తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియాలో ఎపుడూ యాక్టివ్‌గా ఉంటారు. కేవలం ఆర్టిసీ సంస్థ,ఉద్యోగులు, సంక్షేమం, సమస్యలు ఇవి మాత్రమే కాకుండా, అనేక సామాజిక అంశాలపై కూడాపలు ఆసక్తికర విషయాలను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా సజ్జనార్ పోస్ట్ చేసిన వీడియో ఒకటి నెట్టింట విశేషంగా నిలిచింది.
ఒక దివ్యాంగుడు (అంధుడు) ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ 'శ్రీ ఆంజనేయం' సినిమాలోని 'రామ రామ రఘురామ' అనే పాటను అద్భుతంగా ఆలపించిన వీడియోను ఆర్టీసీ ఎండీ ఎక్స్‌లో షేర్ చేశారు. అతన్ని ప్రశంసిస్తూ ఇలా ట్వీట్ చేశారు. 'మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో. ఈ దివ్యాంగుడు అద్భుతంగా పాడారు కదా ఒక అవకాశం ఇచ్చి చూడండి సర్' అంటూ సినీగేయ రచయిత, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. మరి దీనిపై కీరవాణి ఎలా స్పందిస్తారో చూడాలి.
అద్భుతమైన గొంతుతో ఆ పాటను పాడడమే కాకుండా చేతితో, తాళం వేస్తూ లయబద్దంగా పాడటం ఆకట్టుకుంటోంది. అటు ఆ యువకుడి ప్రతిభకు నెటిజన్లు ముగ్ధులైపోయారు. నిజంగానే మట్టిలో మాణిక్యం అంటూ ప్రశించారు. ఇలాంటి వారికి అవకాశం ఇచ్చి ప్రోత్సాహాన్నివ్వాలని కోరారు.
మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో..!
ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా..! ఒక అవకాశం ఇచ్చి చూడండి @mmkeeravaani సర్.@tgsrtcmdoffice @TGSRTCHQ @PROTGSRTC pic.twitter.com/qu25lXVzXS— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 10, 2024
Comments
Please login to add a commentAdd a comment