మనం మనీష్ మల్హోత్రా, రీతూ కుమార్, సబ్యసాచి ముఖర్జీ, అబు జానీ సందీప్ ఖోస్లా, తరుణ్ తహిలియానీ వంటి అగ్రశేణి ఫ్యాషన్ డిజైనర్‌ల గురించి విన్నాం. వారికంటే ముందే ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని ఏలి అత్యంత ధనిక ఫ్యాషన్ డిజైనర్ పేరుగాంచిన మహిళ గురించి ఇంతవరకు వినలేదు. జస్ట్ రెండు కుట్టు మిషన్లతో ఏకంగా వెయ్యి కోట్ల ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని సృష్టించి అత్యంత సంపన్న ఫ్యాషన్ డిజైనర్‌గా అవతరించింది. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 270 స్టోర్లతో వందల కోట్ల విలువైన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. అయితే ఆమెను విజయం అంత తేలిగ్గా వరించలేదు. ఎన్నో అవమానాలు, చీత్కారాలు నడుమ నిరాశ నిస్ప్రుహలతో యుద్ధం చేసి విజయతీరాలను అందుకుంది. ఎవరామె అంటే..
ఆమె పేరే ది రైజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనర్ అనితా డోంగ్రే. ఆమె అక్టోబర్ 3, 1963న ముంబైలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లి పుష్పా సావ్లానీకి కుట్టు పనిలో అపారమైన ప్రతిభ ఉంది. అదే ఆమెకు సంక్రమించి..ఫ్యాషన్ డిజైన్ పట్ల మక్కువ ఏర్పరుచుకుంది. ఈ రంగంలో తక్కువ భారతీయ రిటైల్ బ్రాండ్లు ఉన్నాయని గ్రహించి..సరసమైన ధరల్లో లభించేలా డిజైనర్‌వేర్‌లను రూపొందించాలని నిర్ణయించుకుంది.
అందుకోసం తండ్రి నుంచి కొద్ది మొత్తం రుణం తీసుకుని తన సోదరితో కలిసి పాశ్చాత్య శైలిలో ఉండే దుస్తుల మాదిరిగా డిజైన్ చేయడం ప్రారంభించారు. వాటిని ప్రధాన బ్రాండ్‌లకు విక్రయించడం ప్రారంభించారు. అయితే ఆ క్రమంలో ఎన్నో మాల్స్‌లోని బ్రాండ్‌ల నుంచి గట్టి స్థాయిలో తిరస్కరణలు ఎదురయ్యాయి. చాలా ఎదురదెబ్బలు తినాల్సి వచ్చింది. అయినా సరే తగ్గేదే లే అంటూ ఆత్మవిశ్వాసంతో సాగింది. ఇక లాభం లేదని తానే అనితా డోంగ్రే అని తన పేరుతో స్వంత లేబుల్ ప్రారంభించింది. ఇది అనాధికాలంలోనే ప్రసిద్ధ బ్రాండ్‌గా మారింది.
2015లో ఏఎన్‌డీ పేరుతో డిజైన్‌లను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత తన కంపెనీని హౌస్ ఆఫ్ అనితా డోంగ్రేగా రీబ్రాండ్ చేసింది. అలా ఏఎన్‌డీ.. గ్లోబల్ దేశీ, అనితా డోంగ్రే బ్రైడల్ కోచర్, అనితా డోంగ్రే గ్రాస్‌రూట్, అనితా డోంగ్రే పింక్ సిటీ తోసహా పలు విజవంతమైన వెంచర్‌లతో భారతదేశంపు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్యాషన్ డిజైనర్‌లలో ఒకరిగా ఆమె ప్రస్థానం సాగింది. అంతేగాక నీతా అంబానీ, రాధిక మర్చంట్, ఇషా అంబానీ, శ్లోకా అంబానీ, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, అలియా భట్, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, అనన్య పాండే వంటి బాలీవుడ్ అగ్ర తారలకు డిజైనర్‌గా మారింది.
ఆమె వ్యక్తిగత జీవితం వచ్చేటప్పటికీ..60 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ అనితా వ్యాపారవేత్త ప్రవీణ్ డోండ్రేని వివాహం చేసుకున్నారు. వారికి యష్ డోంగ్రే అనే కుమారుడు ఉన్నాడు. అతడు బెనైషా ఖరాన్‌ని వివాహం చేసుకున్నాడు. ఆమె కుటుంబ నేపథ్యం గురించి పెద్దగా మీడియాకి తెలియదు ఎందుకంటే ఆమె కుటుంబం హంగు ఆర్భాటాలకు చాలా దూరంగా ఉంది.
సంపద పరంగా..
భారతదేశంలో ఆమె కంపెనీకి సంబంధించిన 270కి పైగా స్టోర్‌లు ఉన్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆమె రిటైల్ టర్నోవర్ దాదాపు రూ. 800 కోట్లకు చేరుకుందని అనితా డోంగ్రే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంటే ఆమె ఆదాయం ఇప్పుడు వెయ్యి కోట్లకు మించవ్చని అంచనా. అలాగే ఆమెను ఫోర్బ్స్ భారతదేశంలో అత్యంత ధనిక మహిళా ఫ్యాషన్ డిజైనర్‌గా పేర్కొంది.
(చదవండి: 80 ఏళ్ల స్విమ్మర్! ఒకప్పుడు నీళ్లంటే చచ్చేంత భయం..కానీ..!)
Comments
Please login to add a commentAdd a comment