అద్దె ఇంటిని కొనుగోలు చేసిన యంగ్ రెబల్ స్టార్‌..! | Tollywood Hero Rebal Star Prabhas Buy His Rented Home In London | Sakshi
Sakshi News home page

Prabhas: నెలకు రూ.కోటి అద్దె చెల్లించిన ప్రభాస్‌.. ఇప్పుడేమో!

Published Wed, Mar 27 2024 3:00 PM | Last Updated on Wed, Mar 27 2024 3:34 PM

Tollywood Hero Rebal Star Prabhas Buy His Rented Home In London - Sakshi

టాలీవుడ్ రెబల్ స్టార్‌ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. సలార్‌ సినిమాతో మెప్పించిన ప్రభాస్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. లండన్‌లో ఓ లగ్జరీ హౌస్‌ను ఆయన కొన్నారన్న నెట్టింట మాత్రం హల్‌చల్‌ చేస్తోంది. గతంలో షూటింగ్స్‌, వేకేషన్‌కు వెళ్లినప్పుడు అద్దె ఇంట్లో వారని తెలుస్తోంది. అంతే దాదాపూ కోటి రూపాయల రెంట్ చెల్లించేవారని సమాచారం. తాజాగా ఆ ఇంటినే భారీ ధరకు కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత అనేది క్లారిటీ లేదు. 

(ఇది చదవండి: 'కల్కి' ప్రభాస్‌ పాత్ర గురించి స్వప్నదత్‌ ఆసక్తికర కామెంట్స్‌)

సలార్‌తో సూపర్‌ హిట్ కొట్టిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణే, అమితాబ్‌ బచ్చన్‌, దిశా పటానీ, కమల్ హాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు టాలీవుడ్ డైరెక్టర్‌ మారుతితో రాజాసాబ్‌ అనే చిత్రంలో నటించనున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement