లండన్: సాటి మనుషి కష్టంలో ఉంటే స్పందించే గుణం చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి వారు కుటుంబాన్ని, సమాజాన్ని సమానంగా ప్రేమిస్తారు. జగమంత కుటుంబం వారి సిద్దాంతం. ఈ కోవకు చెందిన దంపతుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్నాం. వారిది ఎంత మంచి మనసు అంటే.. మానసిక వికలాంగ పిల్లల కోసం రెండు కోట్ల రూపాయలు ఖరీదు చేసే వారి ఇంటిని అమ్మకానికి పెట్టారు. అది కూడా కేవలం వంద రూపాయలకు మాత్రమే. మంచి పని కోసం చేస్తున్నప్పుడు ఇంత తక్కువ ఖరీదు ఎందుకంటే.. అక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదేంటో తెలియాలంటే ఇది చదవండి
యూకేకి చెందిన ఆడమ్ త్వైట్స్, అతని భార్య లిజ్, కుమార్తె ఎమిలీతో కలిసి సౌత్ టైన్‌సైడ్, ఇంగ్లండ్‌లో నివసిస్తున్నారు. లిజ్.. గ్రేస్ హౌస్ అనే చారిటీ సంస్థలో పని చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు వారి పనులు వారు చేసుకునేలా శిక్షణ ఇవ్వడం, అలాంటి పిల్లలతో ఎలా మసులుకోవాలనే గురించి వారి కుటుంబ సభ్యులకు ట్రైనింగ్ ఇవ్వడం, వారి కోసం కొన్ని రకాల గేమ్స్ రూపొందించి.. పిల్లలు వాటిలో పాల్గొనేలా చేయడం, ఇతర యాక్టీవిటీలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు.
(చదవండి: సంచలన కేసు.. ఆ డాక్టర్ వల్లే మా అమ్మ నన్ను లోపంతో కనింది)
ఈ క్రమంలో ఓ సారి ఆడమ్, తన భార్య లీజ్ కోసం గ్రేస్ హౌస్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ రిజిస్టర్డ్ మేనేజర్‌ని వీల్‌చైర్ యాక్సెస్ చేయగల ఊయల అవసరం గురించి అడిగాడు. దాని ధర 13 వేల పౌండ్లు (12,98,074.18 రూపాయలు) అని తెలిసి ఆశ్చర్యపోయాడు. తమ కుమార్తె ఎమిలీకి కూడా ఊయల అంటే చాలా ఇష్టం అని ఆడమ్ గుర్తు చేసుకున్నాడు. అయితే ఎమిలీలానే అందరి పిల్లలకు ఊయల ఊగే అవకాశం లేకపోవడం అతడిని కలచి వేసింది.
( ప్రతీకాత్మక చిత్రం)
దాని గురించే ఆలోచిస్తున్న ఆడమ్‌కు ఓ ఆలోచన వచ్చింది. దాని గురించి భార్యకు చెప్పాడు. ఆమె కూడా అంగీకరించింది. ఈ క్రమంలో ఆ దంపతులు రెండు కోట్ల రూపాయలు ఖరీదు చేసే వారి ఇంటిని కేవలం వంద రూపాయలకే అమ్మాలని నిర్ణయించారు. మూడు బెడ్రూంలు, లివింగ్ రూం, కార్ పార్కింగ్, గార్డెన్ సదుపాయలు గల ఇంటిని వంద రూపాయలకే అమ్మకానికి పెట్టారు.
(చదవండి: ఇల్లు కోసం కొనలేదు.. హెరిటేజ్ ప్రాపర్టీగా!)
కాకపోతే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. ఇంటిని అమ్మడం కోసం ఆడమ్ దంపతులు 100 రూపాయలు ఖరీదు చేసే 2 లక్షల టికెట్లు ముద్రించారు. అంటే మరోరకంగా చెప్పాలంటే.. తమ ఇంటిని వారు వంద రూపాయలు విలువ చేసే లాటరీ టికెట్‌గా మార్చారు. అలా 2 లక్షల టికెట్లను ప్రింట్ చేసి అమ్మసాగారు. అంటే రెండు లక్షల మంది ఈ టికెట్లను కొంటే ఒక్క లక్కీ విన్నర్‌కి.. ఇల్లు సొంతమవతుంది అన్నమాట.
అయితే ఇంటిని ఇలా అమ్మడం వెనక ఆడమ్ దంపతుల మంచి మనసు గురించి తెలుసుకున్న జనాలు.. టికెట్ కొనడం కోసం ఎగబడ్డారు. అంతేకాక వారి మంచి మనసును ప్రశంసిస్తున్నారు.
చదవండి: ఆ సిటీలో పొగ బండ్లకి ప్రత్యేక పన్ను! బెంబేలెత్తున్న వాహనదారులు
Comments
Please login to add a commentAdd a comment