లండన్: ఇస్లామోఫోబియాతో లండన్‌లో విద్వేష నేరాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలికాలంలో యూరప్‌లో ముస్లింలపై దాడులు జరుగుతున్న ఘటనలు పెరుగుతున్నట్టు కనిపిస్తున్నది. లండన్‌లో ఓ ముస్లిం మహిళపై సాటి మహిళలే దాడి చేసి బస్సులోంచి గెంటేశారు. తలచుట్టూ సంప్రదాయబద్ధమైన రుమాలు ధరించిన 40 ఏళ్ల ముస్లిం మహిళ బస్సులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న 20 ఏళ్ల ఇద్దరు యువతులు ఆమెపై దాడి చేశారు.
ముఖంపై పిడిగుద్దులు కురిపిస్తూ ఆమెను బస్సు నుంచి బయటకు తోసేశారు. నిస్సహాయంగా పేవ్‌మెంట్ మీద పడిపోయిన బాధితురాలిపై జ్యాత్యాంహకార వ్యాఖ్యలు చేస్తూ దుర్భాషలాడారు. దక్షిణ లండన్‌లో అక్టోబర్ 28న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితురాళ్లను పోలీసులు తాజాగా గుర్తించారు. సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను ఇద్దరిని పోలీసులు గుర్తించారు. పరారీలో ఇద్దరు నిందితురాళ్లను పట్టుకునేందుకు లండన్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
ముస్లిం మహిళను బస్సులోంచి తోసేశారు!
Published Wed, Dec 16 2015 8:11 PM | Last Updated on Tue, Oct 16 2018 5:59 PM
Advertisement
Advertisement