మత్స్యకారుల అభివృద్ధికి ప్రణాళికలు
మత్స్యకారుల అభివృద్ధికి ప్రణాళికలు
Published Wed, Oct 5 2016 10:07 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
వేములపల్లి : మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందించిందని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు తెలిపారు. బుధవారం వేములపల్లి చిన్నచెరువు, పెద్ద చెరువులో చేప పిల్లలను విడిచిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. దళారులు, కాంట్రాక్టర్ల ఆదిపత్యం వల్ల సొసైటీ సభ్యులు ఆర్థికంగా ఎదగలేకపోతున్నారనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచితంగా చేప పిల్లలను సరఫరా చేయాలని నిర్ణయించారని పేర్కొన్నారు. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 485 చెరువులను ఎంపిక చేసి 5కోట్ల 85 లక్షల చేప పిల్లలను సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. ఆయా చెరువుల్లో వదలడానికి చేప పిల్లలను సంబంధిత సొసైటీ సభ్యులకు అందజేస్తున్నట్లు తెలిపారు. మత్స్యకార సొసైటీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నామిరెడ్డి రవీణా కరుణాకర్ రెడ్డి, జెడ్పీటీసీ ఇరుగుదిండ్ల పద్మ, రావుయల్లారెడ్డి, సర్పంచ్ జడరాములు యాదవ్, ఎంపీటీసీ పుట్టల సత్యవతి భాస్కర్, సొసైటీ అధ్యక్షుడు పందిరి శ్రీనివాస్, మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాధా రోహిణి, ఎఫ్‌డీఓ అంజయ్య, నాయకులు చిర్రమల్లయ్య యాదవ్, పాలుట్ల బాబయ్య, పందిరి ప్రతాప్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement