చనిపోయిన కొడుకును.. రాత్రంతా ఉయ్యాలలో ఊపింది! | woman found swinging dead son all the night | Sakshi
Sakshi News home page

చనిపోయిన కొడుకును.. రాత్రంతా ఉయ్యాలలో ఊపింది!

Published Sat, May 23 2015 5:01 PM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM

చనిపోయిన కొడుకును.. రాత్రంతా ఉయ్యాలలో ఊపింది!

చనిపోయిన కొడుకును.. రాత్రంతా ఉయ్యాలలో ఊపింది!

జీవనజ్యోతి సినిమాలో వాణిశ్రీ ఒక బొమ్మను పట్టుకుని.. 'ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు.. సద్దు చేశాడంటే ఉలికులికి పడతాడు' అని పాట పాడుతుంది. అమెరికాలోని మేరీలాండ్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. అక్కడ పార్కులో ఓ మహిళ తన మూడేళ్ల కొడుకు అప్పటికే చనిపోయినా.. అతడిని ఉయ్యాలలో పెట్టి ఊపుతూ కనిపించింది. మేరీలాండ్లోని విల్స్ స్మారక పార్కులో ఆమె కనిపించింది. బహుశా రాత్రంతా కూడా ఆమె తన కొడుకు మృతదేహంతో పార్కులోనే ఉండి ఉంటుందని పోలీసులు అంటున్నారు.

పిల్లవాడి శరీరం మీద ఎలాంటి గాయాలు లేవు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. చాలా ఎక్కువ సేపు ఆమె పిల్లాడిని ఊపుతుండటం చూసి కొంతంమది అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను ఉదయం 6.55 గంటలకు చూశామని కొందరు చెప్పగా, మరికొందరు ముందురోజే చూశామన్నారు. తీరా పోలీసులు వెళ్లి చూస్తే.. ఆ పిల్లాడు అప్పటికే చనిపోయి ఉన్నాడు.  ఆ తల్లిని కూడా వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement