దివ్యాంగులతో కోహ్లీ అండ్ టీం
దివ్యాంగులతో కోహ్లీ అండ్ టీం
Published Thu, Apr 20 2017 6:57 PM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM
న్యూఢిల్లీ: ఐపీఎల్ అంటేనే బిజీగా ఉండే క్రికెటర్లు ఏమాత్రం సమయం దొరికినా వారికి ఇష్టమైన పనులు చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితమే భారత క్రికెటర్ బెంగళూరు కెప్టెన్ శునకాల చికిత్స కేంద్రాన్ని సందర్శించి కుక్క పిల్లలపై ఉన్న తన ప్రేమను చాటుకున్నాడు. తాజాగా కోహ్లీ తామహర్లోని దివ్యాంగులైన చిన్న పిల్లల ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని తన టీం మెంబర్స్ డివిలియర్స్, షేన్ వాట్సన్ లతో కలిసి సందర్శించాడు. ప్రస్తుత జనరేషన్ లో ప్రముఖ క్రికెటర్ గా బీజీగా ఉన్న కోహ్లీ , తన ప్రత్యేక అభిమానులకు మాత్రం సమయం కేటాయిస్తున్నాడు. ముఖ్యంగా చిన్న పిల్లల సంరక్షణ కోసం ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తూ ప్రమోట్ చేస్తున్నాడు.
కోహ్లీ గురువారం డివిలియర్స్, వాట్సన్ లతో దివ్యాంగులైన చిన్న పిల్లలతో తీసుకున్న ఫోటోకు క్యాప్షన్గా " ఇది ప్రత్యేకమైన సమయమని, జీవితంలో చిన్న విషయాలకు సంతోషంగా ఎలా ఉండాలో వీరి నుంచి నేర్చుకున్నామని' ఇన్ స్ట్రాగ్రామ్ లో ఫోస్ట్ చేశాడు. కోహ్లీ చిన్న పిల్లల కోసం విరాట్ కోహ్లీ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇంతకు ముందే మానసికంగా బలహీనమైన పిల్లల సాధికారత కోసం కృషి చేస్తున్న స్మైల్ ఫౌండేషన్ తో కోహ్లీ ఫౌండేషన్ చేతులు కలిపింది.
Advertisement
Advertisement