూ–కామర్స్‌లోని మార్కెటింగ్, ఆపరేషన్స్, సప్లయ్ చైన్, ఫైనాన్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ వలసలు జోరందుకోవడం గమనార్హం. జెప్టో కూడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జొమాటో, స్విగ్లీ, ఓలా, అర్బన్ కంపెనీ తదితర కంపెనీల నుంచి కీలక సిబ్బందిని భారీగా నియమించుకుంటోంది. కంపెనీ ప్రధాన కేంద్రాన్ని బెంగళూరు నుంచి మంబైకి మార్చే సన్నాహాల్లో ఉన్న జెప్టో.. 500 మంది ఎగ్జిక్యూటివ్‌ల వేటలో ఉన్నట్లు పలీచా తెలిపారు. -
జస్ట్ రెండు కుట్టు మిషన్లతో.. ఏకంగా వెయ్యి కోట్ల సామ్రాజ్యం!
మనం మనీష్ మల్హోత్రా, రీతూ కుమార్, సబ్యసాచి ముఖర్జీ, అబు జానీ సందీప్ ఖోస్లా, తరుణ్ తహిలియానీ వంటి అగ్రశేణి ఫ్యాషన్ డిజైనర్ల గురించి విన్నాం. వారికంటే ముందే ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని ఏలి అత్యంత ధనిక ఫ్యాషన్ డిజైనర్ పేరుగాంచిన మహిళ గురించి ఇంతవరకు వినలేదు. జస్ట్ రెండు కుట్టు మిషన్లతో ఏకంగా వెయ్యి కోట్ల ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని సృష్టించి అత్యంత సంపన్న ఫ్యాషన్ డిజైనర్‌గా అవతరించింది. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 270 స్టోర్లతో వందల కోట్ల విలువైన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. అయితే ఆమెను విజయం అంత తేలిగ్గా వరించలేదు. ఎన్నో అవమానాలు, చీత్కారాలు నడుమ నిరాశ నిస్ప్రుహలతో యుద్ధం చేసి విజయతీరాలను అందుకుంది. ఎవరామె అంటే..ఆమె పేరే ది రైజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనర్ అనితా డోంగ్రే. ఆమె అక్టోబర్ 3, 1963న ముంబైలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లి పుష్పా సావ్లానీకి కుట్టు పనిలో అపారమైన ప్రతిభ ఉంది. అదే ఆమెకు సంక్రమించి..ఫ్యాషన్ డిజైన్ పట్ల మక్కువ ఏర్పరుచుకుంది. ఈ రంగంలో తక్కువ భారతీయ రిటైల్ బ్రాండ్లు ఉన్నాయని గ్రహించి..సరసమైన ధరల్లో లభించేలా డిజైనర్‌వేర్‌లను రూపొందించాలని నిర్ణయించుకుంది. అందుకోసం తండ్రి నుంచి కొద్ది మొత్తం రుణం తీసుకుని తన సోదరితో కలిసి పాశ్చాత్య శైలిలో ఉండే దుస్తుల మాదిరిగా డిజైన్ చేయడం ప్రారంభించారు. వాటిని ప్రధాన బ్రాండ్లకు విక్రయించడం ప్రారంభించారు. అయితే ఆ క్రమంలో ఎన్నో మాల్స్‌లోని బ్రాండ్ల నుంచి గట్టి స్థాయిలో తిరస్కరణలు ఎదురయ్యాయి. చాలా ఎదురదెబ్బలు తినాల్సి వచ్చింది. అయినా సరే తగ్గేదే లే అంటూ ఆత్మవిశ్వాసంతో సాగింది. ఇక లాభం లేదని తానే అనితా డోంగ్రే అని తన పేరుతో స్వంత లేబుల్ ప్రారంభించింది. ఇది అనాధికాలంలోనే ప్రసిద్ధ బ్రాండ్‌గా మారింది. 2015లో ఏఎన్డీ పేరుతో డిజైన్లను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత తన కంపెనీని హౌస్ ఆఫ్ అనితా డోంగ్రేగా రీబ్రాండ్ చేసింది. అలా ఏఎన్డీ.. గ్లోబల్ దేశీ, అనితా డోంగ్రే బ్రైడల్ కోచర్, అనితా డోంగ్రే గ్రాస్‌రూట్, అనితా డోంగ్రే పింక్ సిటీ తోసహా పలు విజవంతమైన వెంచర్లతో భారతదేశంపు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరిగా ఆమె ప్రస్థానం సాగింది. అంతేగాక నీతా అంబానీ, రాధిక మర్చంట్, ఇషా అంబానీ, శ్లోకా అంబానీ, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, అలియా భట్, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, అనన్య పాండే వంటి బాలీవుడ్ అగ్ర తారలకు డిజైనర్‌గా మారింది. ఆమె వ్యక్తిగత జీవితం వచ్చేటప్పటికీ..60 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ అనితా వ్యాపారవేత్త ప్రవీణ్ డోండ్రేని వివాహం చేసుకున్నారు. వారికి యష్ డోంగ్రే అనే కుమారుడు ఉన్నాడు. అతడు బెనైషా ఖరాన్ని వివాహం చేసుకున్నాడు. ఆమె కుటుంబ నేపథ్యం గురించి పెద్దగా మీడియాకి తెలియదు ఎందుకంటే ఆమె కుటుంబం హంగు ఆర్భాటాలకు చాలా దూరంగా ఉంది.సంపద పరంగా..భారతదేశంలో ఆమె కంపెనీకి సంబంధించిన 270కి పైగా స్టోర్లు ఉన్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆమె రిటైల్ టర్నోవర్ దాదాపు రూ. 800 కోట్లకు చేరుకుందని అనితా డోంగ్రే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంటే ఆమె ఆదాయం ఇప్పుడు వెయ్యి కోట్లకు మించవ్చని అంచనా. అలాగే ఆమెను ఫోర్బ్స్ భారతదేశంలో అత్యంత ధనిక మహిళా ఫ్యాషన్ డిజైనర్‌గా పేర్కొంది. (చదవండి: 80 ఏళ్ల స్విమ్మర్! ఒకప్పుడు నీళ్లంటే చచ్చేంత భయం..కానీ..!) -
పండుగ డిమాండ్..లక్షల్లో గిగ్ జాబ్స్!
రాబోయే పండుగ సీజన్ కోసం కొలువుల సైరన్ మోగింది. కస్టమర్ల నుంచి అంచనాలను మించి డిమాండ్ ఉంటుందనే లెక్కలతో కంపెనీలు తాత్కాలిక ఉద్యోగుల (గిగ్ వర్కర్లు)లను పొలోమంటూ నియమించుకుంటున్నాయి. దీంతో గిగ్ హైరింగ్ ఫుల్ స్వింగ్‌లో ఉంటుందనేది హైరింగ్ ఏజెన్సీల మాట! – సాక్షి, బిజినెస్ డెస్క్పండుగల పుణ్యామా అని తాత్కాలిక హైరింగ్ జోరందుకుంటోంది. పరిశ్రమలవ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు 7 లక్షల గిగ్ వర్కర్లకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయని అంచనా. గతేడాది పండుగ సీజన్‌తో పోలిస్తే ఇది 15–20 శాతం అధికం కావడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థ ప్రగతి పథంలో దూసుకెళ్తుండటం.. స్టాక్ మార్కెట్లు కూడా మాంచి జోరుమీదుండటంతో వినియోగదారులు పండుగల్లో ఈసారి కొనుగోళ్లకు క్యూ కడతారని కంపెనీలు భావిస్తున్నాయి.పంట దిగుబడులు మెరుగ్గా ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో గ్రామీణ డిమాండ్ కూడా దన్నుగా నిలుస్తుందని లెక్కలేస్తున్నాయి. వెరసి పండుగ అమ్మకాల కోసం కీలక పరిశ్రమలు తాత్కాలిక కొలువులతో రెడీ అవుతున్నాయని క్వెస్, ర్యాండ్ స్టాడ్, అడెకో, సీఈఐఎల్, హెచ్ఆర్ సరీ్వసెస్, టీమ్‌లీజ్ సరీ్వసెస్ తదితర హైరింగ్ సంస్థలు చెబుతున్నాయి.ఈ రంగాల్లో జోష్... రాఖీ పౌర్ణమితో మొదలయ్యే పండుగ సీజన్.. కేరళ ఓనమ్, వినాయక చవితి, దసరా, దీపావళి, చివర్లో క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలతో ముగుస్తుంది. దీంతో ఈకామర్స్ సంస్థలు, రిటైల్ స్టోర్లు రకరకాల ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు గట్టిగానే ప్లాన్లు వేస్తున్నాయి. ఫుల్ డిమాండ్ ఉంటుందనన్న అంచనాలతో ఈ–కామర్స్, లాజిస్టిక్స్ కంపెనీలు తాత్కాలిక హైరింగ్‌కు గేట్లెత్తాయి. ఈ రెండు రంగాల గిగ్ నియామకాల వృద్ధి 30–35 శాతం ఉంటుందని భావిస్తున్నారు. మరోపక్క, కన్జూమర్, బ్యాంకింగ్–ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), రిటైల్, తయారీ, పర్యాటకం–ఆతిథ్య రంగాలు కూడా పటిష్టమైన డిమాండ్‌ను అంచనా వేస్తున్నాయి. ‘పండుగ హైరింగ్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది.సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్, మండుటెండల ప్రభావంతో ప్రజలు తమ కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. దీంతో, పండుగల్లో దండిగానే ఖర్చు చేసే అవకాశం మెండుగా ఉంది. అన్ని రంగాల్లోనూ కలిపి 6 లక్షల నుంచి 7 లక్షల మేర తాత్కాలిక ఉద్యోగాలు వెల్లువెత్తొచ్చని భావిస్తున్నాం’ అని క్వెస్ కార్ప్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా పేర్కొన్నారు. కన్జూమర్ డ్యూరబుల్స్/గూడ్స్ కంపెనీలు కొత్త ఉత్పత్తులతో పండుగ షాపింగ్‌కు కొత్త కళ తీసుకొస్తున్నాయి. మరోపక్క, బ్యాంకులు/ఎన్బీఎఫ్సీలు సైతం లోన్లు, క్రెడిట్ కార్డుల జారీపై మరింత దృష్టి సారిస్తున్నాయి. రిటైల్ స్టోర్లలో తాత్కాలిక ఉద్యోగులను పెంచుకోవడం ద్వారా మరింత వ్యాపారాన్ని చేజిక్కించుకోవాలనేది వాటి ప్లాన్. దేశంలోని చాలా కంపెనీల వార్షిక వ్యాపారంలో మూడింట రెండొంతులు ఆగస్ట్ నుంచి డిసెంబర్ మధ్యే జరుగుతుందని అంచనా.చిన్న నగరాల్లో మరింత అధికంపట్టణీకరణ శరవేగంగా పెరుగుతుండటం, మాల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీ సంస్కృతి విస్తరిస్తుండటం.. వినియోగదారుల ఖర్చు కూడా పుంజుకోవడంతో చిన్న నగరాల్లో కూడా గిగ్ వర్కర్లకు మరింత డిమాండ్ జోరందుకుంది. ‘ముఖ్యంగా గౌహతి, బరోడా, జామ్‌నగర్, వైజాగ్, కటక్, జైపూర్, ఇండోర్, అహ్మదాబాద్, కోయంబత్తూరు, లక్నో, సూరత్, భువనేశ్వర్, భోపాల్, లూధియానా, చండీగఢ్ వంటి పలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు తాత్కాలిక ఉద్యోగులకు హాట్ స్పాట్లుగా నిలుస్తున్నాయి. గత సీజన్‌తో పోలిస్తే ఇక్కడ గిగ్ వర్కర్ల డిమాండ్‌లో 25–30 శాతం వృద్ధి కనిపిస్తోంది.పికర్లు, ప్యాకర్లు, వేర్‌హౌసింగ్ స్టాక్ నిర్వహణ ఉద్యోగులు, డెలివరీ సిబ్బంది, షాప్‌లలో, ఫీల్డ్‌లో ఉత్పత్తులను ప్రదర్శించే సేల్స్ పర్సన్ల వెంటపడుతున్నాయి కంపెనీలు’ అని హైరింగ్ సంస్థ అడెకో డైరెక్టర్ మను సైగల్ పేర్కొన్నారు. పండుగల్లో ఆఫర్ల జోరు నేపథ్యంలో ఈ–కామర్స్ రంగానికి సంబంధించిన డెలివరీ సిబ్బంది, కస్టమర్ సరీ్వస్ ప్రతినిధులు, ప్యాకేజింగ్, లేబులింగ్, క్వాలిటీ కంట్రోల్, ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్ సిబ్బంది నియామకాలు జోరందుకున్నాయని టీమ్‌లీజ్ సరీ్వసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బాలసుబ్రమణియన్ తెలిపారు. -
ఆ 84 సీట్లు కీలకం.. గతంలో 56 బీజేపీకే.. మరి ఇప్పుడు.. స్వింగ్ ఎటో?
కిత్తూరు కర్ణాటకలో (గతంలో ముంబై కర్ణాటక) రాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే అదే పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న సెంటిమెంట్ ఉంది. 1957 సంవత్సరం నుంచి రాన్ నియోజకవర్గం ప్రజలు అధికారంలోకి వచ్చే పార్టీ అభ్యర్థినే ఎన్నుకుంటూ వస్తున్నారు. ఒకే పార్టీని వరుసగా రెండుసార్లు గెలిపించే సంప్రదాయం ఇక్కడ లేదు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ఇలా ఓటరు తీర్పు తిరగరాసే నియోజకవర్గాలు రాన్తో సహా 84 ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా పనిచేస్తుందని, అందుకే ఏ పార్టీ కూడా రెండోసారి గెలవడం కష్టంగా మారిందని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఎ. నారాయణ అభిప్రాయపడ్డారు. 2018 : స్వింగ్ స్థానాల్లో బీజేపీ స్వీప్ ► లింగాయత్‌లకు గట్టి పట్టున్న ముంబై కర్ణాటక ప్రాంతంలో 19 స్వింగ్ సీట్లున్నాయి. 2013 ఎన్నికల్లో బీజేపీ ఈ స్థానాలన్నింటిలోనూ విజయం సాధించింది ► సెంట్రల్ కర్ణాటకలో 20 స్వింగ్ సీట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో లింగాయత్, వొక్కలిగలు పట్టుంది. గత ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 16 స్థానాల్లో నెగ్గింది. ► బీజేపీకి కంచుకోటగా భావించే కోస్తా కర్ణాటకలో అత్యధిక స్థానాలు స్వింగ్ సీట్లుగా పేరొందాయి. ఈ ప్రాంతంలో 19 స్థానాలకు గానే 10 స్వింగ్ సీట్లుగా ఉన్నాయి. 2018 ఎన్నికల్లో అన్ని స్వింగ్ స్థానాలను బీజేపీ స్వీప్ చేసింది. 20% మంది ముస్లిం జనాభా ఉన్న ఈ ప్రాంతంలో విభజన రాజకీయాలే కీలకం. ► హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో 12 స్వింగ్ సీట్లు బీజేపీ ౖMðవశం చేసుకుంది. రాష్ట్రంలో ఈ ప్రాంతం అత్యంత వెనుకబడి ఉంది. ► దక్షిణ కర్ణాటకలో మొత్తం స్థానాలు 46 కాగా అందులో స్వింగ్ సీట్లు 14 ఉన్నాయి. వొక్కలిగల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో జేడీ (ఎస్) సగం స్వింగ్ స్థానాలైన ఏడింటిలో విజయం సాధించింది. బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు స్థానాలను దక్కించుకున్నాయి. ► బెంగళూరు నగరంలో రెండు స్వింగ్ సీట్లు బీజేపీ ఖాతాలోకే వెళ్లాయి. స్వింగ్ స్థానాల్లో పట్టుకు బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలు లింగాయత్‌లకు పట్టున్న స్థానాలు, మత విభజన రాజకీయాలకు కేంద్రమైన కోస్తా కర్ణాటకలో 2018 ఎన్నికల్లో బీజేపీ స్వింగ్ స్థానాలన్నింటినీ స్వీప్ చేసింది. మొత్తం 84 స్వింగ్ స్థానాలకు గాను బీజేపీ ఖాతాలో 56 ఉన్నాయి. దశాబ్దాల గణాంకాలను పరిశీలిస్తే ఈ స్థానాల్లో బీజేపీ నెగ్గే అవకాశాలు లేవు. అందుకే బీజేపీ ఎన్నికలకు చాలా రోజుల ముందు నుంచి ఈ స్థానాలపై దృష్టి సారించింది. వీటిలో 30 స్థానాల్లో లింగాయత్‌లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. లింగాయత్‌లు బీజేపీ వైపు నిలుస్తూ ఉండడంతో ఆ స్థానాలు తిరిగి నిలబెట్టుకోగలమన్న కమలదళం ధీమాగా ఉంది. అధికార వ్యతిరేకత, బొమ్మై ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, ముస్లింలకు 4 శాతం కోటాలో కోత, పెరిగిపోతున్న ధరలు వంటివన్నీ బీజేపీకి మైనస్‌గా మారాయి. వీటన్నింటినీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌తో కప్పిపుచ్చే వ్యూహాలు రచిస్తోంది. అంతే కాకుండా చాలా నియోజకవర్గాల్లో కొత్త ముఖాలకు టికెట్లు ఇచ్చింది. తద్వారా అధికార వ్యతిరేకతను అధిగమించవచ్చునని వ్యూహరచన చేసింది. అయితే మోదీ ఇమేజ్ అసెంబ్లీ ఎన్నికలకు పని చేసే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘‘నరేంద్ర మోదీ పట్ల ప్రజల్లో ఎంతో ఆకర్షణ ఉన్నప్పటికీ ఆయనను స్థానికుడిగా చూడలేరు. పార్లమెంటు ఎన్నికల్లో ఆయన ఇమేజ్ పని చేస్తుందే తప్ప శాసనసభ ఎన్నికల్లో పని చేసే అవకాశం లేదు’’ అని ఎన్నికల విశ్లేషకుడు చేతన్ చౌహాన్ పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాల్లో పాగా వెయ్యడానికి పకడ్బందీ వ్యూహాలనే రచించింది. స్థానికంగా బలంగా ఉన్న అభ్యర్థుల్ని ఎంపిక చేయడంతో పాటు మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ రాకతో లింగాయత్ ఓటు బ్యాంకును కొంతవరకైనా కొల్లగొట్టవచ్చునన్న ఆశగా ఉంది. ఇక బసవరాజ్ బొమ్మై అవినీతి, ముస్లిం కోటా రద్దుని ప్రధాన ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది. సిద్దరామయ్య, డి.కె.శివకుమార్ వంటి బలమైన నాయకులు ఉన్నప్పటికీ పార్టీలో అంతర్గత పోరు ఆ పార్టీకి మైనస్‌గా మారింది. ఫలితంగా ఈ 84 సీట్లలోనూ హోరాహోరీ పోరు నెలకొంది. ఇక 224 స్థానాలకు గాను 60 సీట్లు సేఫ్ సీట్లుగా ఉన్నాయి. గత మూడు ఎన్నికల్లో వరుసగా ఒకే పార్టీ గెలుస్తూ వచ్చింది. ఈ సేఫ్ సీట్లు కాంగ్రెస్‌కి 27, బీజేపీకి 23, జేడీ(ఎస్)కి 10 ఉన్నాయి. ఈ సీట్లను కాపాడుకోవడానికి కూడా రెండు పార్టీలు సర్వశక్తులూ ఒడ్డవల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వైరల్ వీడియో : పాములా స్వింగ్ తిరుగుతున్న పిల్లి..!
-
Viral Video: హుషారుగా ఉయ్యాల ఊగుతున్న 80 ఏళ్ల బామ్మ
-
ఢిల్లీ లిక్కర్ స్కాం లో విచారణ ముమ్మరం
-
‘మనాలీ స్వింగ్’.. ‘మహా ఊయల’తో పర్యటకులకు వింత అనుభూతి
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రఖ్యాత పర్యాటక ప్రదేశమైన మనాలీకి ఏటా వేలాది మంది టూరిస్టులు వెళ్తుంటారు. ఈ క్రమంలో పర్యటకులకు వినూత్న అనుభూతిని అందించేందుకు సిద్ధమైంది అక్కడి అంకుర సంస్థ. ఎత్తయిన ప్రాంతంలో గాలిలో ఊగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే మహా ఊయల (జెయింట్ స్వింగ్) జనవరి నాటికి అందుబాటులోకి తీసుకురానుంది. కృత్రిమ మేథ (ఏఐ)తో పనిచేసే ఈ జెయింట్ స్వింగ్‌ను ఐఐటీ మండీ వద్ద ఏర్పాటైన ‘మనాలీ స్వింగ్’ అంకుర సంస్థ రూపొందించింది. ప్రపంచంలోనే ఇలాంటి తరహా ఊయల ఇదే మొదటిదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పర్వతారోహణపై ఆసక్తి ఉండి, సాహసాలను ఇష్టపడే నలుగురు ఇంజినీరింగ్ మిత్రులు ఈ అంకుర సంస్థను స్థాపించారు. ఈ ఊయల ఆకృతి, కాన్సెప్టులపై 5 పేటెంట్లు పొందేందుకు అవసరమైన ప్రక్రియను కూడా వీరు ప్రారంభించారు. దుబాయ్, స్విట్జర్లాండ్ ప్రాంతాల్లో దీని ఏర్పాటుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. పర్యాటకులు రూ.3,000 చెల్లిస్తే.. రవాణా ఛార్జీలు, ఫొటో, వీడియోలకు అయ్యే ఖర్చులన్నీ అందులో కలిసే ఉంటాయని తెలిపారు. -
పెళ్లి వేడుకలో ఊహించని ఘటన.. బొక్కబోర్లా పడ్డ వధూవరులు.. వైరల్ అవుతున్న వీడియో..
రాయ్‌పూర్: వివాహం అనేది ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడానికి వేసే తొలి అడుగు. కష్టాల్లోనూ, సుఖాల్లోనూ ఒకరిఒకరం తోడుంటామని చేసే వాగ్ధానం. తమ పద్దతులకు, ఆచారాలకు అనుగుణంగా జరుపుకునే వేడుక. ప్రతీ జంట తమ పెళ్లిని ఓ పండుగలా, వినూత్నంగా జరుపుకోవాలని అనుకుంటారు. ఎవరి ఇష్టాలు, స్థాయిలను బట్టి వివాహ వేడుకలను నిర్వహిస్తారు. కొందరైతే పెళ్లి కోసం ఏకంగా ఈవెంట్ మేనేజర్లను నియమించుకుంటారు. ఇందులో భాగంగా హల్దీ వేడుకలు, సంగీత్, వధువరుల డ్రెస్సింగ్, పెళ్లి వేదికపై ఎంట్రీ, రిసెప్షన్ ఇలా అన్నింటికీ వినూత్నంగా రూపొందిస్తారు. గాల్లో ఊయల ఏర్పాటు చేయడం, రథాల్లో తీసుకురావడం, పల్లికిలో వధువును తీసుకురావడం కూడా చేస్తారు. అయితే తాజాగా ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఆదివారం ఎంతో వైభవంగా జరిగిన ఒక పెళ్లిలో వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. వేదిక చుట్టూ ఒకవైపు డ్యాన్సులు, మరోవైపు విద్యుత్త్ కాంతులతో మెరిసిపోతుంది. అప్పుడే బాణసంచా వెలుగులు మధ్య అందంగా అలంకరించిన ఓ ఊయలపై వధూవరులు ఎక్కారు. చదవండి: 77 ఏళ్ల వయసు ... స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్! అయినా ఐస్ స్కేటింగ్ చేశాడు!! అది మెల్లగా పైకి లేవడంతో ఉన్నట్టుండి ఊయలకు ఉన్న ఒకవైపు తాడు తెగిపోవడంతో 12 అడుగుల ఎత్తు నుంచి వధువరులు కిందపడ్డారు. దీంతో పెళ్లి హాజరైన వారంతా ఒక్కసారిగా కంగారు పడ్డారు. వధూవరులను రక్షించేందకు వేదిక వద్దకు కొందరు పరుగుల పెట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ బాధ్యత వహించి క్షమాపణలు చెప్పింది. కాగా ఈ దృశ్యాలను కొందరు మొబైల్స్‌లో చిత్రీకరించగా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. దీనిని చూసిన నెటిజన్లు వధూవరుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇలాంటి సాహసాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. చదవండి: ఏకంగా పది కరోనా వ్యాక్సిన్లు వేయించుకున్న మహానుభావుడు! Unfortunate accident at Raipur Wedding yesterday. Thank God all are safe. source : https://t.co/yal9Wzqt2f pic.twitter.com/ehgu4PTO8f — Amandeep Singh 💙 (@amandeep14) December 12, 2021 -
ఎంత మంచి మనసో: రూ. 2 కోట్ల ఇంటిని కేవలం రూ. 100కే అమ్మకం
లండన్: సాటి మనుషి కష్టంలో ఉంటే స్పందించే గుణం చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి వారు కుటుంబాన్ని, సమాజాన్ని సమానంగా ప్రేమిస్తారు. జగమంత కుటుంబం వారి సిద్దాంతం. ఈ కోవకు చెందిన దంపతుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్నాం. వారిది ఎంత మంచి మనసు అంటే.. మానసిక వికలాంగ పిల్లల కోసం రెండు కోట్ల రూపాయలు ఖరీదు చేసే వారి ఇంటిని అమ్మకానికి పెట్టారు. అది కూడా కేవలం వంద రూపాయలకు మాత్రమే. మంచి పని కోసం చేస్తున్నప్పుడు ఇంత తక్కువ ఖరీదు ఎందుకంటే.. అక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదేంటో తెలియాలంటే ఇది చదవండి యూకేకి చెందిన ఆడమ్ త్వైట్స్, అతని భార్య లిజ్, కుమార్తె ఎమిలీతో కలిసి సౌత్ టైన్‌సైడ్, ఇంగ్లండ్‌లో నివసిస్తున్నారు. లిజ్.. గ్రేస్ హౌస్ అనే చారిటీ సంస్థలో పని చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు వారి పనులు వారు చేసుకునేలా శిక్షణ ఇవ్వడం, అలాంటి పిల్లలతో ఎలా మసులుకోవాలనే గురించి వారి కుటుంబ సభ్యులకు ట్రైనింగ్ ఇవ్వడం, వారి కోసం కొన్ని రకాల గేమ్స్ రూపొందించి.. పిల్లలు వాటిలో పాల్గొనేలా చేయడం, ఇతర యాక్టీవిటీలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. (చదవండి: సంచలన కేసు.. ఆ డాక్టర్ వల్లే మా అమ్మ నన్ను లోపంతో కనింది) ఈ క్రమంలో ఓ సారి ఆడమ్, తన భార్య లీజ్ కోసం గ్రేస్ హౌస్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ రిజిస్టర్డ్ మేనేజర్ని వీల్‌చైర్ యాక్సెస్ చేయగల ఊయల అవసరం గురించి అడిగాడు. దాని ధర 13 వేల పౌండ్లు (12,98,074.18 రూపాయలు) అని తెలిసి ఆశ్చర్యపోయాడు. తమ కుమార్తె ఎమిలీకి కూడా ఊయల అంటే చాలా ఇష్టం అని ఆడమ్ గుర్తు చేసుకున్నాడు. అయితే ఎమిలీలానే అందరి పిల్లలకు ఊయల ఊగే అవకాశం లేకపోవడం అతడిని కలచి వేసింది. ( ప్రతీకాత్మక చిత్రం) దాని గురించే ఆలోచిస్తున్న ఆడమ్‌కు ఓ ఆలోచన వచ్చింది. దాని గురించి భార్యకు చెప్పాడు. ఆమె కూడా అంగీకరించింది. ఈ క్రమంలో ఆ దంపతులు రెండు కోట్ల రూపాయలు ఖరీదు చేసే వారి ఇంటిని కేవలం వంద రూపాయలకే అమ్మాలని నిర్ణయించారు. మూడు బెడ్రూంలు, లివింగ్ రూం, కార్ పార్కింగ్, గార్డెన్ సదుపాయలు గల ఇంటిని వంద రూపాయలకే అమ్మకానికి పెట్టారు. (చదవండి: ఇల్లు కోసం కొనలేదు.. హెరిటేజ్ ప్రాపర్టీగా!) కాకపోతే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. ఇంటిని అమ్మడం కోసం ఆడమ్ దంపతులు 100 రూపాయలు ఖరీదు చేసే 2 లక్షల టికెట్లు ముద్రించారు. అంటే మరోరకంగా చెప్పాలంటే.. తమ ఇంటిని వారు వంద రూపాయలు విలువ చేసే లాటరీ టికెట్‌గా మార్చారు. అలా 2 లక్షల టికెట్లను ప్రింట్ చేసి అమ్మసాగారు. అంటే రెండు లక్షల మంది ఈ టికెట్లను కొంటే ఒక్క లక్కీ విన్నర్‌కి.. ఇల్లు సొంతమవతుంది అన్నమాట. అయితే ఇంటిని ఇలా అమ్మడం వెనక ఆడమ్ దంపతుల మంచి మనసు గురించి తెలుసుకున్న జనాలు.. టికెట్ కొనడం కోసం ఎగబడ్డారు. అంతేకాక వారి మంచి మనసును ప్రశంసిస్తున్నారు. చదవండి: ఆ సిటీలో పొగ బండ్లకి ప్రత్యేక పన్ను! బెంబేలెత్తున్న వాహనదారులు -
సరదా తీర్చిన ఉయ్యాల.. పట్టు తప్పి 6300 అడుగుల లోయలో!
ప్రతి ఒక్కరూ తమ చిన్నతనంలో ఏదో ఒక సందర్భంలో ఉయ్యాల ఊగే ఉంటారు. ఇంట్లో, పొలాల వద్ద, చెట్టుకు తాడు కట్టుకొని ఉయ్యాల ఊగూతుంటే మహా సరాదాగా ఉండేంది. ఒక్కసారి ఉయ్యాలపై కూర్చొని ఊగుతుంటే వయసుని మర్చిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే అదే ఉయ్యాల సరదా తాజాగా ఇద్దరు యువతుల ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఉయ్యాలపై జాలీగా గడిపేందుకు వచ్చిన ఇద్దరు యువతులు మృత్యువు అంచుల దాకా వెళ్లొచ్చారు. కొండ అంచు శిఖరం మీద ఏర్పాటు చేసిన ఉయ్యాలను ఊగితే చాలా థ్రిల్‌గా ఉంటుందని భావించారు ఇద్దరు యువతులు. కానీ చివరికి వాళ్లు ఊహించని విధంగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన రష్యాలోని డగేస్టన్‌లో చోటుచేసుకుంది. సులాక్ కాన్యాన్ ప్రాంతంలో పర్యాటకుల కోసం కొండ అంచున ఒక ఉయ్యాలను అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో పర్యాటకులు ఉయ్యాలలో కూర్చొని సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. అయితే ఉయ్యాల వద్ద భద్రత సరిగా లేదని అక్కడి ప్రభుత్వం హెచ్చరించిన అధికారులు పట్టించుకోలేదు. ఇదే క్రమంలో తాజాగా ఓ ఇద్దరు యువతులు ఉయ్యాల ఎక్కి చక్కగా ఊగుతున్న సమయంలో లోతును చూసి ఒక్కసారిగా భయపడ్డారు. దీంతో ఉయ్యాల కదులుతుండగానే దాని నుంచి హడావిడిగా దిగేందుకు ప్రయత్నించారు. ఇంకేముంది సరాసరి ఉయ్యాల పక్కన ఉన్న 6300 అడుగుల లోయలోకి పడిపోయారు. అయితే, వారు కొండ అంచున ఏర్పాటు చేసిన డెక్కింగ్ ప్లాట్‌ఫాం మీద పడటంతో ప్రాణాలు దక్కాయి. ఆ ఉయ్యాల ఇంకాస్త వేగంగా ఊగి ఉంటే ఖచ్చితంగా వాళ్లు నేరుగా లోయలో పడిపోయేవారు. కాగా ఈ ప్రమాదంలో వారికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను చూస్తే మీరు కూడా హడలిపోతారు. ఇక ఈ ఘటన అనంతరం ఇద్దరు యువుతులు ఇక తమ జీవితంలో ఉయ్యాల ఎక్కేందుకు సాహసించరేమో.. Moment two women fell off a 6000-Ft cliff swing over the Sulak Canyon in Dagestan, Russia. Both women landed on a narrow decking platform under the edge of the cliff & miraculously survived with minor scratches. Police have launched an investigation. pic.twitter.com/oIO9Cfk0Bx — UncleRandom (@Random_Uncle_UK) July 14, 2021 -
ఉల్లాసంగా ఊయలలూగి..
పిట్టలవానిపాలెం: అట్లతద్దె పండుగను పురస్కరించుకొని మండలానికి చెందిన యువతులు మంగళవారం ఘనంగా జరుపుకొన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది వివాహం అయిన మహిళలకు తమ పుట్టింటి వద్ద అట్లతద్దె పండుగను పురస్కరించుకొని వాయినాలు తీర్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. వాయినాలకు ముందు మహిళలు ఉపవాసం ఉండి గౌరి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 11 రకాల పూలతో అమ్మవారికి అభిషేకం చేసిన అనంతరం గ్రామపెద్దల సమక్షంలో వాయినాలు తీర్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘ఇచ్చితినమ్మా వాయినం... పుచ్చుకుంటినమ్మా..’ వాయినం అంటూ మహిళలు, ముతైదువలు వాయినాలు తీర్చుకోవడంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. అదేవిధంగా అట్లతద్దె సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉయ్యాలలు ఏర్పాటుచేసి మహిళలను ఊపటం గ్రామస్తుల ఆచారం. సంప్రదాయాన్ని మరువరాదనే ఉద్దేశంతో ప్రధానంగా మండలంలోని కొత్తపాలెం శివారు పరిశవారిపాలెం, ఖాజీపాలెం శివారు కప్పలవారిపాలెంలో గ్రామాలలో గ్రామస్తులు తాడిచెట్లకు ఉయ్యాల ఏర్పాటు చేశారు. -
ఫ్లీట్ రివ్యూకు ఏర్పాట్లు
-
చనిపోయిన కొడుకును.. రాత్రంతా ఉయ్యాలలో ఊపింది!
జీవనజ్యోతి సినిమాలో వాణిశ్రీ ఒక బొమ్మను పట్టుకుని.. 'ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు.. సద్దు చేశాడంటే ఉలికులికి పడతాడు' అని పాట పాడుతుంది. అమెరికాలోని మేరీలాండ్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. అక్కడ పార్కులో ఓ మహిళ తన మూడేళ్ల కొడుకు అప్పటికే చనిపోయినా.. అతడిని ఉయ్యాలలో పెట్టి ఊపుతూ కనిపించింది. మేరీలాండ్‌లోని విల్స్ స్మారక పార్కులో ఆమె కనిపించింది. బహుశా రాత్రంతా కూడా ఆమె తన కొడుకు మృతదేహంతో పార్కులోనే ఉండి ఉంటుందని పోలీసులు అంటున్నారు. పిల్లవాడి శరీరం మీద ఎలాంటి గాయాలు లేవు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. చాలా ఎక్కువ సేపు ఆమె పిల్లాడిని ఊపుతుండటం చూసి కొంతంమది అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను ఉదయం 6.55 గంటలకు చూశామని కొందరు చెప్పగా, మరికొందరు ముందురోజే చూశామన్నారు. తీరా పోలీసులు వెళ్లి చూస్తే.. ఆ పిల్లాడు అప్పటికే చనిపోయి ఉన్నాడు. ఆ తల్లిని కూడా వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.