ట్రెండ్స్ స్థిరంగా ఉండనట్లే ఆలోచనలు, అభిప్రాయాలు కూడా స్థిరంగా ఉండవు. జెన్ జెడ్, మిలీనియల్స్ కొత్త ప్రయాణం కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? యోలో(వైవోఎల్‌వో–యూ వోన్లీ లివ్ వన్స్) సెగ్మెంట్‌లో ఉన్న యువతరం అవసరానికి మించి ఖర్చు చేయడానికి తప్ప‘ఆర్థిక భద్రత’కు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేది కాదు. అయితే ఈ ధోరణిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. ‘యోలో’ నుంచి 50–30–20 కాన్సెప్ట్ వైపు ప్రయాణించడానికి యువతరం ఆసక్తి చూపుతున్నారు...
సినిమాల గురించి తప్ప మరో లోకంతో సంబంధం లేనట్లుగా ఉండే మిలీనియల్స్, జెన్ జెడ్ ఇప్పుడు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ నుంచి పబ్లిక్‌ప్రావిడెంట్ ఫండ్ వరకు ఎన్నో విషయాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఐపీ) అనేది మ్యూచువల్ ఫండ్స్‌లో నిర్ణీత మొత్తాన్ని నెలవారీ లేదా త్రైమాసికం చొప్పున పెట్టుబడిగా పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ.
పబ్లిక్‌ప్రావిడెంట్ ఫండ్(పిపిఎఫ్) అనేది ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, ట్యాక్స్ బెనిఫిట్స్‌ను అందించే దీర్ఘకాలిక పొదుపు పథకం. పదిహేను సంవత్సరాల లాక్–ఇన్ వ్యవధిని కలిగి ఉన్న ప్రభుత్వ పథకం ఇది.‘హెల్త్ ఇన్సూరెన్స్’ అనే మాట వినబడగానే ‘ఇది నాకు సంబంధించిన విషయం కాదు’ అన్నట్లుగా పట్టించుకునే వారు కాదు చాలా మంది. ‘హెల్త్ ఇన్సూరెన్స్’ అనేది వయసు మళ్లిన వారికి సంబంధించిన విషయం అన్నట్లుగా ఉండేవారు. అయితే ఇప్పుడు సీన్ మారింది.
ఎర్లీ ఏజ్‌లోనే హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తగిన అవగాహనతో ఉన్నారు. అన్ ఎక్స్‌పెక్టెడ్ మెడికల్ సిచ్యువేషన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక బడ్జెట్ కేటాయించుకుంటున్నారు. యాన్యువల్ హెల్త్‌బడ్జెట్‌ను ప్లాన్‌చేసుకుంటున్నారు. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ‘పర్సనల్ యాక్సిడెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్’పై ఆసక్తి చూపుతున్నారు.
‘సరైన ఆరోగ్య బీమా పథకాన్ని ఎంపిక చేసుకోవడం అనేది జీవన ప్రయాణానికి దిక్సూచి లాంటిది’ అనే మాటను దృష్టిలో పెట్టుకొని హడావిడిగా కాకుండా ఆచి తూచి సరిౖయెన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకుంటున్నారు. ‘ఫైనాన్షియల్ ప్లాన్’ అనే మాట వినబడగానే ఒకప్పుడు యువతరం నోటి నుంచే వచ్చే మాటలు... ‘అబ్బే! అంత టైమ్ లేదు’ ‘ఫైనాన్షియల్ విషయాలు నాకు బొత్తిగా తెలియవు’ ఇప్పుడు మాత్రం ‘బొత్తిగా తెలియదు’ అనుకునే విషయాలపై టైమ్ చేసుకొని మరీ ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు.
ఈ క్రమంలో మిలీనియల్స్, జెన్ జెడ్‌ను బాగా ఆకట్టుకున్న కాన్సెప్ట్ 50–30–20 ‘50–30–20’ కాన్సెప్ట్ ప్రకారం సం΄ాదించే జీతంలో అనివార్య ఖర్చులకు 50 శాతం ఖర్చుచేయాలి. ఇంటి అద్దె నుంచి భోజన ఖర్చు వరకు ఇందులో ఉంటాయి. వ్యక్తిగత అవసరాలు, సరదాల కోసం 30 శాతం ఖర్చు చేయాలి. ట్రెండీ దుస్తులు కొనుక్కోవడం నుంచి సినిమాలు చూడడం వరకు ఇందులో వస్తాయి. 20 శాతం మాత్రం తప్పనిసరిగా పొదుపు చేయాలి.
‘మిలీనియల్స్‌లో చాలామంది ఇన్సూరెన్స్‌ల గురించి పట్టించుకోవడం లేదు. అనారోగ్యం లేదా ప్రమాదం జరిగిన సందర్భాల్లో మన ఖజానా అంతా ఖాళీ అవుతుంది. దిక్కు తోచని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే లైఫ్, హెల్త్, ఆటో ఇన్సూరెన్స్‌పై మిలీనియల్స్ తప్పనిసరిగా దృష్టి పెట్టాలి’ అంటున్నాడు ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ శరద్ కోహ్లీ. శరద్ సలహా చదివి మారిన వారిలో తేజస్విని ఒకరు.
దిల్లీకి చెందిన తేజస్వినికి ఇన్సూరెన్స్ పాలసీల గురించి ఆసక్తి, అవగాహన లేదు. ఇప్పుడు మాత్రం రకరకాల పాలసీల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఉద్యోగాలు చేస్తున్న మిలీనియల్స్, జెన్ జెడ్ దగ్గర ‘ఇన్వెస్ట్‌మెంట్ ఫర్ రిటైర్‌మెంట్’ ప్రస్తావన తెస్తే పెద్దగా నవ్వుతారు లేదా ‘రిటైర్‌మెంట్ గురించి ఇప్పటి నుంచే ఆలోచించడం ఎందుకు!’ అన్నట్లుగా మాట్లాడుతారు. అయితే ఈ ధోరణిలో కూడా మెల్లగా మార్పు వస్తుంది.
‘రిటైర్‌మెంట్ లేదా భవిష్యత్ కోసం దాచుకున్న డబ్బు అత్యవసర సమయాల్లోనే కాదు విదేశీ ప్రయాణం చేయాలి లాంటి చిరకాల కలలను నిజం చేసుకోవడానికి ఉపయోగపడవచ్చు. ప్రతి ఉద్యోగి ఏదో ఒకరోజు రిటైర్ కావాల్సిందే. కొన్ని సమయాల్లో ముందస్తు పదవీ విరమణ తప్పనిసరి కావచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ ఫర్ రిటైర్‌మెంట్‌ను తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి’ అంటున్నాడు శరద్ కోహ్లీ.
స్టాక్ మార్కెట్ నుంచి మనీ మేనేజ్‌మెంట్ వరకు సోషల్ మీడియాలో ఎంటర్‌టైన్‌మెంట్‌కు మాత్రమే యువతప్రాధాన్యత ఇస్తుంది. స్టాక్‌మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లాంటి మాటలు వినబడితే దూరంగా పారిపోయే వారిని కూడా తన మాటలతో, రాతలతో ఆకట్టుకొని నాలుగు మంచి విషయాలు చెబుతుంది నేహా నగార్. ఎంబీయే చేసిన నేహా స్టార్ ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా యువతలో ఎంతోమంది ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చింది.
స్టాక్‌మార్కెట్, క్రిప్టోకరెన్సీ, ట్యాక్స్‌యేషన్, ట్రేడింగ్ నుంచి మనీ మేనేజ్‌మెంట్ వరకు ఎన్నో విషయాలను సులభంగా అర్థం అయ్యేలా చెబుతుంది. ‘మనం ఎలా చెబుతున్నాం అనేదానిపై అవతలి వారి ఆసక్తి ఆధారపడి ఉంటుంది. ఆకట్టుకునేలా, సులభంగా అర్థమయ్యేలా చెప్పగలితే వారు మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు’ అంటుంది నేహా నాగర్.
-నేహా నాగర్ ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్
Comments
Please login to add a commentAdd a comment