Specially abled children
-
కీరవాణిగారూ.. ఒక్క ఛాన్స్ ప్లీజ్: ఆర్టీసీ ఎండీ సజ్జనార్
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియాలో ఎపుడూ యాక్టివ్‌గా ఉంటారు. కేవలం ఆర్టిసీ సంస్థ,ఉద్యోగులు, సంక్షేమం, సమస్యలు ఇవి మాత్రమే కాకుండా, అనేక సామాజిక అంశాలపై కూడాపలు ఆసక్తికర విషయాలను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా సజ్జనార్ పోస్ట్ చేసిన వీడియో ఒకటి నెట్టింట విశేషంగా నిలిచింది.ఒక దివ్యాంగుడు (అంధుడు) ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ 'శ్రీ ఆంజనేయం' సినిమాలోని 'రామ రామ రఘురామ' అనే పాటను అద్భుతంగా ఆలపించిన వీడియోను ఆర్టీసీ ఎండీ ఎక్స్‌లో షేర్ చేశారు. అతన్ని ప్రశంసిస్తూ ఇలా ట్వీట్ చేశారు. 'మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో. ఈ దివ్యాంగుడు అద్భుతంగా పాడారు కదా ఒక అవకాశం ఇచ్చి చూడండి సర్' అంటూ సినీగేయ రచయిత, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. మరి దీనిపై కీరవాణి ఎలా స్పందిస్తారో చూడాలి.అద్భుతమైన గొంతుతో ఆ పాటను పాడడమే కాకుండా చేతితో, తాళం వేస్తూ లయబద్దంగా పాడటం ఆకట్టుకుంటోంది. అటు ఆ యువకుడి ప్రతిభకు నెటిజన్లు ముగ్ధులైపోయారు. నిజంగానే మట్టిలో మాణిక్యం అంటూ ప్రశించారు. ఇలాంటి వారికి అవకాశం ఇచ్చి ప్రోత్సాహాన్నివ్వాలని కోరారు.మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో..!ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా..! ఒక అవకాశం ఇచ్చి చూడండి @mmkeeravaani సర్.@tgsrtcmdoffice @TGSRTCHQ @PROTGSRTC pic.twitter.com/qu25lXVzXS— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 10, 2024 -
ఎంత మంచి మనసో: రూ. 2 కోట్ల ఇంటిని కేవలం రూ. 100కే అమ్మకం
లండన్: సాటి మనుషి కష్టంలో ఉంటే స్పందించే గుణం చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి వారు కుటుంబాన్ని, సమాజాన్ని సమానంగా ప్రేమిస్తారు. జగమంత కుటుంబం వారి సిద్దాంతం. ఈ కోవకు చెందిన దంపతుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్నాం. వారిది ఎంత మంచి మనసు అంటే.. మానసిక వికలాంగ పిల్లల కోసం రెండు కోట్ల రూపాయలు ఖరీదు చేసే వారి ఇంటిని అమ్మకానికి పెట్టారు. అది కూడా కేవలం వంద రూపాయలకు మాత్రమే. మంచి పని కోసం చేస్తున్నప్పుడు ఇంత తక్కువ ఖరీదు ఎందుకంటే.. అక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదేంటో తెలియాలంటే ఇది చదవండి యూకేకి చెందిన ఆడమ్ త్వైట్స్, అతని భార్య లిజ్, కుమార్తె ఎమిలీతో కలిసి సౌత్ టైన్‌సైడ్, ఇంగ్లండ్‌లో నివసిస్తున్నారు. లిజ్.. గ్రేస్ హౌస్ అనే చారిటీ సంస్థలో పని చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు వారి పనులు వారు చేసుకునేలా శిక్షణ ఇవ్వడం, అలాంటి పిల్లలతో ఎలా మసులుకోవాలనే గురించి వారి కుటుంబ సభ్యులకు ట్రైనింగ్ ఇవ్వడం, వారి కోసం కొన్ని రకాల గేమ్స్ రూపొందించి.. పిల్లలు వాటిలో పాల్గొనేలా చేయడం, ఇతర యాక్టీవిటీలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. (చదవండి: సంచలన కేసు.. ఆ డాక్టర్ వల్లే మా అమ్మ నన్ను లోపంతో కనింది) ఈ క్రమంలో ఓ సారి ఆడమ్, తన భార్య లీజ్ కోసం గ్రేస్ హౌస్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ రిజిస్టర్డ్ మేనేజర్ని వీల్‌చైర్ యాక్సెస్ చేయగల ఊయల అవసరం గురించి అడిగాడు. దాని ధర 13 వేల పౌండ్లు (12,98,074.18 రూపాయలు) అని తెలిసి ఆశ్చర్యపోయాడు. తమ కుమార్తె ఎమిలీకి కూడా ఊయల అంటే చాలా ఇష్టం అని ఆడమ్ గుర్తు చేసుకున్నాడు. అయితే ఎమిలీలానే అందరి పిల్లలకు ఊయల ఊగే అవకాశం లేకపోవడం అతడిని కలచి వేసింది. ( ప్రతీకాత్మక చిత్రం) దాని గురించే ఆలోచిస్తున్న ఆడమ్‌కు ఓ ఆలోచన వచ్చింది. దాని గురించి భార్యకు చెప్పాడు. ఆమె కూడా అంగీకరించింది. ఈ క్రమంలో ఆ దంపతులు రెండు కోట్ల రూపాయలు ఖరీదు చేసే వారి ఇంటిని కేవలం వంద రూపాయలకే అమ్మాలని నిర్ణయించారు. మూడు బెడ్రూంలు, లివింగ్ రూం, కార్ పార్కింగ్, గార్డెన్ సదుపాయలు గల ఇంటిని వంద రూపాయలకే అమ్మకానికి పెట్టారు. (చదవండి: ఇల్లు కోసం కొనలేదు.. హెరిటేజ్ ప్రాపర్టీగా!) కాకపోతే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. ఇంటిని అమ్మడం కోసం ఆడమ్ దంపతులు 100 రూపాయలు ఖరీదు చేసే 2 లక్షల టికెట్లు ముద్రించారు. అంటే మరోరకంగా చెప్పాలంటే.. తమ ఇంటిని వారు వంద రూపాయలు విలువ చేసే లాటరీ టికెట్‌గా మార్చారు. అలా 2 లక్షల టికెట్లను ప్రింట్ చేసి అమ్మసాగారు. అంటే రెండు లక్షల మంది ఈ టికెట్లను కొంటే ఒక్క లక్కీ విన్నర్‌కి.. ఇల్లు సొంతమవతుంది అన్నమాట. అయితే ఇంటిని ఇలా అమ్మడం వెనక ఆడమ్ దంపతుల మంచి మనసు గురించి తెలుసుకున్న జనాలు.. టికెట్ కొనడం కోసం ఎగబడ్డారు. అంతేకాక వారి మంచి మనసును ప్రశంసిస్తున్నారు. చదవండి: ఆ సిటీలో పొగ బండ్లకి ప్రత్యేక పన్ను! బెంబేలెత్తున్న వాహనదారులు -
ఆ బాలుడి సంకల్పాన్ని చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!
-
ఆ బాలుడి సంకల్పానికి ఫిదా అవ్వాల్సిందే!
న్యూఢిల్లీ: మనో నిబ్బరం ఉండాలేగానీ సాధించలేనిది ఏదీ ఉండదు. ఇందుకు ఈ దివ్యాంగ బాలుడి ఆటే నిదర్శనం. అతని ధైర్యం ముందు వైకల్యం ఓటమితో తల వంచింది. సంకల్ప బలంతో.. మనో నిబ్బరంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నాడు. తన మిత్రులతో కలసి వారితో సమానంగా క్రికెట్ ఆడుతూ.. కళ్లు చెదిరే షాట్స్ కొట్టడమే కాకుండా వికెట్ల మధ్య అతను చేతులతో చేసే రన్నింగ్‌ను చూసి అతని సంకల్పానికి కళ్లు ఆర్పకుండా చూస్తూ ఉండిపోతున్నారు. ఐఎఫ్ఎస్ అధికారిని సుధా రమెన్ ట్వీట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. చదవండి: స్ర్కీన్ మీదనే కాదు.. నిజజీవితంలోనూ హీరోనే..! ‘అతడి ఆట చూసి నాకు మాటలు రావడం లేదు. క్రికెట్‌ను ఇష్టపడేవారు.. ఇష్టం లేనివారు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది’ అంటూ ఆమె ఈ వీడియోను పోస్టు చేశారు. వీడియోని చూసిన నెటిజన్లు అతడి ఆటకు హాట్సాఫ్ చెప్తున్నారు. కాళ్లను నేలపై ఈడ్చుకుంటూ మరో చేతితో బ్యాట్ పట్టుకొని పరిగెత్తడం చూస్తే నిరాశలో ఉన్నవారికి, వైకల్యంతో బాధపడతున్న ఎంతో మందికి అతడు స్ఫూర్తిగా నిలుస్తాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
దివ్యాంగులతో కోహ్లీ అండ్ టీం
న్యూఢిల్లీ: ఐపీఎల్ అంటేనే బిజీగా ఉండే క్రికెటర్లు ఏమాత్రం సమయం దొరికినా వారికి ఇష్టమైన పనులు చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితమే భారత క్రికెటర్ బెంగళూరు కెప్టెన్ శునకాల చికిత్స కేంద్రాన్ని సందర్శించి కుక్క పిల్లలపై ఉన్న తన ప్రేమను చాటుకున్నాడు. తాజాగా కోహ్లీ తామహర్లోని దివ్యాంగులైన చిన్న పిల్లల ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని తన టీం మెంబర్స్ డివిలియర్స్, షేన్ వాట్సన్ లతో కలిసి సందర్శించాడు. ప్రస్తుత జనరేషన్ లో ప్రముఖ క్రికెటర్ గా బీజీగా ఉన్న కోహ్లీ , తన ప్రత్యేక అభిమానులకు మాత్రం సమయం కేటాయిస్తున్నాడు. ముఖ్యంగా చిన్న పిల్లల సంరక్షణ కోసం ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తూ ప్రమోట్ చేస్తున్నాడు. కోహ్లీ గురువారం డివిలియర్స్, వాట్సన్ లతో దివ్యాంగులైన చిన్న పిల్లలతో తీసుకున్న ఫోటోకు క్యాప్షన్‌గా " ఇది ప్రత్యేకమైన సమయమని, జీవితంలో చిన్న విషయాలకు సంతోషంగా ఎలా ఉండాలో వీరి నుంచి నేర్చుకున్నామని' ఇన్ స్ట్రాగ్రామ్ లో ఫోస్ట్ చేశాడు. కోహ్లీ చిన్న పిల్లల కోసం విరాట్ కోహ్లీ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇంతకు ముందే మానసికంగా బలహీనమైన పిల్లల సాధికారత కోసం కృషి చేస్తున్న స్మైల్ ఫౌండేషన్ తో కోహ్లీ ఫౌండేషన్ చేతులు కలిపింది.