Married Couple Fell Down Video Goes Viral - Sakshi
Sakshi News home page

Viral Video: పెళ్లి వేడుకలో ఊహించని ఘటన.. బొక్కబొర్లాపడ్డ వధూవరులు..

Published Mon, Dec 13 2021 4:53 PM | Last Updated on Mon, Dec 13 2021 7:48 PM

Viral Video: Couple Injured After Falling Off Swing at Raipur Wedding - Sakshi

రాయ్‌పూర్‌: వివాహం అనేది ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడానికి వేసే తొలి అడుగు. కష్టాల్లోనూ, సుఖాల్లోనూ ఒకరిఒకరం తోడుంటామని చేసే వాగ్ధానం.  తమ పద్దతులకు, ఆచారాలకు అనుగుణంగా జరుపుకునే వేడుక. ప్రతీ జంట తమ పెళ్లిని ఓ పండుగలా, వినూత్నంగా జరుపుకోవాలని అనుకుంటారు. ఎవరి ఇష్టాలు, స్థాయిలను బట్టి  వివాహ వేడుకలను నిర్వహిస్తారు. కొందరైతే పెళ్లి కోసం ఏకంగా ఈవెంట్‌ మేనేజర్లను నియమించుకుంటారు.

ఇందులో భాగంగా హల్దీ వేడుకలు, సంగీత్‌, వధువరుల డ్రెస్సింగ్, పెళ్లి వేదికపై ఎంట్రీ, రిసెప్షన్  ఇలా అన్నింటికీ వినూత్నంగా రూపొందిస్తారు. గాల్లో ఊయల ఏర్పాటు చేయడం, రథాల్లో తీసుకురావడం, పల్లికిలో వధువును తీసుకురావడం కూడా  చేస్తారు. అయితే తాజాగా ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో ఆదివారం ఎంతో వైభవంగా జరిగిన ఒక పెళ్లిలో వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. వేదిక చుట్టూ ఒకవైపు డ్యాన్సులు, మరోవైపు విద్యుత్త్‌ కాంతులతో మెరిసిపోతుంది. అప్పుడే బాణసంచా వెలుగులు మధ్య అందంగా అలంకరించిన ఓ ఊయలపై వధూవరులు ఎక్కారు.
చదవండి: 77 ఏళ్ల వయసు ... స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్‌! అయినా ఐస్‌ స్కేటింగ్‌ చేశాడు!!

అది మెల్లగా పైకి లేవడంతో ఉన్నట్టుండి ఊయలకు ఉన్న ఒకవైపు తాడు తెగిపోవడంతో 12 అడుగుల ఎత్తు నుంచి వధువరులు కిందపడ్డారు. దీంతో పెళ్లి హాజరైన వారంతా ఒక్కసారిగా కంగారు పడ్డారు. వధూవరులను రక్షించేందకు వేదిక వద్దకు కొందరు పరుగుల పెట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనకు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ బాధ్యత వహించి క్షమాపణలు చెప్పింది. కాగా ఈ దృశ్యాలను కొందరు మొబైల్స్‌లో చిత్రీకరించగా వాటిని  సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారాయి. దీనిని చూసిన నెటిజన్లు వధూవరుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇలాంటి సాహసాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
చదవండి: ఏకంగా పది కరోనా వ్యాక్సిన్‌లు వేయించుకున్న మహానుభావుడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement