ఢిల్లీ : బంగ్లాదేశ్ ప్రధాని పదవికి నిన్న రాజీనామా చేసిన షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఉన్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన వెంటనే నిన్న భారత్‌కు చేరుకున్నారు షేక్ హసీనా.ఘజియాబాద్ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు సైనిక విమానంలో వచ్చిన షేక్ హసీనా లండన్ వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు.
హసీనా వెంట ఆమె సోదరి హసీనా కూడా ఉన్నారు. ప్రస్తుతానికి రహస్య ప్రదేశంలో ఉన్న హసీనా బ్రిటన్ సర్కార్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అయితే బ్రిటన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆదేశం నుంచి అనుమతి రాగానే లండన్ బయలు దేరి వెళ్లే అవకాశం ఉంది.
దేశం విడిచి పెట్టిన షేక్ హసీనా కుమారుడు సజీవ్ వాజెద్ జాయ్ ప్రకటించారు. వెనకబడిన దేశాన్ని అభివృద్ధి పదం వైపు దూసుకెళ్లేలా చేసిన హసీనా దేశంలో చెలరేగిన అల్లర్లపై అసంతృప్తితో ఉన్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment